సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో షూటింగ్ రేంజ్‌లను అప్‌గ్రేడ్ చేస్తామని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్, గగన్ నారంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోక్యో-2020 ఒలింపిక్స్ భారత బృందానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ నుంచి అయిదుగురు ఒలిపింక్స్‌కు వెళ్లడం గొప్ప విషయమని అన్నారు. గగన్ నారంగ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి మరింత మంది షూటర్లు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సెంట్రల్ యూనివర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్‌లో అడుగుపెట్టగానే చెలరేగారు. అలవోకగా .22 వాల్తర్ పిస్టల్‌ను అందుకుని ప్రొఫెషనల్ తరహాలో పలు షాట్స్‌ను ఫైర్ చేశారు. మంత్రి టార్గెట్‌ను గురిపెట్టి ఫైర్ చేయడంతో ఒలింపిక్ మెడల్ విజేత, ఏస్ షూటర్ గగన్ నారంగ్ సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. పిస్టల్‌తోనే కాకుండా రైఫిల్, షాట్ గన్, ఎయిర్ రైఫిల్‌తో పది మీటర్ల రేంజ్‌లో సైతం చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. షూటింగ్ అంటే ఇప్పటికీ తనకు ఆసక్తి అధికమని, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)లో తాను లైఫ్ మెంబర్‌నని, తనకు లైసెన్డ్ గన్ ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
— V Srinivas Goud (@VSrinivasGoud) July 21, 2021
Comments
Please login to add a commentAdd a comment