
బలవంతంగా భూములు లాక్కోవద్దు
భూసేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి
పాలమూరు’ భూసేకరణను పరిశీలించిన సీపీఎం నేతలు
బిజినేపల్లి/జడ్చర్ల: పాలమూరు, రంగారె డ్డి ఎత్తిపోతల పథకంలో నిర్వాసిత రై తాంగానికి 2013 భూసేకరణ చట్టాన్ని ప టిష్టంగా అమలు చేయాలని సీపీఎం కం ట్రోల్ కమిషన్ చైర్మన్, రైతు సంఘం అఖి ల భారత జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మె ల్యే నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. వట్టెం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం కార్కొండ గ్రామంలో మాట్లాడారు. అలాగే పాలమూరు ముంపు గ్రామం జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్వాసితులు 80శాతం అంగీకరిస్తేనే పనులు ప్రారంభించాలన్నారు. భూములు కోల్పోతున్న రైతాంగానికి పలుకుతున్న ధరకంటే నాలుగురెట్లు అధికంగా ఇవ్వాలని లేదా భూమికి భూమి ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్నారు. రైతులు అంగీకరించిన తర్వాతే ప్రణాళికలు తయారుచేసి టెండర్లు పిలవాలన్నారు.
పాలమూరు ఎత్తిపోతల డిజైన్ ప్రారంభంలో ఉదండాపూర్ రిజర్వాయర్ లేదన్నారు. అనంతరం కొత్త డిజైన్‌లో పుట్టుకొచ్చిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేసి ఉంటే నేడు 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్తగా పాలమూరు ఎత్తిపోతలకు నిదులు కేటాయించడం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనని మండిపడ్డారు. ఉదండాపూర్ ముంపునకు గురికాకుండా డిజైన్ మార్చాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ.రాములు, వెంకట్రామ్‌రెడ్డి,డివిజన్ కార్యదర్శి దీప్లానాయక్, ఆర్.శ్రీనువాసులు, జగన్, సత్తయ్య పాల్గొన్నారు.