Municipal Minister of Telangana
-
జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభం
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్ ఆవరణలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన సోమవారం సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు, దేశానికి ఆదర్శంగా ఉండే నూతన స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. స్టార్ షట్లర్ జ్వాల అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.లీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్ పాల్గొన్నారు. సిద్ధమైన కోర్టులు -
కేటీఆర్‌కు ‘గ్రేటర్’ కానుక
అదనపు బాధ్యతగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అప్పగింత సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను భుజానికెత్తుకొని టీఆర్ఎస్కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ‘గ్రేటర్’ కానుక లభించింది! గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను అప్పగిస్తానని ఎన్నికల ప్రచార సభలో చేసిన ప్రకటనను సీఎం కేసీఆర్ ఆదివారం నెరవేర్చారు. కేటీఆర్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను అదనపు బాధ్యతగా అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్, ఐటీ శాఖలు యథాతథంగా కేటీఆర్ వద్దే ఉంటాయి. పురపాలక శాఖ ఇప్పటివరకు సీఎం వద్ద ఉంది. దీంతో చిన్న అంశంపై అనుమతి కావాలన్నా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాల్సి రావడంతో అధికారులు ఇబ్బంది పడేవారు. ఫలితంగా సీఎం సంతకానికి నోచుకోక పురపాలక శాఖకు సంబంధించిన వందల ఫైళ్లు సీఎంవోలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. మంత్రి కేటీఆర్ ఈ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఫైళ్లకు మోక్షం లభిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.