womens coach
-
ఐసీసీ లెవెల్-1 క్రికెట్ కోచ్ కోర్సు పూర్తి చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ
ఐసీసీలో లెవెల్-1 క్రికెట్ కోచ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా కోచ్‌గా తెలంగాణకు చెందిన బుర్రా లాస్య చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బుర్రా లాస్యను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక విజన్ తో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడం కోసం సుమారు 8500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. క్రీడా పాలసీ లో క్రీడాకారులకు, కోచ్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. -
కోచ్ కిమ్ హ్యూన్ నిష్క్రమణ!
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన భారత బ్యాడ్మింటన్ కోచ్ కిమ్ జి హ్యూన్ అంటే గతంలో ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ సింధు ప్రపంచ చాంపియన్‌గా మారడంలో కిమ్ చేసిన కృషి ఏమిటో బ్యాడ్మింటన్ వర్గాలకు బాగా తెలుసు. ఇప్పుడు ఆమె అనూహ్యంగా తప్పుకుంది. సింధు విజేతగా నిలిచిన కొద్ది రోజులకే కొరియాకు చెందిన మహిళా కోచ్ కిమ్ మంగళవారం అనూహ్యంగా రాజీనామా చేసింది. వ్యక్తిగత కారణాలతోనే వైదొలగుతున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ నిర్ణయం బ్యాడ్మింటన్ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది. 45 ఏళ్ల కిమ్ ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకుంది. తన భర్త రిట్చీ మార్ అనారోగ్యానికి గురవడంతో ఆఘమేఘాల మీద అక్కడికి వెళ్లింది. కొన్ని రోజుల కిందట రిట్చీ మార్ నరాల సంబంధిత వ్యాధికి గురయ్యాడు.ఈ నేపథ్యంలోనే ఆమె ఉన్నపళంగా ని్రష్కమించిందని తెలిసింది. కిమ్‌ను ఈ ఏడాది ఆరంభంలోనే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రత్యేకంగా సింగిల్స్ కోచ్‌గా నియమించింది. ‘బాయ్’ నియామకం బాగా పనిచేసింది. సింగిల్స్‌లో ఆడే షట్లర్ల కోసమే ఆమెను నియమించడం సింధులాంటి క్రీడాకారిణికి బాగా కలిసొచ్చింది. తెలుగు తేజాన్ని గత నెల ప్రపంచ చాంపియన్‌గా చేసేందుకు కిమ్ జి హ్యూన్ ఎంతో ప్రణాళికతో కష్టపడింది. ఆమె కోచింగ్ కూడా చాలా ప్రత్యేకమైందంటారు క్రీడాకారిణులు. అందుకే సింధు విజయంలో ఆమె కీలకపాత్ర పోషించింది. అలాంటి కోచ్ అంతలోనే వైదొలగడం సింధుతో పాటు షట్లర్లను నిరాశపరుస్తోంది. జాతీయ చీఫ్ కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ ‘నిజమే. కిమ్ రాజీనామా చేశారు. తన భర్త అనారోగ్య కారణాలతోనే ఆమె వైదొలగినట్లు తెలిసింది. ప్రపంచ చాంపియన్íÙప్ సమయంలో ఆమె భర్త ‘న్యూరో స్ట్రోక్’కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను దగ్గరుండి చూసుకునేందుకే ఆమె బయల్దేరింది. ఆమె భర్త తిరిగి కోలుకునేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిసింది’ అని అన్నారు. ‘బాయ్’ కార్యదర్శి అజయ్ సింఘానియా స్పందిస్తూ తమకు గానీ, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి గానీ కోచ్ నుంచి రాజీనామా లేఖ అందలేదని చెప్పారు. ‘కోచ్ భర్తకు బాగా లేదని తెలుసు కానీ... ఆమె నుంచి అధికారికంగా రాజీనామా లేఖ మాకు అందలేదు. సాయ్‌కి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని ఆయన తెలిపారు. ఆమె రాజీనామాపై సింధు విచారం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా దురదృష్టకరం. ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే తరుణంలో కిమ్ వెళ్లిపోవడం పెద్ద లోటు. ఆమె భర్త త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ఆమె కోచింగ్ నన్ను బాగా మార్చింది. మా ఇద్దరికి మంచి సమన్వయం కుదిరింది. ఏదేమైనా క్రీడాకారుల జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాల్సిందే. గోపీసర్, బాయ్ పరిస్థితుల్ని చక్కదిద్దుతారని ఆశిస్తున్నాను’ అని సింధు తెలిపింది. ఒలింపిక్స్‌కు మరో పది నెలల సమయమే ఉండటంతో బాయ్ ఇప్పుడు కిమ్ స్థానాన్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాల్సివుంటుంది. దీనికి త్వరలోనే శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని కోచ్ గోపీచంద్ అన్నారు. -
కోహ్లి మెసేజ్‌లతో ఒత్తిడి పెంచడం వల్లే...
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో ఇప్పుడు ఇద్దరు సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ మాత్రమే మిగిలారు. వీరిద్దరికి కూడా పడటం లేదని చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న వివాదం కారణంగా అవి ఇప్పుడు బయట పడ్డాయి. జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించమని ఎడుల్జీ కోరగా... దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వినోద్ రాయ్ కొత్త కోచ్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల అడ్‌హక్ కమిటీని మంగళవారం ప్రకటించారు. ఇందులో దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌తో పాటు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఉన్నారు. దీంతో పాటు ఇతర అంశాలను కూడా ప్రశ్నిస్తూ ఎడుల్జీ సుదీర్ఘ లేఖ రాశారు. మహిళల జట్టు కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించాలంటూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధన కోరడంలో తప్పేమీ లేదని ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. గతంలో విరాట్ కోహ్లి పట్టు పట్టడం వల్లే రవిశాస్త్రిని ఎంపిక చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘కోహ్లి తరహాలో కాకుండా మహిళా క్రికెటర్లు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. కోహ్లి వరుస పెట్టి సీఈఓ జోహ్రికి మెసేజ్‌లు పంపించాడు. దానిపైనే మీరు స్పందించి కోచ్‌ను మార్చారు. రవిశాస్త్రి కోసం దరఖాస్తు గడువు తేదీని పెంచడంపై కూడా నాడు నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. దిగ్గజ ఆటగాడు కుంబ్లేను కూడా విలన్లా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అతను గౌరవంగా తప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. అయితే ఆ సమయంలో అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన కోసం కోచ్‌గా కొనసాగించమని ఇద్దరు ప్లేయర్లు కోరుతున్నారు. కొత్త కోచ్‌ను కమిటీ ఎంపిక చేసే వరకు వారి మాటకు విలువిస్తే తప్పేమిటి’ అని ఎడుల్జీ ప్రశ్నించారు. క్రికెట్ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ అందుబాటులో ఉన్నారా లేదా కనీసం తెలుసుకోకుండానే ముగ్గురితో అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయడంపై కూడా ఆమె వివరణ కోరారు. తాను లేకుండానే మిథాలీ, హర్మన్‌లతో సమావేశం ఎలా అవుతారని... బీసీసీఐ వ్యవహారాల్లో రాయ్‌తో పాటు తనకూ సమాన అధికారాలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. తన ఆమోదం లేకుండా రాయ్ సూచనలపై స్పందించవద్దని కూడా బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, సీఈఓలను ఎడుల్జీ కోరారు. రమేశ్ పొవార్ దరఖాస్తు... జట్టు కోచ్ రేసులో మరోసారి రమేశ్ పొవార్ నిలిచాడు. నవంబర్ 30న పదవీకాలం పూర్తయి తప్పుకున్న అతను ఇప్పుడు మళ్లీ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాడు. ‘అవును... స్మృతి, హర్మన్ మద్దతు పలకడంతో మళ్లీ దరఖాస్తు చేశాను. అలా చేయకుండా వారిని నిరాశపర్చలేను’ అని పొవార్ చెప్పాడు. ప్రస్తుతానికి కోచ్ పదవికి బీసీసీఐ వద్ద మనోజ్ ప్రభాకర్, హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), దిమిత్రి మస్కరెన్హాస్ (ఇంగ్లండ్) దరఖాస్తులు ఉన్నాయి. -
మహిళా బోగీలో ప్రయాణం:ఇద్దరు యువకుల అరెస్టు
ముంబై: లోకల్రైలు మహిళా బోగీలో ప్రయాణించిన ఐదుగురు యువకులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు శనివారం అరెస్టు చేశారు. కింగ్స్ సర్కిల్ రైల్వే స్టేషన్ నుంచి మాిహ ం వరకు మహిళాబోగీలో ప్రయాణించిన రాజ్‌కుమార్, సిరాజ్ షేక్, మోహినుద్దీన్ షేక్, సత్య గణేష్, మరో బాలుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి వీరికి జరిమానా విధించారు. ఇదిలా వుండగా హార్బర్‌లైన్‌లో మహిళా బోగీల్లో కొందరు యువకులు తరచూ ప్రయాణిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఇలాంటి వారిని గుర్తించడానికి ఆర్పీఎఫ్ ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది.