మంత్రి జూపల్లి కృష్ణారావుకు గొర్రెపిల్లను అందజేస్తున్న గొల్ల, కురుమలు
గట్టు (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా రైతులకు వరప్రదాయినిగా మారనున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయడం ద్వారా గట్టు బీడుభూములకు సాగు నీరు అందిస్తామని వెల్లడించారు. గట్టు, సోంపురంలో రూ.4.5 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు సోమవారం జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రూ.32 లక్షలతో నిర్మించిన మండల మహిళా సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గట్టు ఎత్తిపోతల పథకంలో మార్పులు చేస్తూ, 0.6 టీఎంసీలకు బదులు 4టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.
తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆగస్టు 15 నాటికి సాగునీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డలో సాగునీటి కొరత లేకుండా చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ ఇన్‌చార్జ్ అబ్రహాం, ఎంపీపీ సునీతమ్మ, జెడ్పీటీసీ బాసు శ్యామల, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు నన్నేసాబ్, ఎంపీటీసీలు అలేఖ్య, నాగవేణి, నాయకులు బల్గెర నారాయణరెడ్డి, అమరవాయి కృష్ణారెడ్డి, మహబూబ్‌అలీ, హనుమంతు, రామకృష్ణారెడ్డి, మహానందిరెడ్డి, నీలకంఠం, శ్రీనాథ్, సత్యనారాయణ, కృష్ణమూర్తి, బజారి, వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment