జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభం | KTR and V Srinivas Goud launches Jwala Gutta Academy of Excellence | Sakshi
Sakshi News home page

జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభం

Published Tue, Nov 3 2020 7:08 AM | Last Updated on Tue, Nov 3 2020 7:08 AM

KTR and V Srinivas Goud launches Jwala Gutta Academy of Excellence - Sakshi

జ్యోతి వెలిగించి అకాడమీని ప్రారంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మొయినాబాద్‌ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్‌ ఆవరణలో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఆయన సోమవారం సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు, దేశానికి ఆదర్శంగా ఉండే నూతన స్పోర్ట్స్‌ పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. స్టార్‌ షట్లర్‌ జ్వాల అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.లీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మొయినాబాద్‌ ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌ పాల్గొన్నారు.  

సిద్ధమైన కోర్టులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement