గతేడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు చేసిన మెగా సంస్థకే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు సైతం దక్కనున్నాయి. రూ.1,638 కోట్ల అంచనాతో ఈ టెండర్లలో ప్రైస్ బిడ్‌ను శనివారం జలవనరులశాఖ అధికారులు తెరిచారు. 4.55 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ మెగా(మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్), 4.90 అధిక ధరలకు కోట్ చేస్తూ నవయుగ (నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్) షెడ్యూళ్లు దాఖలు చేశాయి