
సాక్షి, వికారాబాద్ : నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్‌ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. విపక్షాల ఫిర్యాదుతో కలెక్టర్‌పై ఈసీ వేటు వేసింది. ఈవీఎంలను నిబంధనలకు విరుద్దంగా తెరిచారంటూ కలెక్టర్‌పై గతంలోనే ఫిర్యాదులు రాగా.. ఆయన్ని సస్పెండ్ చేయాలని ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కేసు కోర్టులో ఉండగా.. ఈవీఎంలను ఎలా తెరుస్తారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే...వికారాబాద్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా కలెక్టర్ సుమారు వంద ఈవీఎంలు సీల్ తీశారంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన ఈసీ... కలెక్టర్‌పై వేటు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment