
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఈ నెల 3న సిరిసిల్లలో నిర్వహిం చిన సభలో చేనేత కార్మి కులకు బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో సీఈవో రజత్‌కుమార్‌ను కలసి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ముదిరాజ్‌ల సభ, యాదవుల సభ ఏర్పాటు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. బ్రాహ్మణ సంఘం సమావేశం లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెల 28న కేసీఆర్ ప్రత్యేక విమానంలో రాజకీయాల కోసమే ఢిల్లీ పర్యటన చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment