ఇరుగారు పంటలు పండే భూములను సేకరణ నుంచి తప్పించాలని విజ్ఞప్తి
కలెక్టర్‌కు వినతిపత్రం
కర్నూలు (హాస్పిటల్): బావులు, బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ కింద రెండు పంటలు పండే భూములను భూసేకరణ నుంచి తప్పించాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు బి.వై.రామయ్య, నందికొట్కూరు కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జీ సి.అశోక్త్న్రం, తంగెడంచ, మండ్లెం, భాస్కరాపురం గ్రామాల రైతులు విన్నవించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చిన వారు కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశ్రమల కోసం భాస్కరాపురం, మండ్లెం, తంగెడంచె గ్రామాల్లో ఏపీఐఐసీ భూ ములు సేకరిస్తోందన్నారు. అయితే అవన్నీ బీడు భూములుగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వెంటనే ఈ గ్రామాల్లో భూసేకరణ నిలిపివేయాల కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్.. రైతులను కలిసి వివరాలు సేకరిస్తామని తెలిపారు. వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆ భూములకు మినహాయింపునివ్వండి
Published Thu, Mar 3 2016 3:24 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement