![Eggs Kejriwal Dish Roots In Mumbais Breakfast Story Become Hilarious](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/Recip1.jpg.webp?itok=sErW456F)
కొన్ని రెసిపీల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి పేర్లు భలే తమాషాగా ఉంటాయి. అసలు వాటికా పేరు ఎలా వచ్చిందో వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ రెసిపీకి కూడా అలానే పేరు వచ్చింది. కాకపోతే మన దేశ రాజధాని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పేరు మీద ఉండటం చూస్తే..ఆయనే పేరు మీద రెసీపీ పేరేంటీ అని అనుకోకండి. నిజానికి ఆయనకి ఈ రెసిపీతో సంబంధం లేకపోయినా..ఆ రెసీపీ స్టోరీ మాత్రం వెరీ ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది ఎందుకంటే..?.
ఆ వంటకం పేరు ఎగ్స్ కేజ్రీవాల్(Eggs Kejriwal) అనే ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్. భారతీయ వంటకాల్లో ఎగ్స్‌తో చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ వంటకం మాత్రం చాలా గమ్మతైనది. ఈ వంటకం ఆవిష్కరణ కూడా అత్యంత విచిత్రమైనది. ఈ వంటకం మూలం ముంబై(Mumbai). ఈ వంటకానికి కేజ్రీవాల్ పేరు ఎలా వచ్చిందంటే..1960లలో ముంబైలోని నాగరిక విల్లింగ్‌డన్ స్పోర్ట్స్ క్లబ్ దేవీ ప్రసాద్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్త కారణంగా వచ్చిందట.
ఆయనది పూర్తిగా శాకాహారులైన మార్వాడీ కుటుంబం. కాబట్టి ఇంట్లో గుడ్డు తినే ఛాన్స్ లేకపోయింది. అయితే ఆయనకు గుడ్లంటే మహా ప్రీతి. వాటిని ఆరగించేందుకు విల్లింగ్‌డన్ స్పోర్ట్స్ క్లబ్(Willingdon Sports Club) వెళ్లిపోయేవాడట. అక్కడ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా గుడ్లు ఎలా తినాలన్నా ఆలోచన నుంచే..ఈ రెసీపీని కనిపెట్టారట పాకనిపుణులు. ఆయన బ్రెడ్‌ని చీజ్‌లో వేయించి దానిపై రెండు గుడ్లు వేయించుకుని ఆపై ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడితో గార్నిష్ చేయించుకుని మరీ తెప్పిచుకునేవాడట. చూసే వాళ్లకు ఏదో చీజ్ బ్రెడ్ తిన్నట్లు కనిపిస్తుంది అంతే..!.
ఆయన ఆవిధంగా అక్కడకు వెళ్లిన ప్రతిసారి అలా ఆర్డర్ చేయించుకుని తినడంతో మిగతా కస్టమర్లలో ఆయన ఏం ఆర్డర్ చేస్తున్నాడనే కుతుహాలం పెరిగింది. ఆ తర్వాత అందరికీ అలా తినడమే నచ్చి ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆ రెసిపీకి ఎగ్స్ కేజ్రీవాల్ అనే పేరు స్థిరపడిపోయింది. అంతేగాదు ఈ రెసిపీకున్న క్రేజ్ చూస్తే నోరెళ్లబెడతారు.
ఎందుకంటే న్యూయార్క్, లండన్ రెస్టారెంట్లలో ప్రసిద్ద బ్రేక్‌ఫాస్ట్ ఇది. అలాగే న్యూయార్క్ టాప్ 10 వంటకాల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈ రెసిపీ. తమషాగా ఉన్న ఈ రెసిపీ స్టోరీ..ఓ మనిషి అభిరుచి నుంచే కొత్త రుచులతో కూడిన వంటకాలు తయారవ్వుతాయన్న సత్యాన్ని తెలియజేసింది కదూ..!. మరీ ఈ రెసిపీ తయారీ విధానం సవివరంగా చూద్దామా..!.
కావాల్సిన పదార్థాలు
తురిమిన చీజ్: 80 గ్రాములు
బ్రెడ్: రెండు స్లైసులు
స్ప్రింగ్ ఆనియన్స్ : 2
పచ్చి మిరపకాయ: 1
నూనె: 1 టీస్పూన్
పెద్ద గుడ్లు: 2
నల్ల మిరియాలు: రుచికి సరిపడ
తురిమిన చీజ్‌లో చక్కగా గోల్డెన్ కలర్‌లో బ్రెడ్‌లు కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మందపాటి గిన్నెలో రెండు గుడ్లను పగలకొట్టి వేసుకోవాలి. వాటిని చిదపకుండా అలానే బ్రెడ్‌పై వేసి కొద్దిసేపు కాల్చాలి. ఆ తర్వాత దానిపై ఆనియన్స్ తురిమిన చీజ్, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ చల్లి సర్వ్ చేయడమే. హెల్తీగానూ కడుపు నిండిన అనుభూతి కలిగించే మంచి బ్రేక్‌ఫాస్ట్ ఇది.
(చదవండి: పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్ కావాలి..!)
Comments
Please login to add a commentAdd a comment