
సాక్షి, హైదరాబాద్: ఓటర్ జాబితా సవరణపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు మర్రి శశిధర్‌రెడ్డి నేతృ త్వంలో పీసీసీ ఎన్నికల కమిషన్ కో–ఆర్డినేషన్ కమిటీని నియమించింది. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల్లో అవ గాహన కల్పించేందుకు ఈ నెల 5 (సోమవారం) నుంచి 10 వ తేదీ వరకు జిల్లాల్లో కమిటీ పర్యటించనుంది. రాష్ట్రంలోని 83 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న జాబితా సవరణ కార్యక్రమాన్ని పర్యవే క్షించనుంది.
జిల్లా కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో జరిగే ఓటర్ల జాబితా సవరణల అవగాహన సమా వేశాల్లో పాల్గొంటుంది. 5న నిజామాబాద్, ఆదిలా బాద్.. 6న కరీంనగర్, 7న వరంగల్, ఖమ్మం, 8న నల్లగొండ, రంగారెడ్డి, 9న మెదక్, 10న మహబూబ్ నగర్ జిల్లాల్లో కమిటీ పర్యటిస్తుందని కమిటీ సభ్యుడు జి.నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. శశిధర్‌రెడ్డితో పాటు కమిటీ సభ్యులు బి.కమలాకర్‌రావు, ఎ.శ్యామ్ మోహన్, అబిద్ రసూల్‌ఖాన్, వినోద్‌రెడ్డి, ప్రేమలత అగర్వాల్, టి.నరేందర్, పి.రాజేశ్ పాల్గొంటారన్నారు.