
మిషన్ భగీరథ చరిత్రాత్మకం
► నీళ్లొచ్చే దాకా కేఎల్‌ఐ ప్రాజెక్టు వద్దే నిద్ర
► జూన్ నాటిని సాగునీరు రాష్ట్ర ప్రణాళికా సంఘం
► ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
గోపాల్‌పేట : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకం ముఖ్యమంత్రి తీసుకున్న చరి త్రాత్మక నిర్ణయమని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎ ల్‌ఐ) ద్వారా సాగునీరు వచ్చే దాకా ప్రాజెక్టు వద్దే నిద్రపోతానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మం డలంలోని గౌరిదేవిపల్లి సమీపంలో జరుగుతున్న కేఎ ల్‌ఐ మూడవ లిఫ్టు పనులతో పాటు మిషన్ భగీరథ ప నులను పరిశీలించారు. సర్జఫుల్, పంప్‌హౌజ్ పనుల పు రోగతిని కేఎల్‌ఐ ఎస్‌ఈ భద్రయ్య వివరించారు. అనంతరం అక్కడే నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేఎల్‌ఐ పనులను వేగిరం చేసేందుకు ఒకటవ లిఫ్టు నుం చి మూడో లిఫ్టు వరకు ప్రతివారంలో ఒకరోజు గడిపి రా త్రి అక్కడే బస చే స్తామని, ఇందుకోసం సంబంధిత అధికారులు, ఏజేన్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
జూన్ నాటికి మూడవ లిఫ్టు నుంచి ఒకటి లేదా రెండు మోటార్ల స హాయంతో నీళ్లివ్వడానికి ఏజేన్సీ, అధికారులు కృషి చే యాలన్నారు. బడ్జెట్లో ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించడం హర్షనీయమని, ఒ క్క పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 8600 కోట్ల కేటాయించి చిత్తశుద్ధి చాటుకున్నారని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ పథకంలో భాగంగా నాగపూర్ శివారులో జరుగుతున్న సంపు నిర్మాణ స్థలాన్ని, పైపులను పరిశీలించారు. బాధిత రైతులకు పరిహారం విషయమై నిరంజన్‌రెడ్డి ఫోన్‌లో జేసీతో మాట్లాడారు. నిరంజన్‌రెడ్డి వెంట ఎంపీపీ జానకిరాంరెడ్డి, నాగపూర్ సర్పంచ్ పాపులు, కేఎల్‌ఐ ఈఈ రమేష్‌జాదవ్, డీఈలు రవీంద్రకిషన్, లోకిలాల్, సత్యనారాయణగౌడు, మం డల ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.