
క్లాప్ ఇస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాయికిరణ్ హీరోగా, వికాసిని రెడ్డి, జ్యోతిసింగ్ హీరోయిన్లుగా వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అతడెవడు’. ఎస్‌ఎల్‌ఎస్ సమర్పణలో తోట సుబ్బారావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మొదటి సన్నివేశానికి తోట నాగేశ్వర్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘డిఫరెంట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు తోట సుబ్బారావు. ‘‘క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు నంది వెంకట్‌రెడ్డి. ‘‘ఈ సినిమాలో చిరంజీవిగారి అభిమానిగా నటిస్తున్నాను’’ అన్నారు సాయి కిరణ్. ఈ చిత్రానికి సంగీతం: డమ్స్ర్ రాము, కెమెరా: డి. యాదగిరి.
Comments
Please login to add a commentAdd a comment