పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై శాసనసభలో చర్చ జరగనున్న కారణంగా ఈనెల 14న తలపెట్టిన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై శాసనసభలో చర్చ జరగనున్న కారణంగా ఈనెల 14న తలపెట్టిన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఆయన బుధవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు.
చంద్రబాబు సర్కారు మొండిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో రైతుల పక్షాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో చర్చకు అనుమతిస్తారని ఎదురు చూస్తున్నామని, చర్చ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయూన్ని అనుసరించి తమ ఉద్యమం ఉంటుందని నెహ్రూ చెప్పారు. అంతవరకు వేచి చూస్తామన్నారు.