విభజన వీరుడు
తెరవెనుక రాజకీయాల్లో తల‘పండితుడు’...
ప్రస్థానం: జైరాం రమేశ్
జననం : 1954, ఏప్రిల్ 9
పుట్టిన ఊరు : చిక్‌మగళూరు (కర్ణాటక)
తండ్రి : సీకే రమేశ్, ఐఐటీ ప్రొఫెసర్
తల్లి : శ్రీదేవీ రమేశ్
చదువు : బీ టెక్ (బొంబాయి ఐఐటీ), ఎంఎస్ (కార్నెగీ మెలన్ వర్సిటీ, ఎంఐటీ, అమెరికా)
భార్య : కేఆర్ జయశ్రీ
నియోజకవర్గం : రాజ్యసభ సభ్యుడు
నివాసం : రాజేశ్ పైలట్ మార్గ్, న్యూఢిల్లీ
ప్రస్తుత వైఖరి : భజన కుదరకుంటే విభజన
రాజకీయ అరంగేట్రం : 2004లో రాజ్యసభకు
తొలి విజయం : పోటీచేస్తే కదా!
రాజకీయాల్లో : తరచు ‘మాస్’ గురించి ఇమేజ్ మాట్లాడే ‘క్లాస్’ నాయకుడు
లోపాలు : {పత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోవడం, నోరుజారి నాలుక కరచుకోవడం
పన్యాల జగన్నాథ దాసు:
చదువుకున్నది ఇంజనీరింగ్ అయినా ఆర్థికవేత్తగా గుర్తింపు పొందిన గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్, దేశంలో సంస్కరణల శకం మొదలైనప్పటి నుంచి కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. కర్ణాటకలోని చిక్‌మగళూరులో పుట్టి, బొంబాయిలో పెరిగిన జైరాం, స్వతహాగా తమిళుడు. ఆయన తండ్రి సీకే రమేశ్ బొంబాయి ఐఐటీలో సివిల్ ఇంజనీ రింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. జైరాం కూడా తండ్రి బాట లోనే బొంబాయి ఐఐటీలో సీటు సాధించి బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్) చదువుకున్నారు. తర్వాత అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీ నుంచి పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్ పూర్తి చేశారు.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీలో (ఎంఐటీ) పీహెచ్‌డీ చేస్తూ మధ్యలోనే మానేశారు. జైరాం 1978లో ప్రపంచబ్యాంకు లో కొద్దికాలం ఉద్యోగం చేశారు. ఏడాది తర్వాత దేశానికి తిరిగి వచ్చాక బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్‌లో ఆర్థికవేత్త లవరాజ్ కుమార్ వద్ద సహాయకుడిగా చేరారు. కేంద్ర ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల్లో పలు హోదాల్లో పనిచేశారు. వీపీ సింగ్ హయాంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేశారు. పీవీ నరసింహారావు హయాంలో ప్రధాని సలహాదారుగా అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలసి సంస్కరణల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి సలహాదారుగా, చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా 1996-98 కాలంలో ఆయనకు సలహాదారుగా పనిచేశారు. కర్ణాటక రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రాజస్థాన్ అభివృద్ధి మండలి సభ్యుడిగా, ఛత్తీస్‌గఢ్ సర్కారుకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తల బృందంలో సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. అదే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
యూపీఏ-1 సర్కారు హయాంలో జాతీయ సలహా మండలి సభ్యుడిగా కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించారు. 2009లోనూ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ విధానాలను అభిమానించే జైరాం రమేశ్, కాంగ్రెస్ పార్టీ తెరవెనుక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు, వాణిజ్య పత్రికల్లో కాలమిస్టుగా పనిచేసిన అనుభవంతో సోనియా గాంధీ ప్రసంగాల రచయితగానూ రాణిస్తున్నారు. కాంగ్రెస్ 125వ వార్షికోత్స వాల సందర్భంగా 2010లో ఏడాది పొడవునా పార్టీ చేపట్టిన కార్యక్రమాల కోసం సోనియా నియమించిన 19 మంది సభ్యుల బృందంలో జైరాం కూడా ఉన్నారు.
విభజనలే విజయ సోపానాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో విజయవంతమైన పాత్ర పోషించిన జైరాం రమేశ్, తాజాగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల ను కూడా విభజిస్తే ఒక పనైపోతుందనే ధోరణిలో చేస్తున్న ప్రకటనలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పాలనా సౌలభ్యం కోసం పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను కూడా విభజించాలని జైరాం చేసిన ప్రకటన వెనుక ఎన్నికల వ్యూహం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎప్పట్నుంచో యూపీ విభజన కోసం పట్టుబడుతున్నారు. ఆమె హయాంలో అసెంబ్లీలో ‘విభజన’ తీర్మానం కూడా చేశారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని యూపీలో లబ్ధి పొందాలనే ఎత్తుగడతోనే జైరాం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.
వివాదాలకు కేరాఫ్
విభజనవాదాన్ని తలకెత్తుకున్న జైరాం రమేశ్‌కు వివా దాలూ కొత్త కాదు. దేశంలో టాయిలెట్ల కంటే ఆలయాలే ఎక్కువగా ఉన్నాయన్న వ్యాఖ్యతో సంఘ్ పరివార్ శక్తు లకు ఆగ్రహం తెప్పించారు. ముజఫర్‌నగర్ బాధితు లతో పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ మంతనాలు సాగి స్తోందంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు.