సాక్షి, హైదరాబాద్: ఓటరు నమోదు కార్యక్రమం అస్తవ్యస్తంగా సాగుతోందని, ఓటర్లకు న్యాయం చేసేందుకే తాము కోర్టులో పోరాడుతున్నామని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రిశశిధర్‌రెడ్డి అన్నారు. ఇష్టం ఉన్న వారి ఓట్లను జాబితాలో ఉంచి, లేని వారి ఓట్లను తొలగిస్తున్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు.
శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ తాము వేసిన కేసులో కౌంటర్ దాఖలు సందర్భంగా హైకోర్టును తప్పుదోవ పట్టించేలా చెప్పిన అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాల్లో చాలా తప్పులున్నాయని, ఓటర్ల తుదిజాబితా అర్ధరాత్రి విడుదల చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఓటరు నమోదు అవకతవకలపై తాము వేసిన కేసు హైకోర్టులో సజీవంగా ఉందని, ఈనెల 31న మరోసారి విచారణకు రానుందని శశిధర్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment