రామచిలుకలు మాట్లాడగలుగుతాయి. మనుషులు మాట్లాడే మాటలు వింటూ, అవే మాటలను తిరిగి పలుకుతాయి. ఈ చిలక పలుకులు మనకు తెలిసినవే! హైటెక్ కాలంలోని రామచిలుకలు మాట్లాడటమే కాదు, ఏకంగా వీడియోకాల్స్ కూడా చేసేస్తున్నాయి. ఎవరికంటారా? వాటి తోటి పక్షి నేస్తాలకే! మాటలు నేర్చుకునే చిలుకలు, నేర్పిస్తే వీడియోకాల్స్ చేయడం ఎందుకు నేర్చుకోలేవు అనుకున్న శాస్త్రవేత్తలు కొన్ని రామచిలుకలకు ప్రయోగాత్మకంగా వీడియోకాల్స్ చేయడం నేర్పించారు.
ఈ విద్యను అవి ఇట్టే నేర్చుకుని, దూర దూరాల్లో ఉంటున్న తమ పక్షి నేస్తాలకు ఎడాపెడా వీడియోకాల్స్ చేసి, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. అమెరికాలోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి, ఇటీవల కొన్ని ఎంపిక చేసిన రామచిలుకలకు విజయవంతంగా వీడియోకాల్స్ నేర్పించారు.
చదవండి👉 దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి?
ఇళ్లల్లో పంజరాల్లో పెరిగే రామచిలుకలు ఈ వీడియోకాల్స్ ద్వారా ఒంటరితనాన్ని మరచిపోగలుగుతున్నాయని, తోటి నేస్తాలతో ముచ్చట్ల ద్వారా అవి ఉత్సాహాన్ని పొందగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment