ఏరో హీరో | Thala Ajith's interest in Aero-modeling and his role in MIT | Sakshi
Sakshi News home page

ఏరో హీరో

Published Mon, May 7 2018 1:26 AM | Last Updated on Fri, May 25 2018 1:14 PM

Thala Ajith's interest in Aero-modeling and his role in MIT - Sakshi

అజిత్‌

కోట్ల రెమ్యునరేషన్‌. సినిమా రిలీజ్‌ అయితే వందల కోట్ల బిజినెస్‌. ఇదీ హీరో అజిత్‌ మార్కెట్‌. ఇప్పుడు మరో కొత్త జాబ్‌లో జాయిన్‌ అయ్యారు. శాలరీ ఎన్ని కోట్లో అనుకుంటున్నారా? కోట్లు కాదండి.. వెయ్యి రూపాయిలు మాత్రమే. అవును.. కోట్ల రెమ్యునరేషన్‌ అందుకుంటున్న ఈ హీరో వెయ్యి రూపాయిల జీతంతో కొత్త జాబ్‌ టేకప్‌ చేశారు. మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అజిత్‌ను ‘హెలికాప్టర్‌ టెస్ట్‌ పైలెట్‌ అండ్‌ యూవీఏ సిస్టమ్‌ అడ్వైసర్‌’గా అపాయింట్‌ చేసింది.

ఈ పని కోసం అజిత్‌ విజిట్‌ చేసిన ప్రతీసారి 1,000 రూపాయిలు జీతంగా ఇస్తారట. చిన్నప్పటి నుంచి ఏరో టాపిక్‌ అంటే ఇష్టం ఉన్న అజిత్‌ ఈ అసైన్‌మెంట్‌ను తనంతట తాను అడిగి టేకప్‌ చేశారట. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ కాంపిటేషన్‌ కోసం అజిత్‌ మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్‌) టెస్టింగ్‌ అండ్‌ డిజైనింగ్‌లో తన సేవలు అందిస్తారు. వచ్చే 1,000 రూపాయిల జీతాన్ని కూడా ఎమ్‌ఐటీలో పేద విద్యార్థుల కోసం డొనేట్‌ చేయనున్నారు.తాజా చిత్రం ‘విశ్వాసం’ షూటింగ్‌ కోసం అజిత్‌  ఆదివారం హైదరాబాద్‌ వచ్చారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement