complainant
-
కారాగారానికి కీచక డీఎస్పీ
తుమకూరు: ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళకు సహాయం చేయాల్సింది పోయి, అసభ్యంగా ప్రవర్తించిన కేసులో మధుగిరి డీఎస్పీ పీ.రామచంద్రప్పకు మధుగిరి తాలూకా ఆస్పత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. శుక్రవారం రాత్రి రామచంద్రప్పను అరెస్టు చేసి శనివారం మధుగిరి జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు. జడ్జి ప్రమీల 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. డీఎస్పీ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్‌రెడ్డి వాదనలు వినిపించగా, బాధితురాలికి వాదనలకు 7 వరకు గడువు ఇచ్చారు. తరువాత నిందితున్ని జిల్లా జైలుకు తరలించారు. నిందితుడు రామచంద్రప్ప పోలీసు స్టేషన్లోనే రాత్రంతా కూర్చున్నారు. ఓ స్థల వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో డీఎస్పీ పోలీసు స్టేషన్లోనే అసభ్యంగా ప్రవర్తించారు. ఆ వీడియో శుక్రవారం బయటకు రాగా, డీజీపీ ఆయనను సస్పెండ్ చేశారు.పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్WATCH | A woman went to Madhugiri DYSP Ramachandrappa's office in Pavagada, #Karnataka, to file a land dispute complaint.Allegedly, the DYSP took her to his restroom & sexually assaulted her, claiming to help with the dispute. A video of the incident was recorded.This issue… pic.twitter.com/tfEm3qRK15— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 3, 2025 -
పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్
తుమకూరు: సాక్షాత్తూ హోం మంత్రి సొంత జిల్లాలోనే మహిళకు భద్రత కరువైంది. అది కూడా పోలీసు స్టేషన్లోనే ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళతో డీఎస్పీ అసభ్యకరంగా వ్యవహరించాడు. ఈఘటన తుమకూరు జిల్లా మధుగిరిలో గురువారం జరిగింది. పావగడ నుంచి పొలం వ్యాజ్యానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చేందుకు ఓ మహిళ మధుగిరి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడే ఉన్న డీఎస్పీ రామచంద్రప్ప సదరు మహిళను తన కార్యాలయంలోని మరుగుదొడ్డిలోకి పిలుచుకెళ్లి అసభ్యకరంగా తాకుతూ వేధించాడు. కొందరు కిటికీ గుండా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో డీఎస్పీ రామచంద్రప్ప తప్పించుకుని పరారయ్యారు. హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ సొంత జిల్లాలోనే ఈ కృత్యం జరగడంతో యావత్ పోలీసు శాఖ తలదించుకొనేలా చేసింది. సదరు డీఎస్పీని విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. కాగా ఈ ఘటనపై ఆ జిల్లా ఎస్పీ కేవీ అశోక్ స్పందిస్తూ ఇదొక పోలీసు శాఖ గౌరవాన్ని భంగపరిచే నీచకృత్యమన్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. తాను కూడా ఆ వీడియోను చూశానన్నారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాఖలో మహిళలపై దౌర్జన్యాన్ని సహించబోనన్నారు. బాధిత మహిళ ఫిర్యాదు చేస్తే డీఎస్పీపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ అరెస్ట్డీఎస్పీ రామచంద్రప్పను మధుగిరి పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. WATCH | A woman went to Madhugiri DYSP Ramachandrappa's office in Pavagada, #Karnataka, to file a land dispute complaint.Allegedly, the DYSP took her to his restroom & sexually assaulted her, claiming to help with the dispute. A video of the incident was recorded.This issue… pic.twitter.com/tfEm3qRK15— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 3, 2025 -
పొలిమేర-2 నిర్మాతకు బెదిరింపులు.. దిల్ రాజుకు ఫిర్యాదు!
సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో గతేడాది సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేశారు. పొలిమేర-2 సైతం థియేటర్లలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు హిట్ కావడంతో పొలిమేర-3 కూడా ఉంటుందని ప్రకటించారు.అయితే తాజాగా పొలిమేర 2 చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజుకు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, అతడి టీమ్ నుంచి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.నిర్మాత గౌరీ కృష్ణ తన లేఖలో రాస్తూ..'ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రసన్న కుమార్ తన అధికారన్ని దుర్వినియోగం చేసి.. నన్ను బెదిరించి ఒత్తిడితో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా వంశీ నందిపాటి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నేను పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఒప్పందం మేరకు వంశీ నందిపాటికి ఇచ్చా. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కానీ వంశీ నందిపాటి ఇప్పటివరకు లాభాల్లో ఎలాంటి వాటా ఇవ్వలేదు. ఆయన నా వద్ద నుంచి ఖాళీ చెక్కులు, సంతకాలు చేసిన లేఖలు, ఖాళీ బాండ్ పేపర్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నన్ను సంప్రదించకుండానే పొలిమేర -3 సినిమాను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి మరో నిర్మాతకు రాకూడదు. ఫిల్మ్ ఛాంబర్‌పై న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది' అని ప్రస్తావించారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే తనను బెదిరిస్తున్నారంటూ గౌరీ కృష్ణ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
చినబాబు బ్యాచ్ చిత్రహింసలు!
సాక్షి, అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్ చేసి రాత్రంతా చిత్ర హింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజ్‌కుమార్ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేశ్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు.వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమానభారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్టప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ.. ⇒ మంగళగిరి నియోజకవర్గంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశా. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేశ్ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. ⇒ ఈ నెల 9వతేదీన సాయంత్రం 4.30 గంటల సమయంలో నారా లోకేశ్‌కు సన్నిహితుడైన జవ్వాడి కిరణ్‌చంద్ అనుచరులు నరేంద్ర, షేక్ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు. ఫరీ్నచర్‌ను ధ్వంసం చేశారు. ఏపీ 39 జీబీ 3333 వాహనంలో నన్ను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. నా చొక్కా విప్పించి నారా లోకేశ్ ప్లెక్సీ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముకుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈనెల 10వతేదీ తెల్లవారు జాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్సార్ సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ⇒ నాపై దాడి చేసిన వారిపై అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్ నెంబరు 78/2024) చేశా. ఫిర్యాదు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ⇒ మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కలి్పంచాలి. నా ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా. -
చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్ లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి!
అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఒకప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్లైన్నంబర్కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 12 బోర్డు పరీక్షలకు తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్‌లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్‌ను సంప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయమని సూచించింది. అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు. అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో ఉండే పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది. 10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది. కాగా గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ, మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే విమర్శలకు తావిస్తోంది. -
ఫార్మ్ హౌస్ హైడ్రామాపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
-
నేను..సీవీ ఆనంద్‌ను మాట్లాడుతున్న..
బంజారాహిల్స్: తన నివాసిత ప్రాంతం చుట్టుపక్కల రాత్రిపూట శబ్ద కాలుష్యం నెలకొందని చర్యలు, తగిన తీసుకోవాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు కొద్దిసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న ప్లజెంట్ వ్యాలీలో నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం పెరగడంతో ఆయన వెంటనే 100కు డయల్ చేశారు. నైట్‌డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడికి వెళ్లి పరిశీలించగా సమీపంలోని ఓం నగర్ బస్తీలో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తూ డప్పులు వాయిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే నిర్వాహకులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని 70బి కింద పెట్టీ కేసు నమోదు చేశారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. స్వయంగా సీపీ 100కు డయల్ చేయడం అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. (చదవండి: పెట్స్.. అదో స్టేటస్! ) -
పోయిన నగలు ‘భలే’గా దొరికాయి.. సుందరి ప్రాణం లేచొచ్చింది
అరుదైన ఘటనలు అంటారు కదా! ఆ జాబితాలో ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కచ్చితంగా ఉంటుంది. బంగారం తాకట్టు పెట్టి బాకీలు తీర్చాలనుకున్న ఓ తల్లికి.. ఊహించని కష్టం వచ్చిపడింది. ఆమె మంచి మనసే.. ఆమెతో కన్నీళ్లు పెట్టించింది. చివరకు పోలీసుల ప్రయత్నంతో కథ సుఖాంతం కావడమే కాదు.. పోయిన ఆమె పది తులాల బంగారం ఓ డ్రైనేజీలో ‘భద్రం’గా దొరికింది కూడా. ఆమె అదృష్టం చేజారిపోలేదని నిరూపించిన ఘటన.. మహారాష్ట్ర ముంబై ఆరే కాలనీలో జరిగింది. స్థానిక నివాసి అయిన 45 ఏళ్ల సుందరి ప్లనిబెల్.. గోరేగావ్ గోకుల్ ధామ్ కాలనీలోని ఇళ్లలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. తనకున్న పది తులాల బంగారు నగలను.. బ్యాంకులో డిపాజిట్ చేసి అప్పులు తీర్చాలని అనుకుందామె. జూన్ 13వ తేదీన పని ముగించుకుని బ్యాంకుకు వెళ్తున్న టైంలో.. ఓ ఇంటి ఓనర్ మిగిలిపోయిన కడక్ పావ్‌ను సుందరికి ఇచ్చింది. అయితే సుందరి బ్యాంకుకు వెళ్తున్న మార్గంలో.. ఓ తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని కనిపించింది. బిడ్డ ఆకలితో ఉందేమో అనుకుని తన దగ్గరున్న కడక్పావ్ సంచిని ఆ తల్లికి ఇచ్చేసిందామె. తీరా బ్యాంకుకు వెళ్లి చూడగా, తన వద్ద ఉండాల్సిన నగలు కనిపించలేదు. రోడ్డు మీద కనిపించిన ఆ తల్లికి ఇచ్చిన సంచిలోనే నగలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. పరుగున వెళ్లి ఆ తల్లీబిడ్డల కోసం చూసింది. కానీ, వాళ్లు కనిపించలేదు. ఆలస్యం చేయకుండా.. దిన్దోషి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిందంతా చెప్పి విలపించింది సుందరి. ఆ నగలు లేకపోతే అప్పులు తీర్చలేనని, తనకు చావే శరణ్యమని పోలీసులను వేడుకుంది. దీంతో ఆమె కన్నీళ్లకు కరిగిపోయి.. పోలీసులు రంగంలోకి దిగారు. కనిపించకుండా పోయిన ఆ తల్లీబిడ్డల ఆచూకీ కోసం ఏరియాలో అందరినీ అడిగారు. చుట్టుపక్కల గల్లీలన్నీ జల్లెడ పట్టారు. రెండు గంటల వెతుకులాట తర్వాత.. మొత్తానికి వాళ్లను దొరకబుచ్చుకున్నారు. అయితే.. ఆ బ్రెడ్డు మీద ఆసక్తి లేకపోవడంతో అక్కడే చెత్త కుప్పలో దానిని పడేశామని ఆ తల్లి చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ చెత్త వ్యాను గనుక దానిని ఎత్తేసి ఉంటే పరిస్థితి ఏంటని అనుకుంటూనే.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చెత్తలో ప్రతీ సంచినీ క్షుణ్ణంగా వెతికి చూశారు. లాభం లేకపోయింది. ఈ సమయంలో.. అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాపై ఏఎస్సై సూరజ్ రౌత్ కన్నుపడింది. దానిని పరిశీలించాడాయన. అయితే అందులో ఓ సంచి దానికి అదే కదులుతూ వెళ్లడం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. అందులో బ్రెడ్డు ఉండడంతో అది ఎలుకల పనే అని నిర్ధారించుకున్నారు. వెంటనే.. దగ్గర్లోని ఎలుకల కలుగులను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. చెత్త కుప్పకు కాస్త దగ్గర్లో.. మురికినీరు పోయే ఓ రంధ్రంలో ఎలుకలు అటు ఇటు కదలాడుతున్నాయి. ఆ రంధ్రం నుంచి తొంగి చూసిన పోలీసులకు ఓ బ్యాగ్ కనిపించింది. వెంటనే దానిని బయటకు తీసి చూడగా.. అందులో నగలు భద్రంగానే ఉన్నాయి. ఆ నగలను అలాగే అప్పగించిన దిన్దోషి పోలీసులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది ఆ తల్లి. నమ్మశక్యంగా లేదు కదూ!. -
భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్
-
భద్రాద్రి ఆలయం పేరుతో అశ్లీల చిత్రాల పోస్టింగ్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సోషల్ మీడియాలో భద్రాద్రి ఆలయం పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడమే కాదు.. అందులో అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం టెంపుల్ సిటీ, భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం పేర్లతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఆగంతకులు. అంతటితో ఆగకుండా ఆ పేజీల్లో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయం గమనించిన కొందరు రామభక్తులు.. భద్రాచలం ఏఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే.. భద్రాచలం టెంపుల్ పేరుతో ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయబడుతున్న పోస్టులతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు జరుగుతోంది. -
మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
రాయపర్తి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చాక కాదు పొమ్మంటున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఏఎస్సై సదయ్య కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన ఉబ్బని రాజకుమారి(25) తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఈ క్రమంలో ఒక్కతే ఇంటివద్ద ఉంటుంది. మండలంలోని మైలారానికి చెందిన గబ్బెట శ్రీకాంత్‌కు రాజకుమారికి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో గర్భం దాల్చింది. నవంబర్ 29న వర్ధన్నపేట సీహెచ్‌సీలో బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు బాబుకు నాకు సంబంధం లేదు అంటూ వదిలేస్తున్నాడు. అతనిపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలని పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ అధికారిక నివాసంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని గురించి అసదుద్దీన్ శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తూ.. లేఖ రాశారు. తనను చంపేందుకు కుట్ర చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. ఎంపీల ఇళ్లపై దాడిని సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ లేఖలో కోరారు. చదవండి: ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి -
రఘురామకృష్ణరాజుపై మరో ఫిర్యాదు
హైదరాబాద్ : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే సీఐడీ కేసులకు సంబంధించి ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఇంతలో మరో ఫిర్యాదు ఆయనపై నమోదు అయ్యింది. రెడ్డి సామాజికవర్గాన్ని దూషించారంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. హెచ్చార్సీకి ఫిర్యాదు ఇటీవల రఘురామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా పలు వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్‌కి ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు మాట్లాడిన వీడియోలను సైతం ఫిర్యాదుతో జత చేశారు. కరుణాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దీనిపై త్వరలోనే రఘురామకి ఎన్‌హెచ్చార్సీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. బెయిల్‌పై రఘురామ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఇటీవల రఘురామకృష్ణరాజుపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రఘురామ బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా మరో సమస్య ఆయన్ని చుట్టుముట్టింది. -
మంత్రులపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఈ నెల 3న సిరిసిల్లలో నిర్వహిం చిన సభలో చేనేత కార్మి కులకు బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో సీఈవో రజత్‌కుమార్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ముదిరాజ్‌ల సభ, యాదవుల సభ ఏర్పాటు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. బ్రాహ్మణ సంఘం సమావేశం లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెల 28న కేసీఆర్ ప్రత్యేక విమానంలో రాజకీయాల కోసమే ఢిల్లీ పర్యటన చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు మచ్చ
చాంద్రాయణగుట్ట: ఒకవైపు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసులను ప్రజలకు చేరువ చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుండగా మరోవైపు కొందరు అధికారులు తమ వైఖరితో పోలీస్ వ్యవస్థకే అప్రదిష్ట తీసుకువస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు అభయం కల్పిస్తూ వారితో హుందాగా నడుచుకోవాల్సిన అధికారులు ఒక్కోసారి సంయమనం కోల్పోయి వారితో అసభ్యపదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా పాతబస్తీలోని ఛత్రినాక ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ ఫిర్యాదుదారుడితో మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా...? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే....గురువారం రాత్రి గౌలిపురా పటేల్‌నగర్‌కు చెందిన వార్డు కమిటీ సభ్యుడు సర్వేశ్వర్ సమీపంలో ఉన్న బూడిదగడ్డ నుంచి రాళ్లు పడుతున్నట్లు ఛత్రినాక ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్‌కు ఫోన్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా సర్వేశ్వర్ను బూతులు తిట్టాడు. అనంతరం బాధితుడు ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగా అక్కడ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో వెనుదిరిగారు. విచారణ చేపడతాం: కమిషనర్. ఫిర్యాదుదారుడి పట్ల ఇన్స్పెక్టర్ మాట్లాడిన తీరుపై విచారణ చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చార్జ్ మెమో జారీ: డీసీపీ సత్యనారాయణ. వార్డు సభ్యుడి పట్ల అమర్యాదగా మాట్లాడిన ఛత్రినాక ఇన్స్పెక్టర్కు క్రమశిక్షణ ఉల్లంఘన కింద చార్జ్ మెమో జారీ చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అతను ఫ్రెండ్లీ పోలీసింగ్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడన్నారు. పటేల్‌నగర్‌లో రాళ్ల దాడికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. వార్డు సభ్యుడు సర్వేస్ కుమార్ మధ్య జరిగిన సంభాషణను ఎడిట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజమని తేలితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. -
నిర్భయ కేసు బాధితురాలిపై దాడి అమానుషం
ఆచంట : నిర్భయ కేసు బాధితురాలిపై దాడి అమానుషమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ ఏడాది జూన్17న గ్రామానికి చెందిన ఓ యువతికి నెక్కంటి శ్రీనివాస్, సుశీల దంపతులు మత్తుమందు ఇచ్చి ఆమెను నగ్నంగా అశ్లీలంగా సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని ఆమెను ఒత్తిడి చేశారు. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి నిర్భయ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్‌పై విడుదలైన శ్రీనివాస్, సుశీల, వారి బంధువులు మంగళవారం రాత్రి బాధితురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖరరావు బుధవారం పోలీస్ స్టేషన్లో సాక్షులను విచారించారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశారు. నిందితులు గ్రామానికి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలి తల్లిదండ్రులు నిందితుల నుంచి ఆపద పొంచి ఉందని రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు స్టేట్మెంట్లు తీసుకున్నారు. బాధితురాలు పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఏడుగురిపై కేసులు బాధితురాలిపై దాడి చేసిన ఘటనలో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. నెక్కంటి శ్రీనివాసు, సుశీల, నాగమణి, నార్పిన నర్సింహమూర్తి, దుర్గ, సురేష్, ఆరుమిల్లి లక్ష్మిపై కేసులు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా నిందితురాలు సుశీల కూడా తనపై బాధితురాలి వర్గీయులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తాం : మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి పాలకొల్లు టౌన్ : ఇదిలా ఉంటే పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి బుధవారం పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. ఈ కేసుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారికి నివేదిక ఇస్తానని, సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. -
హవ్వా పోలీసూ.. నీకు ఇది తగునా..!
ముజఫర్‌నగర్: అది పోలీసు ఉద్యోగమే కావొచ్చు. మరింకేదైనా అయ్యుండొచ్చు. మనిషి లేకుంటే ఆ ఉద్యోగానికి విలువే లేదు. ఎందుకంటే మనుషులే లేకుంటే అసలు ఉద్యోగాలే అవసరం ఉండదు.. ఆ ఉద్యోగం ఇచ్చే వారే ఉండరు. అలాంటి మనిషి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ న్యాయంతో కూడిన సేవ చేయాల్సింది పోయి ఓ బానిసలాగా మార్చి సేవ చేయించుకునే ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా పోలీసులు ఈ పని అస్సలు చేయకూడదు. ఎందుకంటే వారికి ఉండాల్సిన గుణం తప్పు చేస్తే శిక్షించడం, సరైన దారిలో పెట్టడం. అంతేగానీ, ఆ ఉద్యోగాన్ని ఆసరాగా పెట్టుకొని అడ్డమైన సేవలు చేయించుకుంటే నలుగురితో నానా మాటలు పడాల్సి వస్తుంది. పొగరు తలకెక్కింది అని తిట్టించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని స్టేషన్లో కూర్చొబెట్టుకొని అతడితో పోలీసులు తమ షూస్ తుడిపించుకునే వీడియో ఒకటి బయటకు రావడంతో అదిప్పుడు సంచలనంగా మారింది. ఎంత పోలీసులు అయితే మాత్రం ఇలాంటి పనులు చేస్తారా అని పౌర సమాజం నివ్వెరపోతోంది. ఈ సంఘటనపై ముజఫర్ నగర్ ఎస్పీ సంతోష్ కుమార్ స్పందిస్తూ తన దృష్టికి ఇప్పుడే ఆ విషయం వచ్చిందని, దర్యాప్తు కొనసాగుతుందని తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. -
'చెత్తగా మాట్లాడాడు.. ముద్దుపెట్టుకోబోయాడు'
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే పచౌరీ గురించి కొన్ని అసభ్యకర విషయాలు తెలిశాయి. ఆయన చాలా అసభ్యకరంగా మాట్లాడేవారని, బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించేవారని ఆయన వద్ద పనిచేస్తున్న పరిశోధక విద్యార్థిని తెలిపింది. జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు స్వయంగా వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఆమె ఈ మాటలు చెప్పినట్లు సమాచారం. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(తెరి) డైరెక్టర్ జనరల్‌గా ఆర్కే పచౌరీ పని చేస్తున్న సమయంలో ఆయన దగ్గర పరిశోధక విద్యార్థిగా చేరిన ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదుచేసుకున్నారు. తొలిసారి రెండు రోజుల ఐదుగంటలపాటు మరోసారి 28గంటలపాటు ఆమె పచౌరీ చేష్టలపై వాంగ్మూలం ఇచ్చింది. 2014 మార్చి నెలలో మెక్సికోలోని లాస్ కాబోస్ కు క్లైమేట్ సమావేశం కోసం విమానంలో వెళుతున్న సమయంలో ఆయన తనను బెదిరించాడని, బాయ్ ఫ్రెండ్ కోసం ప్రయత్నిస్తే అతడి సంగతి తేలుస్తానంటూ కళ్లెర్రజేశాడని చెప్పింది. అదే రోజు తనను బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడాడని కూడా ఆమె వాంగ్మూలంలో చెప్పింది.