మహానేత విగ్రహ ప్రతిష్ఠకు తొలగిన అడ్డంకులు
-
కలెక్టర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
పరకాల : దివగంత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహ పునఃప్రతిషా్ఠపనకు అడ్డంకుల తొలగిపోయాయి. విగ్రహాన్ని ఆగç Ü్టు 21న గుర్తుతెలియని దుండగులు తొలగిం చారు. దీంతో అదే స్థానంలో మరో విగ్రహం పెట్టేందుకు కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం ఏర్పాట్లు చేస్తుండగా సీఐ జాన్ నర్సింహులు అనుమతి చూపించాలం టూ అడ్డుకున్నారు. దీంతో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు బుధవారం కలెక్టర్ వాకాటి కరుణను కలిసి వైఎస్ విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతించాలని, పోలీసు రక్షణ కల్పించాలని వినతిపత్రం అందించారు. తక్షణమే స్పందిం చిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లా డి అభ్యంతరాలు చెప్పవద్దని, పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆత్మకూరు జడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, పరకాల పీఏసీఎస్ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మడికొండ సంపత్‌కుమార్, కౌన్సిలర్ పోరండ్ల సంతోష్, యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొయ్యడ శ్రీనివాస్, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు కట్ల శ్రీనివాసరావు, టీపీసీసీ కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, శ్యామ్, గణేష్ తదితరులు ఉన్నారు.