శాంతినగర్: స్థానికత పేరుతో నష్టపోతున్న విద్యార్థుల భవిష్యత్‌ను ఆలోచిస్తూ త్వరలో ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కర్నూలు, అలంపూర్, గద్వాల ప్రాంతాల్లో చదివిన కొంతమంది విద్యార్థులు స్థానిక విషయమై ఆయనకు వినతిపత్రం అందజేశారు. స్థానికత అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రత్యేక జీవో విడుదల చేస్తారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment