KOLLAPUR constituency
-
హాట్ సీట్ కొల్లాపూర్.. నువ్వా.. నేనా అంటున్న నేతలు
సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరికి సీటు ఇచ్చినా ఆపార్టీల్లోని ఇంకోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్ధితి నెలకొంది. ఆయా పార్టీల అధిష్టానాలు కూడా గ్రూపు రాజకీయాలను చక్కదిద్దటంలో విఫలమవుతున్నాయి. దీంతో ఆ సెగ్మెంట్లో ఎవరికివారు యమునా తీరే అన్నా రీతిలో వ్యవహారం నడుస్తోంది. ఫామ్ హౌజ్ ఎపిసోడ్లో ఇక్కడి ఎమ్మెల్యే కూడా ఉండటం సంచలనం రేపింది. హస్తానికి హ్యాండిచ్చి కారెక్కిన హర్షవర్థన్‌రెడ్డి పరిస్థితి ఎలా ఉందో ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూద్దాం. మంత్రిగా పోటీ చేసినా..! ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 14 వేల 594 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన హర్షవర్థన్‌రెడ్డి తర్వాతి రాజకీయ పరిణామాల్లో హస్తాన్ని వీడి గులాబీ గూటికి చేరారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు... హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. నువ్వా.. నేనా అన్న రీతిలో సవాళ్ళు విసురుకుంటున్నారు. వీరిద్దరి కారణంగా కొల్లాపూర్‌లోని గులాబీ పార్టీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో హర్షవర్థన్‌రెడ్డి బలపడటం.. రోజు రోజుకు జూపల్లికి ప్రాధాన్యత తగ్గటం మొదలయ్యింది. దీంతో తన ఉనికిని చాటుకునేందుకు స్దానిక సంస్ధల ఎన్నికల్లో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపునుంచి బరిలో దింపి సత్తా చాటారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది తప్పా ఎక్కడా సమసిపోవడంలేదు. గులాబీ పార్టీ నాయకత్వం కూడా ఇద్దరి మధ్య సంధి కుదిర్చేందుకు దృష్టి కూడా పెట్టలేదు. వ్యక్తిగత విమర్శలు, అవినీతి ఆరోపణలతో ఇద్దరూ ఇటీవలే బహిరంగచర్చ పేరుతో నానా హంగామా చేశారు. ఫాంహౌస్ పాలిటిక్స్ పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చేసారి బీఆర్ఎస్ నుంచి తమ నాయకుడే పోటీ చేస్తారంటూ హర్షవర్థన్, జూపల్లి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే జూపల్లి పార్టీ మారుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. పార్టీ మారితే ఆయన పాత గూడు కాంగ్రెస్‌కు చేరుతారా లేక కాషాయ కండువా కప్పుకుంటారా అన్న చర్చ సాగుతోంది. కొందరైతే బీఆర్ఎస్ సీటు రాకుంటే జూపల్లి స్వతంత్రంగానే బరిలో దిగుతారని చెబుతున్నారు. తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ది, తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న తీరును వివరిస్తూ క్యాలెండర్లు, కరపత్రాలు ముద్రించి నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నారు. ఫాంహౌస్ కేసును, తక్కువగా రావాల్సిన బిల్లును పార్టీ మారి భారీగా సొమ్ము చేసుకున్నాడని సిటింగ్ ఎమ్మెల్యేపై జూపల్లి విమర్శలు చేస్తున్నారు. ఆత్మీయసమ్మేళనాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న జూపల్లి పార్టీ అంతా తన వెనకే ఉందని భావిస్తున్నారు. తాను పదవిలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి 3 వందల కోట్ల నిధులు తెచ్చానని.. ఆ పనుల్ని ఈ ఎమ్మెల్యే ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలేంటీ? జవాబులేంటీ? హర్షవర్థన్‌రెడ్డి మాత్రం తాను నియోజకవర్గ అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్నానని చెబుతున్నారు. సోమశిలసిద్దేశ్వరం వంతెన, రెవెన్యూ డివిజన్ సాధించానని దీంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేరటంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ది చెందేందుకు దోహదపడుతుందని అంటున్నారు. గోపాల్దిన్నె లింక్ కెనాల్ సాధించానని చెబుతున్నారు. జూపల్లి రాజకీయలబ్ది కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. అయితే జీఓ 98 ప్రకారం శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చటంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మాణం కూడా జరగకపోవటం, కొల్లాపూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం జరగకపోవటం, మాదాసి కురువలను ఎస్సీలుగా, వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తానంటూ ఇచ్చిన హమీలు నెరవేరకపోవటంతో ఆయా వర్గాలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తన అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. సొంతగూటికి వస్తారా? ఫాంహౌజ్ వ్యవహారంలో ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి కూడ ఉండటం దుమారం రేపింది. ఇప్పటికే డబ్బులు తీసుకుని కాంగ్రేస్ నుంచి టీఆర్ఎస్కి మారాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు ఫాంహౌజ్ ఎపిసోడ్ సంకటంగా మారింది. జూపల్లి మాత్రం తనను ఎదుర్కోలేక డబ్బులకు అమ్ముడుపోయి ఎమ్మెల్యే పార్టీ మారాడని ఆరోపిస్తున్నారు. అభివృద్ది కోసమే పార్టీ మారినట్టు చెబుతున్న ఎమ్మెల్యే ఏం అభివృద్ది సాధించాడో చెప్పాలని నిలదీస్తున్నారు జూపల్లి కృష్ణారావు. హర్షవర్థన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని వీడిన తర్వాత కాంగ్రెస్ నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కరువయ్యింది. దీంతో గత ఏడాది చివరిలో జగదీశ్వర్‌రావు బీఆర్ఎస్ పార్టీని వీడి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రస్‌లో చేరారు. ఈసారి కాంగ్రేస్ పార్టీ నుంచి జగదీశ్వర్‌రావు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసిన రంగినేని అభిలాష్‌రావు కూడ కాంగ్రేస్లో చేరారు. ఈయన కూడ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరి మద్య కూడ అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ఒకవేళ జూపల్లి సొంతగూటికి వస్తే.. అప్పుడు సీటు ఆయనకు కేటాయిస్తే వీరిద్దరు జూపల్లికి ఏ మేరకు సహకరిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రేస్ సీటు విషయంలో గందరగోళం రేగితే బీఆర్ఎస్కు మేలు జరిగే అవకాశం ఉంది. జూపల్లిపై కన్ను బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్‌రావు నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న నేపధ్యంలో తనకు మేలు జరుగుతుందనే భావనలో ఉన్నారు సుధాకర్‌రావు. కేంద్రప్రభుత్వం కృష్ణానదిపై సోమశిలసిద్దేశ్వరంను కలుపుతూ బ్రిడ్జి మంజూరు చేయడం వెనుక తన కృషి చాలా ఉందని..అందువల్ల ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని అంటున్నారు. ఇటీవల ఆయన నియోజవర్గంలో పాదయాత్ర నిర్వహించి ముగింపు సభకు బండి సంజయ్ ఆహ్వానించి పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవటం మైనస్‌గా ఉంది. సుధాకర్‌రావు మాత్రం పార్టీ కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. ఈయనకు కూడ జూపల్లి నుంచి ప్రమాదం పొంచి ఉంది. జూపల్లి బీజేపీలో చేరి సీటు ఎగురేసుకుపోతే సుధాకర్‌రావు పరిస్ధితి ఏంటనేది ప్రశ్నార్దకంగా మారింది. మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుకు గులాబీ పార్టీ సీటివ్వకపోతే...తమకు ఎక్కడ ఎర్త్ పెడతాడోనని అటు కాంగ్రెస్...ఇటు బీజేపీలోని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. -
అవకాశం ఇవ్వండి నిరూపించుకుంటా..!
సాక్షి, చిననంబావి: తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజాకూటమి తరపున బరిలో నిలిచిన కాంగ్రెస్ కొల్లాపూర్ అభ్యర్థి భీరం హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. శ్రీశైలం నిర్వాసితులకు అండగా ఉంటానని చెప్పారు. సోమవారం ఆయన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామారెడ్డి, టీడీపీ నాయకుడు డాక్టర్ పగిడాల శ్రీనివాసులుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గత 20ఏళ్లుగా కొల్లాపూర్‌కు చేసిందేమీలేదని విమర్శించారు. టీఆర్ఎస్ అమలు చేసిన పథకాలన్నీ నాయకులకు, కాంట్రాక్టర్లకు ఉపయోగపడ్డాయని ఆరోపించారు. న్యాయవాద వృత్తిని వదిలి నాలుగున్నరేళ్లుగా ప్రజాసేవలకు అంకితమయ్యాయని చెప్పారు. కొప్పునూరులో ర్యాలీ నిర్వహించారు. శ్రీశైలం నిర్వాసితులకు అండగా ఉంటానని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌సాక్షిగా చెబుతున్నాని ఉద్వేగంగా మాట్లాడారు. నిర్వాసితుల గోస గత పాలకులకు పట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిక కొప్పునూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకులు చిన్నారెడ్డి, రామకృష్ణ, నరసింహ్మ, తగరం రాజు, బ్రహ్మం, మాజీ సర్పంచ్‌లు తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఉమ్మడి కాంగ్రెస్, టీడీపీ మండల అధ్యక్షుడు గోవిందు శ్రీధర్ రెడ్డి, బస్వాపురం సుధాకర్ నాయుడు, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఎత్తం కృష్ణయ్య, బాల్‌చందర్, చిన్నారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, కిరణ్‌కుమార్, నంది శేఖర్‌రెడ్డి ఉన్నారు. -
అవినీతి టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు..
సాక్షి, పెంట్లవెల్లి: కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి గెలుపు కోసం కృషిచేస్తామని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మతీన్ అహ్మద్ అన్నారు. ప్రతిరోజూ ఇంటింటికి తిరిగి వైఎస్ హయాంలో చేపట్టిన పథకాలను వివరిస్తున్నామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. బీరం హర్షవర్ధన్‌రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. జూపల్లి కృష్ణారావు ఎన్ని మాయమాటలు చెప్పినా ఈ సారి కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, కుర్మయ్య, రఫియోద్దీన్, బీసీ రామకృష్ణ, పాల్గొన్నారు. పెద్దకొత్తపల్లి: కాంగ్రెస్ అధిష్టానం కార్యకర్తలకు భరోసా ఇస్తేనే పార్టీకి పని చేస్తామని సీనియర్ నాయకులు జగదీశ్వర్‌రావు అన్నారు. ముష్టిపల్లిలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయం ప్రకారం టిక్కెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం పని చేస్తామని, స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇస్తేనే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, నాగరాజు, రాజశేఖర్, వెంకట్‌రెడ్డి, నాగరాజుగౌడ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పాన్‌గల్: పేదల సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోను రూపొందించిందని పీసీసీ సభ్యులు రాంమూర్తినాయుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని మల్లాయిపల్లి, పాన్గల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కంటే ముందుగానే విడుదల చేసిన కాంగ్రెస్ మెనిఫెస్టోను అపహస్యం చేసిన టీఆర్ఎస్ నాయకులు అదే మెనిఫెస్టోను కాఫీ కొట్టి పథకాలల్లో కేవలం రూ.16 జతపరిచి మెనిఫెస్టోను ప్రకటించుకోవడం సిగ్గుచేటున్నారు. పార్టు–బిలో ఉంచిన సర్వేనెంబర్లతో వేల మంది రైతులకు రైతుబందు పథకానికి అనర్హులుగా మిగిలిపోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నో హామీలను విస్మరించిందన్నారు. టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రేషన్ ద్వారా సన్నబియ్యం, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు వంటి పథకాలు అమలు చేస్తారన్నారు. కాంగ్రెస్ మెనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రఘుపతినాయుడు, యుగంధర్‌గౌడు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్యనాయుడు, మాజీ సర్పంచు రమేష్‌బాబు, మాజీ ఎంపీటీసీ బుచ్చారెడ్డి, నాయకులు రాముయాదవ్, శ్రీధర్‌రెడ్డి, సుబ్బయ్యయాదవ్, శేషయ్య పాల్గొన్నారు. -
కొల్లాపూర్ నియోజకవర్గంలో కేవైఎఫ్ ప్రచారం
-
3ఎకరాలు.. 20మందికే!
మహబూబ్‌నగర్ టౌన్: ప్రభుత్వం తమకు గంటెడు జాగా ఇస్తే దున్నుకొని దర్జాగా బతకవచ్చని భావించిన పేదలకు అంతలోనే నిరాశే ఎదురైంది. ఎంపికచేసిన గ్రామాల్లో అర్హులందరికీ పంపిణీచేస్తామని చెప్పిన ప్రభుత్వం.. కొందరికి మాత్రమే పంపిణీ చేయడంతో మిగతావారిలో నైరాశ్యం నెలకొంది. పంద్రాగస్టు రోజున పట్టాలు అందుకోవచ్చని ఆశించిన వారి ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 14 గ్రామాలను భూపంపిణీకి ఎంపికచేశారు. ఆయా గ్రామాల్లో అర్హులను గుర్తించి వారిలో ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేసేందుకు అధికారులు నెలరోజుల పాటు కసరత్తుచేశారు. తీరా ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ఆరు గ్రామాల్లో 20మందికి మాత్రమే 60 ఎకరాలను పంపిణీచేసి చేతులు దులుపుకున్నారు. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లోని ఎంపికచేసిన ఆ ఎనిమిది గ్రామాల ప్రజలకు నిరాశే మిగిలింది. ఇక పంపిణీచేసిన గ్రామాల్లో కూడా అందరికీ ఇవ్వలేకపోయారు. దీంతో అర్హులు ఒకింత అసహనానికి గురయ్యారు. నిధులు ఖాతాకే పరిమితం ప్రభుత్వ భూములు ఉంటే సరేసరి.. లేకపోతే జిల్లాలో భూమిని కొనుగోలు చేసైనా దళితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.24కోట్లు మంజూరుచేసింది. అయితే కేవలం రూ.1.55కోట్లు వెచ్చించి 60 ఎకరాలను కొనుగోలుచేసిన అధికారులు 20 మంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగతా రూ.22.45కోట్లను ఖాతాకే పరిమితంచేశారు. వీటిని కూడా వినియోగిస్తారా? లేదా? అన్నది అయోమయం నెలకొంది. పంపిణీచేయని గ్రామాలు జిల్లాలో ఎంపికచేసినా.. కొన్ని గ్రామాల్లో భూమిని పంపిణీ చేయలేదు. వాటిలో కొల్లాపూర్ నియోజకవర్గం ఎల్లూరు, కల్వకుర్తి మండలం వెల్దండ శేరి అప్పారెడ్డిపల్లి, తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం పాల్వాయి, కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం నందిపాడు, మక్తల్ నియోజకవర్గంలోని కర్నె, వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం దొడగుంటపల్లి, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ మండలం పెద్దచింతకుంట గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 29 మంది లబ్ధిదారులను గుర్తించారు. కాగా, భూ పంపిణీకి సంబంధించి అధికారులు కేవలం 20 మందికి మాత్రమే పంపిణీచేసి.. మిగతావారికి ఎప్పుడు పంపిణీచేస్తారనే విషయమై మౌనం దాల్చారు.