పట్టిసీమతో రైతుల నోట్లో మట్టి: జ్యోతుల
కాకినాడ: కొందరి స్వార్థం కోసం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉభయగోదావరి జిల్లాల రైతాంగం నోట్లో మట్టికొట్టే పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. మంగళవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ఖర్చు కోసం కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న కోట్లరూపాయలకు పరిహారంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కానుకగా ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎత్తిపోతల పథకం ప్రారంభించి నీటిని తోడడం ప్రారంభిస్తే ఉభయగోదావరి జిల్లాల రైతాంగానికి నష్టం వాటిల్లుతుందన్నారు. డ్వాక్రా, రైతు రుణాల మాఫీ, పోతిరెడ్డిపాడు నీటి నిల్వల సామర్థ్యం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం వంటి సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జ్యోతుల డిమాండ్ చేశారు.