తెలంగాణలో 30లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపేర్కొన్నారు. శుక్రవారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఓటర్ల జాబితా అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ ఓట్లను సరిదిద్ది పాత షెడ్యూల్ ప్రకారమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా మొత్తంలో 12శాతం నకిలీ ఓట్లు ఉండటమంటే చిన్న విషయం కాదని పేర్కొన్నారు.