
జనం మధ్య పోలీసుల తుపాకీ గాల్లోకి ఎక్కుపెట్టి మరీ కాల్పులు జరిపారు..
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: తెలంగాణ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో జనం మధ్య ఆయన హుషారుగా తుపాకీతో కాల్పులు జరిపారు. పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని మరీ ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
అయితే పోలీసుల ఎస్‌ఎల్‌ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేసిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని ఆయన ప్రకటన ఇచ్చారు. ‘‘నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్‌ను. క్రీడా శాఖమంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుంది. కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీని సరైన సమాచారం తెలుసుకోవాలి. ఎస్పీ ఇస్తేనే నేను కాల్చాను. ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారు. నేను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తా! అని రాజకీయ, సోషల్ మీడియా విమర్శలకు తీవ్రంగా స్పందించారాయన.
@TelanganaCMO @KTRTRS @TelanganaDGP @CPHydCity @AmitShah తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు.. పోలీసు తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి.... Minister firing.... pic.twitter.com/d8iiHwBeZb
— Aravind Sharma (@MAravindSharma1) August 13, 2022