గతేడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు చేసిన మెగా సంస్థకే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు సైతం దక్కనున్నాయి.
పథకం టెండర్లు ఖరారు
సాక్షి, అమరావతి: గతేడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు చేసిన మెగా సంస్థకే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు సైతం దక్కనున్నాయి. రూ.1,638 కోట్ల అంచనాతో ఈ టెండర్లలో ప్రైస్ బిడ్‌ను శనివారం జలవనరులశాఖ అధికారులు తెరిచారు. 4.55 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ మెగా(మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్), 4.90 అధిక ధరలకు కోట్ చేస్తూ నవయుగ (నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్) షెడ్యూళ్లు దాఖలు చేశాయి.
మెగా ఎల్–1గా నిలిచిందని పోలవరం ఎడమ కాలువ ఎస్‌ఈ సుగుణాకర్‌రావు ఇంజనీర్–ఇన్–చీఫ్ వెంకటేశ్వరరావుకు నివేదిక పంపారు. దీన్ని సీఎస్ టక్కర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి పంపారు. కమిటీ ఆదేశాల మేరకు ‘మెగా’తో జలవనరులశాఖ ఒప్పందం చేసుకోనుంది.