సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బుధవారం చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మరోమారు విచారణ జరుగనుంది. ఎంకే నంబియార్‌తో కూడిన ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం, పిటిషన ర్‌లు తుది వాదనలు వినిపించనున్నారు. దీనికోసం నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి, ప్రాజెక్టు సీఈ లింగరాజు తదిత రులు మంగళవారం సాయంత్రమే చెన్నై వెళ్లారు. అటవీ చట్ట నిబం ధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు పనులను చేపట్టిందని, ఈ వ్యవ హారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిష న్‌పై ఇప్పటికే ట్రిబ్యునల్ పలు మార్లు విచారణ జరిపింది.
గత విచారణ సందర్భంగా.. పూర్తిగా తాగునీటికి ప్రాధా న్యమిస్తూ ప్రాజెక్టును చేపట్టామని, ఆ దిశగానే పనులు కొనసాగిస్తున్నామని ప్రభు త్వం తెలిపింది. ప్రాజెక్టు మొదటి దశలో తాగునీటిని, రెండో దశలో సాగునీటిని అందిస్తామని వివరిం చింది. సాగునీటి సరఫరా జరిపే నాటికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందుతామని, ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తున్నామని ధర్మాసనానికి నివేదిం చింది.
దీనికి అంగీకరించిన ట్రిబ్యునల్, పనులను తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని, సాగునీటి ప్రాజెక్టుకు అనుమతు లు పొందే వరకు సంబంధిత పనులు చేపట్టరాదని చెప్పింది. అయితే ఈ విష యంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని, తాగునీటి పనుల పేరుతో సాగు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతోందని పిటిషనర్‌లు వాది స్తున్నారు. పూర్తిగా తాగునీటి పనులే చేపడుతున్నా మంటూ అందుకు సంబంధించిన డ్రాయిం గ్‌లను ప్రభుత్వం సమర్పించనుంది.