ఎంఐటీ విద్యార్థులతో అజిత్
తమిళసినిమా: నటుడు అజిత్‌కు చెన్నై ఎంఐటీలో ఉద్యోగం వచ్చింది. జీతం ఎంతో తెసుసా? కేవలం రూ.1000. ఏమిటీ నమ్మశక్యం కావడం లేదా. అవునులే ఒక్క సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకునే అజిత్ కేవలం రూ.1000 జీతానికి ఉద్యోగం చేస్తున్నారంటే ఎవరు మాత్రం నమ్ముతారు. అయితే ఇది నిజం. చెన్నైలోని ఎంఐటీలో సాంకేతిక పరిజ్ఞానం శాఖ తరఫున తయారు చేస్తున్న మానవశక్తి అవసరం లేని చిన్న విమాన పథకానికి నటుడు అజిత్ సలహాదారుడిగా నియమింపబడ్డారు. అంటే చిన్న విమానానికి అజిత్ టెస్ట్ పైలట్‌గా వ్యవహరించనున్నారన్న మాట. ఎంఐటీ సాంకేతిక పరిజ్ఞాన విభాగం మనవశక్తి అవసరం లేని విమానాలను తమారు చేసే పనిలో నిమజ్ఞమైంది. ఇవి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న రోగులకు వైద్య సహాయాన్ని అందించి తిరిగి రాగలవు.
ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో మెడికల్ ఎక్స్‌ప్రెస్ 2018 ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎంఐటీలోని సాంకేతిక పరిజ్ఞాన విభాగ విద్యార్థులు మానవశక్తి అవసరం లేని చిన్న విమానాన్ని తయారు చేస్తున్నారు. వారికి తన సహకార, సలహాలను అందించడానికి నటుడు అజిత్ సిద్ధం అవుతున్నారు. అందుకుగానూ ఆయన పారితోషికంగా రూ.1000 అందుకోనున్నారు. ఈయన చదువుకునే రోజుల్లోనే ఆకాశంలో పయనించే విమానాలకు చెందిన మోడల్స్ తయారు చేయడంపై ఆసక్తి చూపించేవారు. అదే విధంగా రిమోట్ ద్వారా నడిపే వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపేవారు. అలాంటి ఆసక్తితోనే చెన్నై ఎంఐటీలోని దక్ష అనే సాంకేతిక పరిజ్ఞాన బృందంలో తానూ ఒకరిగా చేరారు. ఈ బృందమే ఇప్పుడు అస్ట్రేలియాలో జరగనున్న మెడికల్ ఎక్స్‌ప్రెస్ 2018 పోటీల్లో పాల్గొననుంది. అదే విధంగా అన్నావిశ్వవిద్యాలయం కూడా నటుడు అజిత్‌ను మనుషుల అవసరం లేని విమాన పథకానికి సలహాదారుడిగా నియమించుకుంది. ఇందుకుగానూ అజిత్ ప్రతిసారి వచ్చి వేళ్లేందుకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment