కష్టపడి చదివి, నేర్చుకుని ప్రతిభాపాటవాలను సొంతం చేసుకుంటాం. ఇది సర్వసాధారణం. కానీ కొందరూ పుట్టుకతోనే మేధావులుగా ఉంటారు. చిన్న వయసులోనే తమలో ఉన్న అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంటారు. మనలా సంప్రదాయ విద్య సరిపడదు వారికి. ఎందుకంటే వయసుకి అనుగుణమైన విద్యకు మించిన జ్ఞానం వీరి సొంతం. అలాంటి కోవకు చెందిందే మాళవిక రాజ్ జోషి. ఆ ప్రతిభే ఆమె ఉన్నతికి ప్రతిబంధకమై.. ఐఐటీలో ప్రవేశానికి అనర్హురాలిగా చేసింది. విద్యాపరంగా పలు సవాళ్లు ఎదుర్కొనక తప్పలేదు. చివరికి ప్రతిష్టాత్మకమైన ఎంఐటీలో చోటు దక్కించుకుని శెభాష్ మాళవిక అని అనిపించుకుంది.
ముంబైకి చెందిన మాళవిక రాజ్ జోషికి చిన్నప్పటి నుంచి అపారమైన ప్రతిభ ఉంది. చిన్న వయసులోనే గణితం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో అపారమైన నైపుణ్యం ఉంది. ఆమె ఇంటెలిజెన్సీ పవర్‌ని గుర్తించి.. ఏడో తరగతి నుంచి సంప్రదాయ విద్యా విధానానికి స్వస్తి చెప్పించింది తల్లి సుప్రియ. అప్పటి వరకు ముంబైలోని దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్‌లో చదువుకునేది మాళవిక.
ఆమె చదువుని సీరియస్ తీసుకుని ఇంటివద్దే ప్రిపేర్ అయ్యేలా శిక్షణ ఇచ్చారు తల్లి సుప్రియ. కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేశారామె. పాఠశాల విద్యను అభ్యసించకపోయినప్పటికీ మాళవిక గణితం, ప్రోగ్రామింగ్‌లో బాగా రాణించింది. దీంతో మాళవిక తల్లిదండ్రులు ఆమెను ఐఐటీకీ పంపాలనుకున్నారు. కానీ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరు కానందున ప్రతిష్టాత్మకమైన ఐఐటీ క్యాంపస్‌లు ఆమెను తిరస్కరించాయి.
అయితే ఆమె ప్రతిభాపాటవాలు బీఎస్సీ డిగ్రీకి సరితూగేవి. దీంతో ఆమె చిన్న వయసులోనే చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్ (CMI)లోని ఎమ్మెస్సీ స్థాయి కోర్సులో అడ్మిషన్ పొందగలిగింది. అలా ఆమె గ్లోబల్ ప్రోగ్రామింగ్ పోటీలలో కూడా పాల్గొనడం ప్రారంభించింది. ఈ పోటీల్లో రాణించి.. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చోటు దక్కించుకుంది. దీంతో మాళవిక కేవలం 17 ఏళ్లకే ఎంఐటీ సీటు పొందిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఒక చోట మన ప్రతిభను గుర్తింకపోయినా..వాటిని తలదన్నే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు గుర్తిస్తాయని చాటి చెప్పింది. టాలెంట్ ఉన్న వాడిని ఆపడం ఎవరితరం కాదంటే ఇదే కదూ..!
(చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది)
Comments
Please login to add a commentAdd a comment