అవకాశం ఇవ్వండి నిరూపించుకుంటా..! | Give The Opportunity To Prove It ..! | Sakshi
Sakshi News home page

అవకాశం ఇవ్వండి నిరూపించుకుంటా..!

Published Tue, Nov 27 2018 9:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

 Give The Opportunity To Prove It ..! - Sakshi

కొప్పునూరులో ర్యాలీ నిర్వహిస్తున్న భీరం హర్షవర్ధన్‌రెడ్డి, చల్లా వెంకట్రామారెడ్డి 

సాక్షి, చిననంబావి: తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజాకూటమి తరపున బరిలో నిలిచిన కాంగ్రెస్‌ కొల్లాపూర్‌ అభ్యర్థి భీరం హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. శ్రీశైలం నిర్వాసితులకు అండగా ఉంటానని చెప్పారు. సోమవారం ఆయన అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామారెడ్డి, టీడీపీ నాయకుడు డాక్టర్‌ పగిడాల శ్రీనివాసులుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గత 20ఏళ్లుగా కొల్లాపూర్‌కు చేసిందేమీలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అమలు చేసిన పథకాలన్నీ నాయకులకు, కాంట్రాక్టర్లకు ఉపయోగపడ్డాయని ఆరోపించారు. న్యాయవాద వృత్తిని వదిలి నాలుగున్నరేళ్లుగా ప్రజాసేవలకు అంకితమయ్యాయని చెప్పారు.

కొప్పునూరులో ర్యాలీ నిర్వహించారు. శ్రీశైలం నిర్వాసితులకు అండగా ఉంటానని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌సాక్షిగా చెబుతున్నాని ఉద్వేగంగా మాట్లాడారు. నిర్వాసితుల గోస గత పాలకులకు పట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.


కాంగ్రెస్‌లో చేరిక 
కొప్పునూరుకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు చిన్నారెడ్డి, రామకృష్ణ, నరసింహ్మ, తగరం రాజు, బ్రహ్మం, మాజీ సర్పంచ్‌లు తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఉమ్మడి కాంగ్రెస్, టీడీపీ మండల అధ్యక్షుడు గోవిందు శ్రీధర్‌ రెడ్డి, బస్వాపురం సుధాకర్‌ నాయుడు, సీనియర్‌ నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఎత్తం కృష్ణయ్య, బాల్‌చందర్, చిన్నారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, కిరణ్‌కుమార్, నంది శేఖర్‌రెడ్డి ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement