jupallin krishna rao
-
మంత్రి ఆడిందే ఆట.. సొంత పార్టీ నేతపై జూపల్లి కృష్ణా రావు ధ్వజం
సాక్షి, నాగర్‌కర్నూల్: వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా ల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి ఆడిందే ఆటగా సాగుతోందని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణా రావు ధ్వజమెత్తారు. ఇక్కడ ప్రభుత్వం ఉందా, లేదా? ఇది మీ జాగీరా? అని ప్రశ్నించారు. ‘గత రెండేళ్లుగా మౌనంగా ఉన్నా.. ఇక ప్రేక్షకపాత్ర వహించడం నా వల్ల కాదు. చివరిసారిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రభుత్వం స్పందించకపోతే దసరా తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తా’ అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే లక్ష్యంగా కొంతమంది పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గురువారం నాగర్‌కర్నూల్‌లో ఎస్పీ మనోహర్‌ను కలసి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లా డారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఘోరంగా ఉన్నాయన్నారు. వీడియోలు, ఇతర సాక్ష్యా ధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీస్ ఉన్నతాధికారులు నిస్సహాయతను ప్రదర్శిస్తు న్నారని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలసి విన్నవించినా.. అరాచకాలు ఇంకా ఎక్కువే అయ్యాయన్నారు. చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం -
పదవుల కోసం పాకులాడను
సాక్షి, కొల్లాపూర్: పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, తెలంగాణ సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తాను పార్టీ వీడి ఇతర పార్టీలో చేరుతున్నట్లు ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, పోస్టింగ్‌లు పెట్టిన నాగరాజు ముచ్చర్లతో పాటు, మూలె కేశవులు అనే వ్యక్తిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు వారిపై రూ.కోటి పరువు నష్టం దావా వేస్తానన్నారు. మితిమీరి ప్రవర్తించే వారికి తగిన బుద్ది చెబుతామన్నారు. తాను కారు గుర్తు ఉన్న టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. ఉద్యమ సమయంలో, అభివృద్ధి అంశాల్లో ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నానని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగానే తప్పా అధికారం కోసం పార్టీ మారలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం, కేసీఆర్‌కు చేదోడుగా ఉండాలనే సంకల్పంతో టీఆర్ఎస్లో చేరానని, పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానన్నారు. సమావేశంలో ఎంపీపీ కమలేశ్వర్‌రావు, నాయకులు మేకల నాగరాజు, పసుపుల నర్సింహ్మ, నరసింహ్మారావు, ఎక్బాల్ తదితరులున్నారు. -
అవకాశం ఇవ్వండి నిరూపించుకుంటా..!
సాక్షి, చిననంబావి: తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజాకూటమి తరపున బరిలో నిలిచిన కాంగ్రెస్ కొల్లాపూర్ అభ్యర్థి భీరం హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. శ్రీశైలం నిర్వాసితులకు అండగా ఉంటానని చెప్పారు. సోమవారం ఆయన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామారెడ్డి, టీడీపీ నాయకుడు డాక్టర్ పగిడాల శ్రీనివాసులుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గత 20ఏళ్లుగా కొల్లాపూర్‌కు చేసిందేమీలేదని విమర్శించారు. టీఆర్ఎస్ అమలు చేసిన పథకాలన్నీ నాయకులకు, కాంట్రాక్టర్లకు ఉపయోగపడ్డాయని ఆరోపించారు. న్యాయవాద వృత్తిని వదిలి నాలుగున్నరేళ్లుగా ప్రజాసేవలకు అంకితమయ్యాయని చెప్పారు. కొప్పునూరులో ర్యాలీ నిర్వహించారు. శ్రీశైలం నిర్వాసితులకు అండగా ఉంటానని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌సాక్షిగా చెబుతున్నాని ఉద్వేగంగా మాట్లాడారు. నిర్వాసితుల గోస గత పాలకులకు పట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిక కొప్పునూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకులు చిన్నారెడ్డి, రామకృష్ణ, నరసింహ్మ, తగరం రాజు, బ్రహ్మం, మాజీ సర్పంచ్‌లు తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఉమ్మడి కాంగ్రెస్, టీడీపీ మండల అధ్యక్షుడు గోవిందు శ్రీధర్ రెడ్డి, బస్వాపురం సుధాకర్ నాయుడు, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఎత్తం కృష్ణయ్య, బాల్‌చందర్, చిన్నారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, కిరణ్‌కుమార్, నంది శేఖర్‌రెడ్డి ఉన్నారు. -
‘గట్టు’ ఎత్తిపోతల చేపట్టి తీరుతాం
గట్టు (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా రైతులకు వరప్రదాయినిగా మారనున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయడం ద్వారా గట్టు బీడుభూములకు సాగు నీరు అందిస్తామని వెల్లడించారు. గట్టు, సోంపురంలో రూ.4.5 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు సోమవారం జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రూ.32 లక్షలతో నిర్మించిన మండల మహిళా సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. గట్టు ఎత్తిపోతల పథకంలో మార్పులు చేస్తూ, 0.6 టీఎంసీలకు బదులు 4టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆగస్టు 15 నాటికి సాగునీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డలో సాగునీటి కొరత లేకుండా చేస్తామన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ ఇన్చార్జ్ అబ్రహాం, ఎంపీపీ సునీతమ్మ, జెడ్పీటీసీ బాసు శ్యామల, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు నన్నేసాబ్, ఎంపీటీసీలు అలేఖ్య, నాగవేణి, నాయకులు బల్గెర నారాయణరెడ్డి, అమరవాయి కృష్ణారెడ్డి, మహబూబ్అలీ, హనుమంతు, రామకృష్ణారెడ్డి, మహానందిరెడ్డి, నీలకంఠం, శ్రీనాథ్, సత్యనారాయణ, కృష్ణమూర్తి, బజారి, వెంకటేష్ పాల్గొన్నారు. -
అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామి
తలకొండపల్లి(కల్వకుర్తి): దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రమని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అందరూ కంకణబద్దులు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం తలకొండపల్లి మండల పరిధిలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గది ప్రారంభోత్సవంతోపాటు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన, గట్టుఇప్పలపల్లిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, ఖానాపూర్ నుంచి వెంకట్రావుపేట్ మీదుగా గట్టుఇప్పలపల్లి వరకు ఏడు కిలోమీటర్ల మేరకు రూ. 3.60 కోట్ల బీటీరోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం రాంపూర్, గట్టుఇప్పలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, సీఎం కాకుంటే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేవి కావన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అద్భుత విజయాలను సొంతం చేసుకుందని తెలిపారు. గతంలో ఒక్క మహబూబ్‌నగర్ జల్లాలోనే సుమారు 1672 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. రైతుబంధుతో చరిత్ర సృష్టించాం.. రైతుబంధు పథకంతో ఆత్మహత్యలు లేని తెలంగాణను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రైతుల దృష్టి తెలంగాణపై పడిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను వ్యవసాయంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. త్వరలో రాష్ట్రమంతా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందనుందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పథకం అమలుకానుందన్నారు. చనిపోయిన రైతుకు రూ. 5 లక్షల బీమా సొమ్ము కేవలం పది రోజుల్లోనే అందించనున్నట్లు వివరించారు. గత పాలకులు రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. అప్పులు లేకుండా రైతు వ్యవసాయం చేయాలన్నదే కేసీఆర్ ఆశయమని చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత 4 ఏళ్ల కాలంలో రైతు సంక్షేమాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 18 వేల కోట్లు బీటీ రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేశామన్నారు. అదే విధంగా ప్రతి మండల కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. గ్రామాలపై హామీల వర్షం.. రాంపూర్ గ్రామంలో సూర్యరావు చెరువు మరమ్మతుకు, నూతన పంచాయతీ భవనానికి, పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. అదేవిధంగా గట్టుఇప్పలపల్లిలో బ్యాంక్ ఏర్పాటుతో పాటు, మహిళా సంఘాలకు రూ. 10 లక్షలతో డ్వాక్రా భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, ఎడ్మా కిష్టారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నర్సింహ, ఎంపీపీ లక్ష్మీదేవిరఘురాం, సర్పంచ్‌లు మణెమ్మయాదయ్య, జంగమ్మమైసయ్య, ఉపసర్పంచ్ హరికిషన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్‌యాదవ్, ఎంపీటీసీ వెంకటయ్య, తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, అర్జున్‌రావు, రైతు సమన్వయసమితి కోఆర్డినేటర్లు రేణురెడ్డి, దశరథ్‌నాయక్, రఘురాములు, రఘుపతిరెడ్డి, బోస్, వెంకటయ్య, కృష్ణ, మోహన్‌రెడ్డి, రాజశేఖర్, హెచ్ఎం కృష్ణారెడ్డి, నర్సింహ టీచర్, స్కూల్ చైర్పర్సన్ ఆండాలు, ఎంపీడీఓ శ్రీనివాసాచార్య, ఏఓ రాజు, గిరిజన నాయకులు హన్మానాయక్, జంగయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
పెట్టుబడికి ఢోకాలేదు
పెంట్లవెల్లి (కొల్లాపూర్) : ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.4వేల చొప్పున అందించడం చరిత్రాత్మక నిర్ణయం.. ఇక నుంచి చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడికి ఢోకా లేదు. విత్తనాలు, పనిముట్లు, ఉచిత విద్యుత్, మద్దతు ధర అందించి అన్ని రకాలా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో మంత్రి రైతు బంధు పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రతి ఏడాది ఎరువుల కోసం ఎవరినీ అప్పు అడగకుండా ఎకరాకు రూ.4వేల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రోహిణి కార్తె కంటే ముందే చెక్కులను అందజేస్తున్నామని, రైతులు పొలాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతో ఉపయోగ పడేలా ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, యాసంగి పంటలో కూడా రైతులకు పరిహారం ఇస్తామన్నారు. బంగారు తెలంగాణకు అడుగులు రైతులతోనే బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని కొత్త ప్రాజెక్టులు కట్టి జిల్లాను సస్యశ్యామం చేస్తామని మంత్రి అన్నారు. 60 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టలేని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందరన్నారు. ఒకప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వస్తే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయని, ఇప్పుడు 24గంటలూ కరెంట్ ఉంటుందన్నారు. ఇంతకు ముందు రైతులు ఎరువుల కోసం క్యూలో నిల్చునే వారని, ఇప్పుడు గోదాంలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అందజేస్తున్నామని తెలిపారు. ఆసరా పింఛన్లను 200 నుంచి వెయ్యికి పెంచామని, పేదలు ఇబ్బంది పడరాదని రూ.లక్షా 116 కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తున్నామని గుర్తుచేశారు. గర్భిణులకు రూ.14వేలు, కేసీఆర్ కిట్ అందిస్తున్నామని, త్వరలో ఇంటింటికి ఫిల్టర్ వాటర్ అందిస్తామని, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రతి వీధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించడం జరిగిందన్నారు. పిల్లల చదువుల కోసం గురుకుల, నవోదయ, మాడల్ పాఠశాలలను ప్రారంభించామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లోకారెడ్డి, సర్పంచ్ శైలజ, మాజీ ఎంపీపీ గోవింద్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేష్, సింగిల్‌విండో చైర్మన్ ఖాజామైనొద్దీన్, ఎంపీటీసీ సుజాత, తహసీల్దార్ వెంకటరమణ, వ్యవసాయాధికారి కె.నరేష్, సింగిల్‌విండో చైర్మన్ ఖాజామైనొద్దీన్, ప్రభాకర్‌రెడ్డి, జ్యోతి, వెంకటమ్మ, వెంకట నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తాం!
సాక్షి, హైదరాబాద్: గ్రామ సర్పంచ్ల అధికారాలు, బాధ్యతలతోపాటు పంచాయతీలకు నిధులు పెంచుతూ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లోనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ చట్టం ద్వారా గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. శాసనసభలో శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ పద్దులపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. శాసనసభ్యుల గృహాలు సిద్ధం: తుమ్మల రాష్ట్ర శాసనసభ్యుల కోసం నిర్మించిన 120 గృహాల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల కోసం 44 నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం కొత్తగూడెం 720 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించే ప్రతిపాదనలు ఉన్నా యని విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. తొమ్మిది శాఖల పద్దులకు ఆమోదం శాసనసభ శుక్రవారం ఆర్అండ్బీ, నీటిపారు దల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, పురపాలక, రెవెన్యూ, రవాణా, ఎౖMð్సజ్ శాఖల బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపింది. -
అసెంబ్లీలో రోడ్ల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల అంశం అసెంబ్లీని కుదిపేసింది. ప్రభుత్వ తీరుపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. గురువారం అసెంబ్లీలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు బీటీ పునరుద్ధరణపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రశ్న వేశారు. ఈ అంశంపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని రోడ్ల పరిస్థితిని వివరిస్తూ వాపోయారు. ప్రజలు తిట్టకుండా వెళ్లడం లేదు: రామలింగారెడ్డి అధికారుల తప్పుడు నివేదికల వల్ల దుబ్బాకలోని పలు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ‘సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు మీదుగా వెళ్లే వారు తిట్టకుండా వెళ్లడం లేదు. ఇదే రహదారిని ముస్తాబాద్ నుంచి అవతలి వరకు బాగా చేశారు. రోడ్లను మరమ్మతు చేయకుండానే చేసినట్లు నివేదికలు రూపొందించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని రోడ్లలో నడుము లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఆ రోడ్డుపైనే మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లొస్తుంటారు. ఆయనకు పరిస్థితి తెలుసు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పరిస్థితి మారడం లేదు. పంచాయతీరాజ్ మంత్రికి వివరించినా ఫలితం లేదు. ముస్తాబాద్ రోడ్డును గత పదేళ్లలో ఒక్కసారి మరమ్మతు చేసినట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తా’అన్నారు. వాస్తవాలను పట్టించుకుని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిధుల్లేవంటున్నారు: భాస్కర్‌రావు ఇదే అంశంపై మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడారు. తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాలేదన్నారు. ‘పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల మంత్రులను అడిగితే నిధుల్లేవంటున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినందుకో ఏమోగానీ మా నియోజకవర్గంలోని రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’అని వాపోయారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ మాట్లాడుతూ.. ‘అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలు సరిగా ఉండటం లేదు. అందుకే మరమ్మతు పనులు జరగడం లేదు’ అన్నారు. సగానికే ఆగిపోతున్నాయి: రమేశ్ అధికారులు నివేదికలు సరిగా రూపొందించకపోవడం వల్ల కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చెప్పారు. ‘వర్ధన్నపేట నియోజకవర్గంలోని సింగారం వంటి రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. రెండు గ్రామాల మధ్య రోడ్డు దూరాన్ని సరిగా లెక్కగట్టక మధ్య వరకే బీటీ ఆగిపోతోంది. అక్కడ గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’అన్నారు. అసెంబ్లీలో దాదాపు 15 మంది తమ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిని చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ చేతులు ఎత్తారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకుని.. ‘ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నారు. దీనిపై చర్చ జరిగితే మంచిది. అందరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంత్రి సమాధానం ఇవ్వాలి’ అన్నారు. 358 గ్రామాలకు రోడ్లు లేవు: జూపల్లి తెలంగాణ ఏర్పడిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రోడ్ల అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు పడిగాపులు కాయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 2004–2014 మధ్య బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.416 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.2,240 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. 14 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతు చేశామని.. 2,925 కిలోమీటర్ల రోడ్లను విస్తరించామన్నారు. మరో 4,695 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 358 పంచాయతీలకు బీటీ రోడ్లు లేవని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరాలకు తగినట్లు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
అవే ఫలితాలు 2019లో పునరావృతం: జూపల్లి
జోగులాంబ గద్వాల : గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాలే 2019 ఎన్నికల్లో పునరావృతం అవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..తెలంగాణా నేతలకు మంత్రి పదువులు ఇవ్వడం కూడా కేసీఆర్ ఉద్యమ ఫలితమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గతంలో కుక్కకు బొక్కేసినట్టు మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రారంభమైన కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల ప్రారంభానికి తెలంగాణ ఉద్యమ సెగనే కారణమన్నారు. -
రహదారులకు 800 కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 535 హ్యా బిటేషన్ల పరిధిలో 1,230 కి.మీ. రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణసడక్ యోజన కింద రూ.800 కోట్లు విడుదల చేయాలని కేంద్ర గ్రామీణా భివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో తోమర్‌ను గురువారం కలిశారు. పంచాయతీల మాదిరిగా మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు మంజూరు చేయాలన్నారు. -
స్థానికతపై త్వరలో జీవో: జూపల్లి
శాంతినగర్: స్థానికత పేరుతో నష్టపోతున్న విద్యార్థుల భవిష్యత్‌ను ఆలోచిస్తూ త్వరలో ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కర్నూలు, అలంపూర్, గద్వాల ప్రాంతాల్లో చదివిన కొంతమంది విద్యార్థులు స్థానిక విషయమై ఆయనకు వినతిపత్రం అందజేశారు. స్థానికత అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రత్యేక జీవో విడుదల చేస్తారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతామని చెప్పారు. -
రచ్చబండలో రగడ
వీపనగండ్ల, న్యూస్‌లైన్: రచ్చబండలో రగడ రాజుకుంది. కార్యక్రమం బ్యానర్‌పై సీఎం ఫొటో తొలగింపుపై వివాదం నెలకొంది. కొల్లాపూర్ ఎమ్మె ల్యే జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డిల ఆధిపత్యపోరు అధికారులకు తలనొప్పుల ను తెచ్చిపెట్టింది. పరిస్థితి చేయిదాటి ఓ అధికారిపై చేయిచేసుకు నే స్థాయికి వెళ్లింది. సోమవారం వీపనగండ్ల మండలకేంద్రంలో మండల ప్రత్యేకాధికారి గోపాల్ అధ్యక్షతన రచ్చబండ కార్యక్ర మం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యుడు జూ పల్లి కృష్ణారావును వేదికపైకి ఆహ్వానించిన అనంతరం ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులను ఆహ్వానించారు. రచ్చబండ కమిటీ సభ్యులను వేదికపైకి పిలవకపోవడంతో పాటు రచ్చబండ బ్యానర్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో లేకపోవడం పట్ల మామిళ్లపల్లి వర్గీయులు గందరగోళం సృష్టించారు. ఎవరూ పిలవకుండానే మామిళ్లపల్లి వేదికపైకి ఎక్కారు. ఏ హోదాలో విష్ణువర్ధన్‌రెడ్డిని వేదికపైకి ఆహ్వానించారని అక్కడే ఉన్న ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అధికారులను నిలదీశారు. ప్రొటోకాల్ ప్రకా రం రచ్చబండ ఫ్లెక్సీలో సీఎం ఫొటో ఉండాలని, ఎందుకు ప్రొటోకాల్ పాటించలేదని విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం ఫొ టోకు లేని ప్రొటోకాల్ వేదికపైకి వచ్చిన తనను ఉందా? అని వాగ్వాదానికి దిగారు. మొదటి పేజీ తరువాయి ఇంతలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి పూనుకున్నారు. మామిళ్లపల్లి స్టేజీ దిగాలని లేకపోతే ర చ్చబండను రద్దుచేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుబట్టారు. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకున్నారు. అధికారులను ఎమ్మెల్యే ఎంపీడీఓ చాంబర్లోకి పిలిపించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బయటికి వచ్చి పంపిణీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకాధికారిపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు రచ్చబండ నిర్వహించకుండా ముగించాలని జూపల్లి ప్రత్యేకాధికారిని ఆదేశించడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటికి కార్యాలయ ఆవరణలో మామిళ్లపల్లి దగ్గర ప్రత్యేకాధికారి కూర్చొవడాన్ని గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తదనంతరం ప్రత్యేకకౌంటర్ల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సాయంత్రం ఎంపీడీఓ గదిలో మండల ప్రత్యేకాధికారి గోపాల్‌ను నిర్బంధించారు. ఇరువర్గాల పెనుగులాటలో ఆయన చొక్కా చిరిగింది. పోలీసుల రక్షణతో జూపల్లి ప్రత్యేకాధికారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రచ్చబండ నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎం శ్రేణులు ధర్నా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై కుట్రతోనే.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రక్షణ లేకపోవడంతో పాటు నిత్యం ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే తనపై జరిగిందని మండల ప్రత్యేకాధికారి గోపాల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో పేర్కొన్నారు. జూపల్లి చేయి చేసుకున్నాడన్న ప్రచారం జరగడంతో ఈ విషయాన్ని ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్లగా జూపల్లి తనపై చేయి చేసుకోలేదని తనను రక్షించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఎవరో కార్యకర్తలు తనపై దాడిచేసి అవమానపరిచారని వాపోయారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణయ్య, తహశీల్దార్ శాంతకుమారి, ఏఓ పూర్ణచంద్రారెడ్డి, ఏఈలు రవికృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, గఫార్, ఏపీఎం పార్వతి, ఏపీఓ శేఖర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.