రోబోల తయారీ ఇక ఈజీ! | First-ever 3-D printed robots made of both solids and liquids | Sakshi
Sakshi News home page

రోబోల తయారీ ఇక ఈజీ!

Published Fri, Apr 8 2016 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

రోబోల తయారీ ఇక ఈజీ!

రోబోల తయారీ ఇక ఈజీ!

బోస్టన్: రోబోల తయారీలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. 3డీ ప్రింటర్‌లో ఉపయోగించే ఘన, ద్రవ పదార్థాలతో మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఓ రోబోను తయారు చేశారు. లోహాలతో కాకుండా ఇతర పదార్థాలతో తయారు చేసిన తొలి రోబో ఇదే. దీంతో భవిష్యత్తులో ఇక రోబోలను తయారు చేయడం ఓ ప్రింట్ తీసినంత సులభం కానుంది. బయట కనిపించే అవయవాలే కాకుండా బ్యాటరీ, మోటార్ వంటి అంతర పరికరాలను తయారు చేసేందుకు కూడా లోహాలను ఉపయోగించకపోవడం గమనార్హం.

వీరు తయారు చేసిన ఆరుకాళ్ల ఈ బుల్లి రోబో నడవడం, పాకడం వంటివి చేస్తుంది. 3డీ ప్రింటింగ్‌కు ముందు అనేకరకాల ఏర్పాట్లు చేసుకోవాలని వీటి రూపకర్తలు చెప్పారు. లేయర్‌పై లేయర్‌గా వేస్తూ 3డీ ప్రింటర్ ఈ రోబోను తయారు చేస్తున్న సమయంలో ఏ లేయర్‌కు ఏ రకమైన ప్రింటింగ్ మెటీరియల్ వినియోగించాలనేదానిపై అవగాహన ఉండాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement