
సాక్షి, నాగర్‌కర్నూల్: వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా ల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి ఆడిందే ఆటగా సాగుతోందని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణా రావు ధ్వజమెత్తారు. ఇక్కడ ప్రభుత్వం ఉందా, లేదా? ఇది మీ జాగీరా? అని ప్రశ్నించారు. ‘గత రెండేళ్లుగా మౌనంగా ఉన్నా.. ఇక ప్రేక్షకపాత్ర వహించడం నా వల్ల కాదు. చివరిసారిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రభుత్వం స్పందించకపోతే దసరా తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తా’ అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే లక్ష్యంగా కొంతమంది పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గురువారం నాగర్‌కర్నూల్‌లో ఎస్పీ మనోహర్‌ను కలసి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లా డారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఘోరంగా ఉన్నాయన్నారు. వీడియోలు, ఇతర సాక్ష్యా ధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీస్ ఉన్నతాధికారులు నిస్సహాయతను ప్రదర్శిస్తు న్నారని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలసి విన్నవించినా.. అరాచకాలు ఇంకా ఎక్కువే అయ్యాయన్నారు.
చదవండి: బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
Comments
Please login to add a commentAdd a comment