massachusetts institute of technology
-
సైంటిస్ట్‌ల అద్భుతం.. ఎడాపెడా వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్న చిలుకలు!
రామచిలుకలు మాట్లాడగలుగుతాయి. మనుషులు మాట్లాడే మాటలు వింటూ, అవే మాటలను తిరిగి పలుకుతాయి. ఈ చిలక పలుకులు మనకు తెలిసినవే! హైటెక్ కాలంలోని రామచిలుకలు మాట్లాడటమే కాదు, ఏకంగా వీడియోకాల్స్ కూడా చేసేస్తున్నాయి. ఎవరికంటారా? వాటి తోటి పక్షి నేస్తాలకే! మాటలు నేర్చుకునే చిలుకలు, నేర్పిస్తే వీడియోకాల్స్ చేయడం ఎందుకు నేర్చుకోలేవు అనుకున్న శాస్త్రవేత్తలు కొన్ని రామచిలుకలకు ప్రయోగాత్మకంగా వీడియోకాల్స్ చేయడం నేర్పించారు. ఈ విద్యను అవి ఇట్టే నేర్చుకుని, దూర దూరాల్లో ఉంటున్న తమ పక్షి నేస్తాలకు ఎడాపెడా వీడియోకాల్స్ చేసి, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. అమెరికాలోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి, ఇటీవల కొన్ని ఎంపిక చేసిన రామచిలుకలకు విజయవంతంగా వీడియోకాల్స్ నేర్పించారు. చదవండి👉 దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి? ఇళ్లల్లో పంజరాల్లో పెరిగే రామచిలుకలు ఈ వీడియోకాల్స్ ద్వారా ఒంటరితనాన్ని మరచిపోగలుగుతున్నాయని, తోటి నేస్తాలతో ముచ్చట్ల ద్వారా అవి ఉత్సాహాన్ని పొందగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
భూమిపై జీవం.. చెరువులే మూలం
బోస్టన్: విశాల విశ్వం.. నక్షత్రాలు.. గ్రహాలు.. కోటానుకోట్ల జీవరాశులు. కంటికి కనిపించేవి కొన్నే.. కనిపించనివి అనంతం. విశ్వం ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియదు.. జీవరాశి పుట్టుక వివరాలు తెలియవు. వీటికి సంబంధించిన అన్ని విషయాలూ రహస్యాలే. ఈ రహస్యాలన్నింటిని ఛేదించేందుకు ఏళ్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలు.. అయినా అంతంత మాత్రమే ఫలితాలు. తాజాగా జీవ రాశి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఓ అధ్యయనంలో వెలువడ్డాయి. భూమిపై జీవరాశి పుట్టుకకు చెరువులు ముఖ్యపాత్ర పోషించాయని అమెరికాలోకి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్) నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది. పెద్ద పెద్ద సముద్రాల కంటే కూడా చెరువులే జీవరాశికి అనువైన వాతావరణాన్ని భూమిపై సృష్టించాయని తెలిపింది. అది కూడా 10 సెంటీమీటర్లకు అటూఇటుగా ఉండే చెరువులే జీవానికి ఊపిరి పోశాయని పేర్కొంది. చెరువులే ఎందుకు.. భూమిపై జీవం పుట్టుకకు అవసరమైన వాటిల్లో అధిక సాంద్రత గల నైట్రోజన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు భావిస్తారు. నైట్రోజన్ ఆక్సైడ్లు సముద్రాలు, చెరువుల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో కలసి జీవం పుట్టుకకు బాటలు వేస్తుందని చెబుతారు. అయితే ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మిట్కు చెందిన పరిధకులు సుక్రిత్ రంజన్ మాట్లాడుతూ..‘లోతైన సముద్రాల్లో ఉండే నైట్రోజన్ వల్లే జీవం ఉద్భవించి ఉంటుందని అనుకోవడం సరికాదు. ఎందుకంటే లోతైన సముద్రాల్లోని నైట్రోజన్.. వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు చాలా తక్కువ. అలాగే అతి నీలలోహిత కిరణాలు, సముద్రాల్లోని ఐరన్ ధాతువులు నైట్రోజన్ మిశ్రమాన్ని అధిక శాతంలో నాశనం చేసే అవకాశం ఉంది. అనంతరం మిగిలిన కొద్ది మొత్తంలోని నైట్రోజన్‌ను వాయువు రూపంలో తిరిగి వాతావరణంలోకి పంపించేస్తాయి. దీంతో సముద్రాల్లో నైట్రోజన్ జీవం పుట్టుకకు ఎంతమాత్రం దోహదపడే అవకాశం లేదు. మరోవైపు చెరువుల్లోని నైట్రోజన్ ఆక్సైడ్ల వల్లే భూమిపై జీవం ఆవిర్భవించే అవకాశాలు అత్యధికం. చెరువుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ల రూపంలో నిక్షిప్తమైన నైట్రోజన్ మిశ్రమం వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే చెరువుల్లో మిశ్రమాలు కరిగే అవకాశాలు చాలా తక్కువ. మొత్తంగా చూస్తే.. శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా జీవం పుట్టుకకు నైట్రోజన్ అవసరమై.. అదీ సముద్రాల్లోనిదే అయ్యిండాలంటే మాత్రం భూమిపై జీవం పుట్టుక అనేది దాదాపు అసాధ్యం. చెరువుల్లో ఉండే నైట్రోజన్‌తో మాత్రమే భూమిపై జీవం ఆవిర్భవించి ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి’అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
వారానికో మాత్రతో హెచ్ఐవీని జయించొచ్చు!
బోస్టన్: హెచ్ఐవీ... పవర్ఫుల్ మందులకు కూడా లొంగని మొండి వైరస్. దీనిబారిన పడినవారి ఎయిడ్స్ సోకడం, క్రమక్రమంగా వారు మరణానికి దగ్గర కావడం వంటి ఎన్నో కేసులను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇకపై హెచ్ఐవీ బాధితులు ధైర్యంగా బతకొచ్చు. వేల రూపాయలు ఖర్చుచేసే మందులను వేసుకొని కాదు... కేవలం వారానికో మాత్ర చాలట. అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ మాత్రను తయారుచేశారు. హెచ్ఐవీని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినంతా ఓ మాత్రలో నింపారట. వారానికో మాత్ర వేసుకుంటే చాలు... హెచ్ఐవీ కారణంగా ఎదురయ్యే సమస్యలన్నింటినీ అధిగమించవచ్చని చెబుతున్నారు. ఒక్కసారి మాత్ర వేసుకున్నా.. అది వారం రోజులపాటు మెల్లమెల్లగా మందును శరీరంలోకి విడుదల చేస్తుందని చెబుతున్నారు. ఇది రోగి శారీరక ఆరోగ్యాన్నేకాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. తరచూ మందులు వేసుకోవడం వల్ల వైరస్ వాటిని తట్టుకునే శక్తిని సమకూర్చుకుంటుందని, ఇలా వారానికోసారి వేసుకునే మందు వల్ల వైరస్‌పై అది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. -
ఆరో మహా వినాశనం తప్పదా!
ఇంకో 83 ఏళ్లలో అంటే.. 2100 సంవత్సరానికల్లా భూమ్మీద బతకడం చాలా కష్టమన్న వార్తలు మనం వినే ఉంటాం.. తాజాగా అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన లారెన్జ్ సెంటర్ కూడా ఈ విషయాన్ని రూఢీ చేసింది. ఈ శతాబ్దం చివరికల్లా సముద్రాల్లో బోలెడంత కార్బన్ డయాక్సైడ్ వాయువు చేరిపోయి భూమి చరిత్రలో ఆరో మహా వినాశనం మొదలవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 54 కోట్ల ఏళ్లలో భూమ్మీద ఐదు మహా వినాశనాలు చోటు చేసుకున్నాయిని.. వీటిల్లో ఒకదాంట్లో రాకాసి బల్లులు నాశనమై పోయాయని తెలిసిన విషయమే. ఎంఐటీ శాస్త్రవేత్తలు భూ వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ మోతాదులో గతంలో వచ్చిన మార్పులను విశ్లేషించడం ద్వారా మహా వినాశనానికి అవకాశాలను గుర్తించారు. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ మోతాదుల్లో మార్పులు ఎక్కువ కాలం పాటు ఉంటే, అది కాస్తా జీవజాతులు అంతరించిపో యేందుకు దారితీస్తుందని.. ప్రస్తుతం అతితక్కువ సమయంలోనే ఈ వాయువు వాతావరణంలో, సముద్రాల్లోకి చేరిపోతున్నందున 2100 నాటికల్లా మహా వినాశనానికి బీజం పడేందుకు అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డేనియల్ రోథ్‌మన్ తెలిపారు. -
తెలుగమ్మాయి.. అంతర్జాతీయ స్థాయికి..!
సక్సెస్ అబ్రాడ్ పిల్లల భవిష్యత్తు మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షిస్తారు. ఇదే విధంగా ఆలోచించారు అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన బోయ కృష్ణ, వెంకట లక్ష్మి దంపతులు. తమ ముగ్గురు పిల్లలను ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివించలేని పేదరికం వారిది. దీంతో ఇద్దరు కుమారులను ప్రభుత్వ పాఠశాలకు పంపి.. కూతుర్ని మాత్రం ప్రైవేటు స్కూల్లో చదివించారు. ఇది వారి బంధువులను ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆ అమ్మానాన్నకు తమ కుమార్తె ప్రతిభపై అపార నమ్మకం ఉంది. ఆ అమ్మాయే ఇప్పుడు తన మేథస్సుతో ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రచురించే ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ మ్యాగజైన్లో చోటు సంపాదించింది. ఆమె పేరు బోయ రాధ. ‘మనకు ఎలాంటి ఆస్తులు లేవు.. చదువే నీ ఆస్తి’ అన్న తల్లి మాటలు ఒంట పట్టించుకున్న రాధ.. చదువులో అసమాన ప్రతిభ చూపి.. యువ శాస్త్రవేత్తగా రాణిస్తోంది. ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేసిన 35ఏళ్లలోపు వయసుగల 35 మంది శాస్త్రవేత్తలతో జాబితా రూపొందించింది. ఈ జాబితాలో ముగ్గురు భారతీయులు ఉంటే.. అందులో ఒకే ఒక్క తెలుగమ్మాయి బోయ రాధ. ఆమె సక్సెస్ అబ్రాడ్.. మాది అనంతపురం జిల్లా గుంతకల్.. నాన్న బోయ కృష్ణ, టైలర్. అమ్మ వెంకట లక్ష్మి, గృహిణి. నేను డిగ్రీవరకు గుంతకల్లోనే చదివాను. మొదట్లో నేను, ఇద్దరు అన్నయ్యలు ఇందిరా గాంధీ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చేరాం. కానీ హైస్కూల్ స్థాయికి వచ్చేసరికి ముగ్గురికి ఫీజులు కట్టే స్థోమత లేక అన్నయ్యలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. నన్ను మాత్రం అదే స్కూల్ కొనసాగించారు. నాకు మొదటి నుంచి మంచి మార్కులే వచ్చేవి. ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు రావడంతో కాలేజీ వాళ్లు రెండో ఏడాదిలో ఎలాంటి ఫీజులు వసూలు చేయలేదు. పైగా ఫస్ట్ ఇయర్లో చెల్లించిన కాలేజీ ఫీజును బెస్ట్ స్టూడెంట్ అవార్డు కింద తిరిగి ఇచ్చేశారు. డిగ్రీ.. శ్రీకన్యక పరమేశ్వరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఎంపీసీలో చేరాను. అక్కడ కాలేజీలో సిలబస్ పూర్తి అయ్యేదికాదు. చాలామంది విద్యార్థులు ప్రైవేటుగా ట్యూషన్లకు వెళ్లేవారు. నాకు శైలజ మేడమ్, శ్రీ రామచంద్రమూర్తి సార్ తమ విలువైన సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా పాఠాలు చెప్పేవారు. డిగ్రీ తర్వాత పీజీ ప్రవేశ పరీక్షలో మ్యాథ్స్, కెమిస్ట్రీ విభాగాల్లో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో సీటు వచ్చింది. నేను కెమిస్ట్రీ సబ్జెక్టు ఎంచుకున్నా. కీలక మలుపు.. సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎమ్మెస్సీలో చేరిన తర్వాత సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవ్వాలనుకున్నా. కానీ హెచ్‌వోడీ సుభా మేడం సూచనతో కెమిస్ట్రీపై దృష్టిసారించాను. అప్పటివరకు నాకు పీహెచ్డీ చేయాలనే ఆలోచన లేదు. మంచి కాలేజీలు ఎక్కడ ఉన్నాయి. అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియదు. యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే విద్యార్థుల సలహా మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో సమ్మర్ రీసెర్చ్ ఫెలోఫిప్ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకున్నా. దానికి ఎంపికవడమే నా జీవితంలో కీలక మలుపు. ఐఐఎస్సీలో సమ్మర్ రీసెర్చ్ పూర్తయ్యాక పరిశోధనల ప్రాముఖ్యం అర్థమైంది. దాంతో ఇక పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకు రాయాల్సిన పరీక్షల కోసం కోచింగ్ తీసుకునే స్థోమత లేక.. జాతీయ స్థాయి పరీక్షలైన సీఎస్ఐఆర్ నెట్, గేట్లకు సొంతంగా ప్రిపేరయ్యా. వీటిల్లో ఉత్తీర్ణత సాధించటంతో సీఎన్ఆర్ రావు కోఫౌండర్‌గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(జేఎన్సీఏఎస్ఆర్) లో సీటు లభించింది. జేఎన్సీఏఎస్ఆర్లో నానో మెటీరియల్‌కు సంబంధించిన అంశంపై పరిశోధనలు చేశాను. పోస్ట్ డాక్టోరల్ కోసం అమెరికాకు జేఎన్సీఏఎస్ఆర్లో పీహెచ్డీ ప్రోగ్రామ్ థీసిస్ సమీక్ష కోసం పంపించిన తర్వాత.. మధ్యలో కొంత సమయం దొరికింది. అప్పుడే ఇండో– యూఎస్ విజిటింగ్ ప్రీ డాక్టోరల్ ఫెలోషిప్ మీద అమెరికా వెళ్లి మూడు నెలల పాటు నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చాద్ ఎ.మిర్కిన్ పర్యవేక్షణలో అక్కడి ల్యాబ్‌లో పనిచేశాను. ప్రొఫెసర్ చాద్ నాటి అమెరికా అధ్యక్షుడికి సైంటిఫిక్ ప్యానల్లో సలహాదారుడిగా ఉండేవారు. ప్రీ డాక్టోరల్ ఫెల్‌షిప్ ముగిసిన తర్వాత ఆయన నన్ను అక్కడే పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్ చేయాలని సూచించడంతో ఇండో–యూఎస్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా చేరా. పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రాంను అమెరికాలోని(షికాగో) నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో (2012–14) పూర్తిచేశాను. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ స్పాన్సర్ చేసే Leverhulme ఎర్లీ కెరీర్ ఫెలోషిప్‌కు ఎంపికవడంతో యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్–స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో చేరాను. ప్రస్తుతం ఇక్కడే పరిశోధనలు చేస్తున్నా. నానో సైన్స్.. వైద్య రంగంలోనూ ఇప్పటివరకు నేను 38 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ చేశా. అందులో మూడింటికి పేటెంట్ హక్కులు పొందాను. ఇందులో ఒకటి... హైడ్రోజన్ అవరోధ పదార్థాన్ని కనుగొన్న పేటెంట్. కొన్ని పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి వాడే హైడ్రోజన్ వాయువు స్టెయిన్లెస్స్టీల్ లాంటి పదార్థంలో నుంచి కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల భారీ ప్రమాదాలు జరిగి, ప్రాణ నష్టం సంభవించే ఆస్కారముంది. ఈ హైడ్రోజన్ లీకేజీలు ఆపడానికి నానో మెటీరియల్‌తో ‘హైడ్రోజన్ బారియర్ కోటింగ్స్’ రూపొందించాను. మరొక పేటెంట్.. స్ట్రెయిన్ సెన్సార్స్కు సంబంధించింది. ఉదాహరణకు చచ్చుబడిపోయిన ఒక రోగి శరీరంలోని సూక్ష్మమైన కదలికల్ని సైతం గుర్తించగలిగేలా నానోసెన్సార్ పనిచేస్తుంది. ఇది కదలికలతోపాటు కచ్చితంగా టైమింగ్‌ని, కదలికల తీవ్రత మొదలైన వివరాలను గుర్తిస్తుంది. అంటే.. నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ లేకున్నా ఈ సెన్సార్స్ వాటిని గుర్తిస్తాయి. వీటిని పారిశ్రామిక పరికరాల్లోనూ విరివిరిగా ఉపయోగిస్తారు. దీనికి కూడా పేటెంట్ దక్కింది. ఎంఐటీ గుర్తించిన వేళ ఎంఐటీ రివ్యూ 35 అండర్ 35 జాబితాలో చోటు సంపాదించడం అంత సులువు కాదు. అద్భుతమైన ప్రతిభ కనబరిస్తే కానీ జాబితాలో చోటు దక్కదు. గతంలో ఈ జాబితాలో చోటు సంపాదించిన వారిలో కొందరు నోబెల్ బహుమతులు సైతం పొందారు. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ కో ఫౌండర్స్ లారీపేజ్, సెర్గీ బ్రిన్, యాపిల్ చీఫ్ డిజైనర్ జోనాథన్ ఐవ్, ఐరోబోట్ కో ఫౌండర్ హెలెన్ గ్రెయినర్, పేపాల్ కో ఫౌండర్ మాక్స్లెవ్చిన్.. మొదలైన ప్రముఖులెందరో ఎంఐటీ రివ్యూ జాబితాలో కనిపించినవారే. ఎంఐటీ రివ్యూ ఎంపిక ప్రక్రియ భిన్నంగా, క్లిష్టంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పోటీపడతారు. సైన్స్, టెక్నాలజీ, సామాజికసేవ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మొదలైన రంగాల్లో ప్రపంచాన్ని మార్చే సత్తా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. దీనికి ఎంపిక కావాలంటే.. ముందు ఆయా రంగాల్లో నిపుణులైనవారు మన పనిని గుర్తించి ఇందులో ఎంట్రీకి సిఫారసు చేయాలి. తర్వాత మొత్తమ్మీద ఎంఐటీ టెక్నాలజీ రివ్యూమ్యాగజైన్ ఎడిటర్‌కు 500 నామినేషన్లు అందుతాయి. ఇందులో ఎడిటర్ 100 మందిని ఎంపిక చేసి.. వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన 30 మంది న్యాయ నిర్ణేతలుండే ప్యానల్‌కు పంపిస్తారు. వీరి సిఫారసుల మేరకు 35 మంది యువ శాస్త్రవేత్తల జాబితాను ఎడిటర్ ఎంపిక చేస్తారు. ఉపకారవేతనాలే అండగా అకడమిక్‌గా ప్రతిభ కనబరుస్తుండటంతో చాలా స్కాలర్‌ఫిప్స్ లభించాయి. లోరియల్–యునెస్కో యూకే అండ్ ఇండియా ఫెలోషిప్, డేమ్ కేథ్లీన్ ఒల్లెరెన్‌షా ఫెలోషిప్, యూకే, Leverhulme ఎర్లీ కెరీర్ ఫెలోషిప్, యూకే, మేరీ క్యూరీ ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ ఫెలోషిప్ వంటి స్కాలర్షిప్స్ ఉన్నత విద్యకు అండగా నిలిచాయి. ప్రొఫైల్ పదో తరగతి 83 శాతం (1999 – 2000) ఇంటర్ (ఎంపీసీ) 93.2 శాతం (2000 – 2002) బీఎస్సీ (ఎంపీసీ) 91 శాతం (2002 – 05) ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ) గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు (2005 – 07) పీహెచ్డీ 7.14/8 సీజీపీఏ (2007 – 2012) -
ఇక గాలిని తాగెయ్యొచ్చు!
అదేంటి... నీటిని కదా తాగాలి అనుకుంటున్నారా? ఏమీలేదండి ఆ గాలిలోని నీటిని ఒడిసిపట్టి, పరిశుభ్రమైన నీటిగా మారిస్తే తాగలేమా? కానీ అలా మార్చడం సాధ్యమేనా? అని అడిగే మీ ప్రశ్నకు ఇదిగో సమాధానమంటూ చూపుతున్నారు భారత సంతతి పరిశోధకులు. గాలిలోని నీటిని సేకరించడమే కాకుండా దానిని పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే సరికొత్త పరికరాన్ని రూపొందించారు. అయితే ఈ పరికరం సౌరశక్తి ద్వారా పనిచేయడం విశేషం. భూమిపై ఉన్న వాతావరణంలో సుమారు 13,000 ట్రిలియన్ లీటర్ల నీరుందట. అంటే ఇది భూమిపై ఉన్న మొత్తం సరస్సుల్లోని నీటిలో 10 శాతమన్నమాట. గాలిలోని నీటిని వినియోగించుకున్నా జలాశయాల నుంచి మళ్లీ నీరు ఆవిరి కావడంతో ఎటువంటి సమస్యా ఉండదని చెబుతున్నారు. దీనిని ఉపయోగించడం ద్వారా తాగునీటి సమస్యను కొంతమేర అయినా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ పరికరంలోని అత్యంత కీలకమైన భాగాన్ని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఐటీ) తయారుచేసింది. 20 శాతం నీటి ఆవిరి ఉన్న ప్రాంతంలోని గాలి నుంచి కూడా ఇది నీటిని ఒడిసి పడుతుందని నిట్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. 12 గంటల్లో 2.8 లీటర్ల నీటిని గాలి నుంచి శోషిస్తుందని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చని రూపకర్తలు చెబుతున్నారు. -
తుమ్మితే 8 మీటర్ల వరకు తుంపర్లు
లండన్: అనుకోకుండా తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే అవి తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు కాకపోవడమే. కానీ అవి ఇతరులకు తీవ్రమైన అంటు రోగాలను కలిగించే ప్రమాదం ఉంది. అసలు తుమ్మినా, దగ్గినా వెలువడే లాలాజలం, శ్లేష్మం తుంపర్లు ఎంతదూరం ప్రయాణిస్తాయో తెలుసుకునేందుకు కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ నిపుణులు ప్రయత్నించి విజయం సాధించారు. సెకండుకు వేలాది ఫ్రేమ్స్‌ను తీయగల అత్యాధునిక కెమేరాలను ఉపయోగించి మనిషి తుమ్ములు, దగ్గుల నుంచి వెలువడే లాలాజలం, శ్లేష్మం ప్రయాణించే దూరాన్ని వీడియో తీశారు. తుమ్మినా, దగ్గినా వెలువడే బిందువులు, తుంపర్లు ఒకటి, రెండు మీటర్లకు మించి దూరం ప్రయాణించవని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. కానీ వీడియో రికార్డు ద్వారా తేలిందేమంటే తుమ్మితే తుంపర్లు ఎనిమిది మీటర్ల వరకు, దగ్గితే ఆరు మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా వీటి ప్రయాణ దూరంలో కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి. పెద్ద బిందువులు తక్కువ దూరం, చిన్న తుంపర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని ఇంతకాలం శాస్త్రవేత్తలు పొరపాటు పడ్డారు. పెద్ద బిందువులే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. నోటీ నుంచి లాలాజలం, ముక్కు నుంచి శ్లేష్మం తొలుత పలకలుగా బయల్దేరి గాలి ఒత్తిడి కారణంగా బిందువులుగాను, తుంపర్లుగాను మారి వాతావరణంలో కలసిపోతాయి. ఆ తుంపర్లు వాతావరణంలో స్థిరపడడానికి కూడా పది నిమిషాల సమయం పడుతుందని అధ్యయనంలో వెల్లడైంది. రోగుల లాలాజలం ద్వారా సంక్రమించే అంటు రోగాలు రోగికి ఆరేడు మీటర్ల దూరంలో ఉన్నప్పటికే ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుందని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. -
సాస్ ఇక సీసాకు అంటుకోదు...
టొమాటో సాస్, చిల్లీ సాస్ వంటివి సీసాల్లో దొరుకుతుంటాయి. పూర్తిగా వాడేసిన తర్వాత కూడా ఇవి ఎంతో కొంత మేరకు సీసా లోపలి గోడలకు అంటుకునే ఉంటాయి. వాటిని బయటకు తీయలేక ఆ సీసాలను అలాగే పారేస్తాం. చివరి చుక్క వరకు కెచప్, సాస్ సీసాలను ఖాళీ చేద్దామనుకుంటే మనకు సాధ్యం కాదు. అయితే, ఈ సమస్యకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థులు విరుగుడు కనిపెట్టారు. సాస్, కెచప్ వంటి చిక్కని ద్రావకాలను భద్రపరచే సీసాలకు లోపలిపూతగా ఉపయోగించేందుకు వీరు ‘లిక్విగ్లైడ్’ అనే పదార్థాన్ని రూపొందించారు. ఈ పూత పూసిన సీసాలలో భద్రపరచిన సాస్, కెచప్ వంటి చిక్కని ద్రవాలు చివరి చుక్క వరకు తేలికగా జారిపోయి బయటకు వచ్చేస్తాయి. సీసా ఖాళీ అయిన తర్వాత అందులో ఎలాంటి మరకలూ కనిపించవు. అయితే, ఈ ‘లిక్విగ్లైడ్’ ఒక్కో రకమైన పదార్థానికి ఒక్కో రకంగా తయారు చేయాల్సి ఉంటుందని, సాస్, కెచప్ వంటి ఆహార పదార్థాలు భద్రపరచే సీసాల కోసం ఒకరకంగా, హెయిర్ క్రీములు వంటివి భద్రపరచే ట్యూబులు, సీసాల కోసం మరో రకంగా తయారు చేయాల్సి ఉంటుందని ఎంఐటీ విద్యార్థులు చెబుతున్నారు. -
ఢిల్లీనే నెంబర్.1
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరం అన్ని నగరాలను పక్కకుతోసి టాప్‌లో నిలిచింది. ఎందులో అనుకుంటున్నారా... దేశంలోని కాలుష్య నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఎమ్బీఎంటీ వాయు కాలుష్య, ప్రజారోగ్య శాఖ ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీలో సగటున సెకనుకు 10 మైక్రోమీటర్ల సాంధ్రతతో గాలి కలుషితమవుతోంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 2014 లో ఎమ్బీఎంటీ వాయు కాలుష్య, ప్రజారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... ఉత్తర భారత దేశంలోని కాలుష్య నగరాల్లో ఢిల్లీ (పిఎం 10), జార్ఖండ్(సల్ఫర్ డయోడ్), పశ్చిమబెంగాల్ (నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువ)లు ప్రథమస్థానాల్లో ఉన్నాయి. పిహెచ్‌ఎఫ్‌ఐ పరిశోధనల ప్రకారం...ఇప్పటివరకు ఢిల్లీలో 2004 సంవత్సరంలో అతి తక్కువ వాతావరణ కాలుష్యం నమోదైంది. అప్పటినుంచి ఇప్పటివరకు వాహనకాలుష్యాన్ని నివారించే ప్రత్యామ్నాయాల అన్వేషణలో ఢిల్లీ వాయుకాలుష్య శాఖ విఫలమైంది. అంతేకాకుండా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు కూడా వాయు కాలుష్యానికి మరో కారణంగా చెప్పవచ్చు. వాయు కాలుష్యంవల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయి. దీనివల్ల ఆస్తమా , ఊపిరితిత్తుల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణ తెలిపారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఆరోగ్యశాఖ వాయు కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది. ఇటీవల 170 దేశాల్లో నిర్వహించిన వాయు కాలుష్య సూచీ పరిశోధనల ప్రకారం...చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లను వెనక్కినెట్టి భారత్ ప్రథమస్థానంలో నిలిచింది. ఈ సమస్యపై మసాచుసెట్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మైకేల్ గ్రీన్ స్టన్ వెల్లడించిన వివరాల ప్రకారం...భారత్, చైనా మరికొన్ని దేశాల్లోని ప్రజలు వాయు కాలుష్యానికి ఎక్కువగా గురి అవుతున్నట్లు వెల్లడైంది. -
అంగారక సూట్!
వ్యోమగాములు అనగానే.. గాలితో బాగా ఉబ్బిపోయిన తెల్లటి సూట్ ధరించి తలకు ఓ పెద్ద హెల్మెట్ పెట్టుకొని రోబోల్లా మెల్లగా అడుగుతీసి అడుగు వేసే మనుషులే మనకు గుర్తొస్తారు. అంతరిక్షంలో శూన్య వాతావరణం, సంక్లిష్టం, బరువైన స్పేస్ సూట్ల వల్లే వ్యోమగాములు మనలా తేలికగా కదలలేరు. అందుకే.. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వ్యోమగాముల కోసం అతితేలికైన కొత్త తరం ‘స్కిన్‌టైట్’ స్పేస్ సూట్‌ను రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో మానవసహిత అంగారక యాత్రలకు దీనిని ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. పీడనానికి గురిచేసిన వాయువులతో నిండి ఉండే సంప్రదాయ స్పేస్సూట్ల మాదిరిగా కాకుండా దీనిని స్థితిస్థాపక ధర్మాలు కలిగిన ప్రత్యేక లోహపు పదార్థాన్ని కూర్చి తయారు చేస్తున్నారు. మన శరీరంలోని కండరాల మాదిరిగా సంకోచించే ఈ పదార్థపు పట్టీలు.. వేడి చేసినప్పుడు కుంచించుకుపోయి.. చల్లబర్చినప్పుడు తిరిగి యథా ఆకారంలోకి వస్తాయి. వీటితో తయారు చేసిన స్పేస్ సూట్ కూడా ఒక బటన్ నొక్కగానే వ్యోమగాముల శరీరానికి అతుక్కున్నట్లు కుంచించుకుపోయి స్కిన్ టైట్ అవుతుంది. దీన్ని ధరిస్తే మార్స్‌పై స్వల్ప గురుత్వాకర్షణలోనూ వ్యోమగాములు సులభంగా కదులుతూ అనేక పనులు చేసుకోవచ్చని చెబుతున్నారు. -
చిప్స్ ప్యాకెట్‌కూ చెవులుంటాయి!
న్యూయార్క్: రహస్యమైన విషయాలను మాట్లాడుకునేటప్పుడు.. గోడలకు చెవులుంటాయంటూ నక్కి ఉండేవారిని గూర్చి అంటుంటారు. మరి ఎవరూ నక్కి ఉండకపోయినా, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ లేకపోయినా మీరేం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది! ఇక ముందు మీరు చిప్స్ తినేసి పక్కన పెట్టిన ఖాళీ ప్యాకెట్, మంచినీళ్ల గ్లాసు, పక్కనే ఉన్న ఒక మొక్క.. ఇలాంటివన్నీకూడా మీరేం మాట్లాడుకున్నారో చెప్పేస్తాయి. ఇందుకు తోడ్పడే అల్గారిథమ్ (ప్రోగ్రామ్)ను అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. సాధారణంగా ధ్వని తరంగాలు.. అన్నిరకాల వస్తువులలో స్వల్పస్థాయిలో ప్రకంపనాలను కలిగిస్తాయి. ధ్వనిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఉండే ఈ ప్రకంపనాలు సాధారణ కంటికి కనిపించవు. కానీ అత్యంత వేగంగా చిత్రీకరించే సామర్థ్యమున్న కెమెరాలతో.. ఆ ప్రకంపనాలను గుర్తించవచ్చు. వీటిని శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్ సహాయంతో విశ్లేషిస్తే.. ఆ ధ్వని పునరుత్పత్తి అవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు కూడా. తొలుత వారు ఒక ధ్వని చేసి.. ఆ ధ్వనికి ఐదు మీటర్ల దూరంలో ఉన్న చిప్స్ ప్యాకెట్లో కలిగిన ప్రకంపనాలను చిత్రించారు. వాటిని ‘అల్గారిథమ్’తో విశ్లేషించి.. అదే ధ్వని తిరిగి ఉత్పత్తి చేయగలిగారు. -
అమెరికాలో టాప్-20 కాలేజీలివే
-
విభజన వీరుడు
తెరవెనుక రాజకీయాల్లో తల‘పండితుడు’... ప్రస్థానం: జైరాం రమేశ్ జననం : 1954, ఏప్రిల్ 9 పుట్టిన ఊరు : చిక్‌మగళూరు (కర్ణాటక) తండ్రి : సీకే రమేశ్, ఐఐటీ ప్రొఫెసర్ తల్లి : శ్రీదేవీ రమేశ్ చదువు : బీ టెక్ (బొంబాయి ఐఐటీ), ఎంఎస్ (కార్నెగీ మెలన్ వర్సిటీ, ఎంఐటీ, అమెరికా) భార్య : కేఆర్ జయశ్రీ నియోజకవర్గం : రాజ్యసభ సభ్యుడు నివాసం : రాజేశ్ పైలట్ మార్గ్, న్యూఢిల్లీ ప్రస్తుత వైఖరి : భజన కుదరకుంటే విభజన రాజకీయ అరంగేట్రం : 2004లో రాజ్యసభకు తొలి విజయం : పోటీచేస్తే కదా! రాజకీయాల్లో : తరచు ‘మాస్’ గురించి ఇమేజ్ మాట్లాడే ‘క్లాస్’ నాయకుడు లోపాలు : {పత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోవడం, నోరుజారి నాలుక కరచుకోవడం పన్యాల జగన్నాథ దాసు: చదువుకున్నది ఇంజనీరింగ్ అయినా ఆర్థికవేత్తగా గుర్తింపు పొందిన గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్, దేశంలో సంస్కరణల శకం మొదలైనప్పటి నుంచి కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. కర్ణాటకలోని చిక్మగళూరులో పుట్టి, బొంబాయిలో పెరిగిన జైరాం, స్వతహాగా తమిళుడు. ఆయన తండ్రి సీకే రమేశ్ బొంబాయి ఐఐటీలో సివిల్ ఇంజనీ రింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. జైరాం కూడా తండ్రి బాట లోనే బొంబాయి ఐఐటీలో సీటు సాధించి బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్) చదువుకున్నారు. తర్వాత అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ నుంచి పబ్లిక్ మేనేజ్మెంట్లో ఎంఎస్ పూర్తి చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీలో (ఎంఐటీ) పీహెచ్డీ చేస్తూ మధ్యలోనే మానేశారు. జైరాం 1978లో ప్రపంచబ్యాంకు లో కొద్దికాలం ఉద్యోగం చేశారు. ఏడాది తర్వాత దేశానికి తిరిగి వచ్చాక బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్లో ఆర్థికవేత్త లవరాజ్ కుమార్ వద్ద సహాయకుడిగా చేరారు. కేంద్ర ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల్లో పలు హోదాల్లో పనిచేశారు. వీపీ సింగ్ హయాంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేశారు. పీవీ నరసింహారావు హయాంలో ప్రధాని సలహాదారుగా అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలసి సంస్కరణల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి సలహాదారుగా, చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా 1996-98 కాలంలో ఆయనకు సలహాదారుగా పనిచేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రాజస్థాన్ అభివృద్ధి మండలి సభ్యుడిగా, ఛత్తీస్‌గఢ్ సర్కారుకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తల బృందంలో సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. అదే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ-1 సర్కారు హయాంలో జాతీయ సలహా మండలి సభ్యుడిగా కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించారు. 2009లోనూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ విధానాలను అభిమానించే జైరాం రమేశ్, కాంగ్రెస్ పార్టీ తెరవెనుక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు, వాణిజ్య పత్రికల్లో కాలమిస్టుగా పనిచేసిన అనుభవంతో సోనియా గాంధీ ప్రసంగాల రచయితగానూ రాణిస్తున్నారు. కాంగ్రెస్ 125వ వార్షికోత్స వాల సందర్భంగా 2010లో ఏడాది పొడవునా పార్టీ చేపట్టిన కార్యక్రమాల కోసం సోనియా నియమించిన 19 మంది సభ్యుల బృందంలో జైరాం కూడా ఉన్నారు. విభజనలే విజయ సోపానాలు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో విజయవంతమైన పాత్ర పోషించిన జైరాం రమేశ్, తాజాగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల ను కూడా విభజిస్తే ఒక పనైపోతుందనే ధోరణిలో చేస్తున్న ప్రకటనలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పాలనా సౌలభ్యం కోసం పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను కూడా విభజించాలని జైరాం చేసిన ప్రకటన వెనుక ఎన్నికల వ్యూహం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎప్పట్నుంచో యూపీ విభజన కోసం పట్టుబడుతున్నారు. ఆమె హయాంలో అసెంబ్లీలో ‘విభజన’ తీర్మానం కూడా చేశారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని యూపీలో లబ్ధి పొందాలనే ఎత్తుగడతోనే జైరాం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. వివాదాలకు కేరాఫ్ విభజనవాదాన్ని తలకెత్తుకున్న జైరాం రమేశ్‌కు వివా దాలూ కొత్త కాదు. దేశంలో టాయిలెట్ల కంటే ఆలయాలే ఎక్కువగా ఉన్నాయన్న వ్యాఖ్యతో సంఘ్ పరివార్ శక్తు లకు ఆగ్రహం తెప్పించారు. ముజఫర్‌నగర్ బాధితు లతో పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మంతనాలు సాగి స్తోందంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు.