చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు పట్టిసీమ తరహాలో తమకు కూడా ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఈ నెల 23 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీంతో భూ నిర్వాసితులు పనులు జరగకుండా ప్రొక్లెయినర్‌లను అడ్డుకుని ఆందోళనకు దిగారు.
ఎత్తిపోతల పనులు అడ్డగింత
Published Tue, May 31 2016 6:27 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM
Advertisement
Advertisement