ఇక గాలిని తాగెయ్యొచ్చు! | is it possible to drink air? | Sakshi
Sakshi News home page

ఇక గాలిని తాగెయ్యొచ్చు!

Published Sun, Apr 23 2017 3:03 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

ఇక గాలిని తాగెయ్యొచ్చు!

ఇక గాలిని తాగెయ్యొచ్చు!

అదేంటి... నీటిని కదా తాగాలి అనుకుంటున్నారా? ఏమీలేదండి ఆ గాలిలోని నీటిని ఒడిసిపట్టి, పరిశుభ్రమైన నీటిగా మారిస్తే తాగలేమా? కానీ అలా మార్చడం సాధ్యమేనా? అని అడిగే మీ ప్రశ్నకు ఇదిగో సమాధానమంటూ చూపుతున్నారు భారత సంతతి పరిశోధకులు. గాలిలోని నీటిని సేకరించడమే కాకుండా దానిని పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే సరికొత్త పరికరాన్ని రూపొందించారు. అయితే ఈ పరికరం సౌరశక్తి ద్వారా పనిచేయడం విశేషం. భూమిపై ఉన్న వాతావరణంలో సుమారు 13,000 ట్రిలియన్‌ లీటర్ల నీరుందట. అంటే ఇది భూమిపై ఉన్న మొత్తం సరస్సుల్లోని నీటిలో 10 శాతమన్నమాట.

గాలిలోని నీటిని వినియోగించుకున్నా జలాశయాల నుంచి మళ్లీ నీరు ఆవిరి కావడంతో ఎటువంటి సమస్యా ఉండదని చెబుతున్నారు. దీనిని ఉపయోగించడం ద్వారా తాగునీటి సమస్యను కొంతమేర అయినా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ పరికరంలోని అత్యంత కీలకమైన భాగాన్ని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎమ్‌ఐటీ) తయారుచేసింది. 20 శాతం నీటి ఆవిరి ఉన్న ప్రాంతంలోని గాలి నుంచి కూడా ఇది నీటిని ఒడిసి పడుతుందని నిట్‌ ప్రొఫెసర్లు చెబుతున్నారు.  12 గంటల్లో 2.8 లీటర్ల నీటిని గాలి నుంచి శోషిస్తుందని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చని రూపకర్తలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement