
కామరాజ్ సూత్రాన్ని అమలు చేయాలి
కామరాజ్ ప్లాన్ ప్రకారం పార్టీని క్షేత్రస్థాయి నుంచి సీడబ్లు్యసీ దాకా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని ఎన్‌డీఎంఏ మాజీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్
ఏఐసీసీకి మర్రి శశిధర్‌రెడ్డి లేఖ.. పార్టీ ప్రక్షాళన అవసరమని సూచన
సాక్షి, హైదరాబాద్: కామరాజ్ ప్లాన్ ప్రకారం పార్టీని క్షేత్రస్థాయి నుంచి సీడబ్లు్యసీ దాకా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని ఎన్‌డీఎంఏ మాజీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు, తదితరులకు రాసిన లేఖను బుధవారం ఆయన మీడియాకు విడుదల చేశారు. పార్టీ ప్రక్షాళనకోసం కామరాజ్ ప్లాన్‌ను అమలు చేయాల్సిన తరుణమిదేనని ఆ లేఖలో పేర్కొన్నారు.
2014 ఎన్నికల తర్వా త కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధి కారం కోల్పోవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు రావడానికి కారణాలను విశ్లేషించి, ఓటమి నుంచి పాఠాల్ని నేర్చుకోవాలన్నారు. ఏఐసీసీ సహా అన్ని స్థాయిల్లో నేతలు రాజీనామాల్ని ఉపాధ్య క్షుడు రాహుల్ గాంధీకి సమర్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు, యువకులకు అవకాశం వచ్చేలా కామరాజ్ సూత్రాన్ని అమలు చేయాలన్నారు.