
ఐసీసీలో లెవెల్-1 క్రికెట్ కోచ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా కోచ్‌గా తెలంగాణకు చెందిన బుర్రా లాస్య చరిత్ర సృష్టించింది. ఈ సందర్‌భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బుర్రా లాస్యను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక విజన్ తో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడం కోసం సుమారు 8500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. క్రీడా పాలసీ లో క్రీడాకారులకు, కోచ్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment