
సాక్షి, హైదరాబాద్(లింగోజిగూడ): 9వ తరగతి విద్యార్థి పట్ల హాస్టల్ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పాత రోడ్డులోని శ్రీ చైతన్య హాస్టల్‌లో పని చేస్తున్న కృష్ణ గత వారం రోజులుగా 9వ తరగతి బాలుడుతో పాటు ఇతర విద్యార్థులను రాత్రి సమయంలో పక్కన పడుకుని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతోపాటు బాలుడు తన తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో బుధవారం హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం హయత్‌నగర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్డెన్ కృష్ణను పాఠశాల యజమాన్యం మంగళవారమే హాస్టల్ నుంచి తొలగించింది. హాస్టల్‌కు అనుమతి లేదని, ఇప్పటికే నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపించామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హీర్యానాయక్ తెలిపారు.
చదవండి: (Hyderabad: ఇక కీలక ఘట్టమే.. నగరంలో ఆ ఫ్లైఓవర్లన్నీ బంద్)