పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్‌ | Police Officer Molests Woman Complainant At DySP Office Restroom | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్‌

Published Sat, Jan 4 2025 7:25 AM | Last Updated on Sat, Jan 4 2025 7:30 AM

Police Officer Molests Woman Complainant At DySP Office Restroom

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై డీఎస్పీ అసభ్య ప్రవర్తన

 వీడియో వైరల్‌ 

హోం మంత్రి సొంత జిల్లాలో ఘటన

 డీఎస్పీ అరెస్ట్‌   

తుమకూరు: సాక్షాత్తూ హోం మంత్రి సొంత జిల్లాలోనే మహిళకు భద్రత కరువైంది. అది కూడా పోలీసు స్టేషన్‌లోనే ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి.  ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళతో డీఎస్పీ  అసభ్యకరంగా  వ్యవహరించాడు. ఈఘటన తుమకూరు జిల్లా మధుగిరిలో గురువారం జరిగింది.  పావగడ నుంచి పొలం వ్యాజ్యానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చేందుకు ఓ మహిళ  మధుగిరి డీఎస్పీ కార్యాలయానికి  వెళ్లింది. 

అక్కడే ఉన్న డీఎస్పీ రామచంద్రప్ప సదరు మహిళను  తన కార్యాలయంలోని మరుగుదొడ్డిలోకి పిలుచుకెళ్లి  అసభ్యకరంగా తాకుతూ వేధించాడు. కొందరు కిటికీ గుండా వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. వీడియో వైరల్‌ కావడంతో డీఎస్పీ రామచంద్రప్ప తప్పించుకుని పరారయ్యారు. హోం మంత్రి డాక్టర్‌ జీ.పరమేశ్వర్‌ సొంత జిల్లాలోనే ఈ కృత్యం జరగడంతో యావత్‌ పోలీసు శాఖ తలదించుకొనేలా చేసింది. సదరు డీఎస్పీని విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. 

 కాగా ఈ ఘటనపై ఆ జిల్లా ఎస్పీ కేవీ అశోక్‌ స్పందిస్తూ ఇదొక పోలీసు శాఖ గౌరవాన్ని భంగపరిచే నీచకృత్యమన్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. తాను కూడా ఆ వీడియోను చూశానన్నారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాఖలో మహిళలపై దౌర్జన్యాన్ని సహించబోనన్నారు. బాధిత మహిళ  ఫిర్యాదు చేస్తే డీఎస్పీపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

డీఎస్పీ అరెస్ట్‌
డీఎస్పీ రామచంద్రప్పను మధుగిరి పోలీసులు శుక్రవారం సాయంత్రం  అరెస్ట్‌ చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement