sri chaitanya school
-
శ్రీచైతన్య పాఠశాలలో దారుణం
సాక్షి, హైదరాబాద్(లింగోజిగూడ): 9వ తరగతి విద్యార్థి పట్ల హాస్టల్ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పాత రోడ్డులోని శ్రీ చైతన్య హాస్టల్లో పని చేస్తున్న కృష్ణ గత వారం రోజులుగా 9వ తరగతి బాలుడుతో పాటు ఇతర విద్యార్థులను రాత్రి సమయంలో పక్కన పడుకుని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు బాలుడు తన తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో బుధవారం హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వార్డెన్ కృష్ణను పాఠశాల యజమాన్యం మంగళవారమే హాస్టల్ నుంచి తొలగించింది. హాస్టల్‌కు అనుమతి లేదని, ఇప్పటికే నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపించామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హీర్యానాయక్ తెలిపారు. చదవండి: (Hyderabad: ఇక కీలక ఘట్టమే.. నగరంలో ఆ ఫ్లైఓవర్లన్నీ బంద్) -
స్కూల్ బస్ బోల్తా, విద్యార్థులకు గాయాలు
-
శ్రీ చైతన్య.. కాదది.. తేజ
‘‘ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్నది ఓ స్కూల్ బిల్డింగ్. ఈ ఫొటోల్లో ఒకటి ఉదయం తీసినదయితే... రెండోది మధ్యాహ్నం తీసిన ఫొటో. జాగ్రత్తగా గమనిస్తే ఆ భవనానికి తగిలించిన బోర్డులు మారినట్లు తెలుస్తోంది. ఉదయం తీసిన ఫొటోలో ‘శ్రీ చైతన్య స్కూల్ ’ అనే బోర్డు ఉండగా... రెండో ఫొటోలో ఆ బోర్డు మాయమై... స్కూల్ గేటుకు ‘తేజ ఇంగ్లిష్ మీడియం స్కూల్’ అనే బ్యానర్ కట్టారు. అనుమతి లేకపోయినా శ్రీచైతన్య స్కూల్ పేరుతో పాఠశాలలను నడుపుతున్నారని విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనతో కార్పొరేట్ బోర్డులను తొలగించి పాత స్కూల్ పేరుతో గల బ్యానర్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అదీ ఈ ఫొటోల వెనుకున్న కథ... సాక్షి, కరీంనగర్ : మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు కళ్లు మూసుకోగా... పక్క రాష్ట్రపు కార్పొరేట్ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు రాకపోయినా... యథేచ్ఛగా కరీంనగర్‌లోకి చొచ్చుకు వస్తున్నాయనడానికి ఇదో నిదర్శ నం. తీగలగుట్టపల్లి అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న తేజ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను కొనుగోలు చేసిన శ్రీ చైతన్య గ్రూప్ ‘శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యులం’ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు తీసుకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని బినామీగా చూపుతూ కార్పొరేట్ విద్యాసంస్థ ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఇదొక్కటే కాకుండా కరీంనగర్ సిటీలోనే వావిలాలపల్లిలో, అల్గునూరు, కమాన్ ప్రాంతాల్లో కూడా ఈ పాఠశాలలు ఏర్పాటై అడ్మిషన్లు కూడా ముగించారు. అయితే వీటికి దేనికీ విద్యాశాఖ నుంచి అనుమతులు లేకపోవడం గమనార్హం. వావిలాలపల్లిలో గతంలో అనుమతి లేకుండా శ్రీ చైతన్య పేరుతో నడుపుతున్నారని సీజ్ చేసిన పాఠశాల తిరిగి యధాతథంగా నడవడమే గాక, కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకొంది. బుధవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళనల నేపథ్యంలో మరోసారి సీజ్ చేసేందుకు ప్రయత్నించగా, పాఠశాల యాజమాన్యం పాత స్కూల్ పేరుతో బ్యానర్లు కట్టింది. కళ్లు మూసుకున్న విద్యాశాఖ గత ఫిబ్రవరి నెలలో అనుమతి లేకుండా శ్రీ చైతన్య పాఠశాల పేరుతో నాలుగు బ్రాంచీలు నడుపుతుండడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆందోళన చేసింది. దాంతో ఆ స్కూల్‌ను సీజ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ మీడియాకు తెలిపింది. మళ్లీ ఏం అనుమతులు వచ్చాయని స్కూల్ యధాతథంగా నడిచిందో జిల్లా విద్యాశాఖాధికారికే తెలియాలి. సిక్ అయిన స్కూళ్లను కొనుగోలు చేసిన సదరు కార్పొరేట్ సంస్థ వరంగల్‌లోని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎలాంటి అనుమతి రాకపోయినా, దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసి పాఠశాలల పేరుతో ‘దుకాణాలు’ తెరిచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ‘వ్యాపారం’ సాగిస్తోంది. స్కూళ్లలోనే నోట్‌బుక్స్, టెక్టŠస్ బుక్స్, స్టడీ మెటీరియల్, యూనిఫారాలు, పెన్నులు, పెన్సిళ్లు కూడా విక్రయిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాలుగు చోట్ల వందలాది మంది విద్యార్థులతో పాఠశాలల వ్యాపారం నడుస్తుంటే విద్యాశాఖ డీఈవోకు గానీ, మండలాల్లో ఉండే ఎంఈవోలకు గానీ తెలియకపోవడం. ఈ విషయంలో అధికారుల నటనా కౌశల్యానికి పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి. దీనిపై డీఈవో వెంకటేశ్వర్లును సంప్రదించగా... ‘ఒకే బోర్డుతో నాలుగు పాఠశాలలు నడపడం నిబంధనలకు విరుద్ధం. వెంటనే ఎంఈవోను పంపించి సీజ్ చేయిస్తాం. వరంగల్ ఆర్జేడీ వద్ద ఆయా స్కూళ్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించం’ అనే అరిగిపోయిన రికార్డునే తిరిగి వినిపించడం జరుగుతోంది. విద్యాశాఖ, కార్పొరేట్ విద్యాసంస్థలు కుమ్మక్కై కరీంనగర్లో విద్యావ్యాపారం సాగిస్తున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా, పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వంలోని కొన్ని పెద్ద తలకాయల అండతో కార్పొరేట్ విద్యాసంస్థ కరీంనగర్‌తో పాటు తెలంగాణ జిల్లాలో వేళ్లూనుకొంటోంది. ఉమ్మడి జిల్లానే టార్గెట్‌గా... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థ పలు చోట్ల బ్రాంచీలు తెరిచింది. ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి పేరిట ఈ స్కూళ్లన్నింటికీ అనుమతులు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే గోదావరిఖని, జగిత్యాల, కోరుట్లలో ఈ విద్యాసంస్థ బ్రాంచీలు తెరిచింది. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకొని టెక్నో, ఐఐటీ, ఫౌండేషన్ తదితర తోక పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో నారాయణ. శ్రీ చైతన్యతోపాటు నారాయణ విద్యాసంస్థ కూడా పాఠశాలల గేట్లు తెరిచేందుకు కరీంనగర్‌ను ఎంచుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఫైళ్లు సచివాలయం స్థాయిలో కదులుతుండగా, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల తదితర ప్రాంతాల్లో సిక్ స్కూళ్ల అన్వేషణలో ఏజెంట్లు బిజీగా ఉన్నారు. భాష్యం కార్పొరేట్ సంస్థ కూడా కరీంనగర్లో బ్రాంచీలు తెరిచే ఆలోచనలో ఉంది. తెలంగాణ వచ్చాక ఎక్కువైంది.. తెలంగాణ రాష్ట్రంలో పరాయి పెత్తనం పెరిగింది. కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 60 పాఠశాలలు తెరిచేందుకు శ్రీచైతన్య ఏర్పాట్లు చేసుకొంది. త్వరలో నారాయణ కూడా రాబోతుంది. తెలంగాణ వచ్చాక అందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య దక్కుతుందని భావించిన జనానికి ఇది ఆశనిపాతం. విద్యతోపాటు సంస్కారాన్ని బోధించే స్థానిక ప్రైవేటు పాఠశాలలపై ఉక్కుపాదం మోపే కుట్ర జరుగుతోంది. ఒక వ్యక్తి పేరిట వందలాది పాఠశాలలకు అనుమతి ఎలా ఇస్తారు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. కరీంనగర్లో అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలలను ఏ పేరుతో కూడా నడవకుండా సీజ్ చేయాలి. – ట్రెస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు -
బెజవాడలో స్కూల్ బస్సు బీభత్సం
సాక్షి, అమరావతి బ్యూరో/సత్యనారాయణపురం: విజయవాడలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రహదారిపై డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ ఎదురుగా వెళ్తున్న పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అత్యంత రద్దీగా ఉన్న ఈ రహదారిలో ఉదయం ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న ఉదయం 8 గంటలకు మారుతీనగర్ బ్రాంచికి చెందిన శ్రీ చైతన్య హైస్కూల్ బస్సు(ఏపీ16టీజే 6505)లో డ్రైవర్ పి.దుర్గారావు (30) విద్యార్థులను తీసుకొచ్చేందుకు బయల్దేరాడు. మారుతీనగర్ నుంచి రాజీవ్‌నగర్, సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ, సీతన్నపేట చేరుకుని విద్యార్థులను తీసుకొస్తున్నాడు. అక్కడి నుంచి 8.22 గంటల సమయంలో బీఆర్టీఎస్ రహదారిలో ఉన్న శారదా కళాశాల సెంటర్‌కు చేరుతున్న సమయంలో రోడ్డు రద్దీగా ఉన్నప్పటికీ డ్రైవర్ బస్సును నిలిపే ప్రయత్నం చేయకుండా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు తొలుత ట్రాఫిక్ బారికేడ్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, పండ్లు విక్రయించే రిక్షాను, ఆటోలను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆ వాహనాలన్నీ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కృష్ణలంకకు చెందిన పండ్ల వ్యాపారి షేక్ మస్తాన్‌వలీ (66) తీవ్రంగా గాయపడగా స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డాడు. అలాగే నజీర్ అహ్మద్‌కు చెందిన ఆటో పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో డ్రైవర్ బస్సును రహదారిపైనే విడిచిపెట్టి పరారయ్యాడు. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రేన్ సాయంతో బస్సును స్టేషన్‌కు తరలించారు. హాల్డ్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. శ్రీ చైతన్య హైస్కూల్ బస్సును ప్రతిరోజూ తీసుకెళ్లే డ్రైవర్ శుక్రవారం ఉదయం రాకపోవడంతో హాల్టింగ్ డ్రైవర్‌గా దుర్గారావు విధుల్లోకి వచ్చాడు. ఉదయం బస్సును తీసుకెళ్లి తిరిగి స్కూల్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. బస్సు కండీషన్లోనే ఉందని.. బస్సును పరిశీలించిన రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయచంద్రబాబు ‘సాక్షి’కి తెలిపారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కాలేదని.. ఇంజన్ కండిషన్ కూడా బాగా ఉందని ఆయన వివరించారు. -
భవనం పైనుంచి పడి శ్రీచైతన్య విద్యార్థి మృతి
సాక్షి, విజయవాడ : జిల్లాలోని కంచికచర్ల శ్రీచైతన్య స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న శీలం నాగార్జున సాయిబాబారెడ్డి స్కూల్ భవనం పైనుంచిపడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరుగుతున్న 5కె రన్‌ను చూడడానికి పాఠశాల భవనంపైకి చేరిన సాయిబాబా ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్టు తెలుస్తోంది. అయితే, తల్లిదండ్రులకు చెప్పకుండా స్కూల్ యాజమాన్యం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమారున్ని స్కూల్ యాజమాన్యమే పొట్టనబెట్టుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 5కె రన్‌ను చూడడానికి సాయిబాబా స్కూల్ పైకి వెళ్లడం గమనించిన ప్రిన్సిపాల్ మందలించాడని, దాంతో భయపడి సాయిబాబా పైనుంచి దూకేశాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మృత దేహాన్ని స్కూల్ ఎదుట ఉంచి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. -
మృత్యుంజయుడు
- 50 అడుగుల ఎత్తు నుంచి పడిన బాలుడు - స్వల్ప గాయాలతో బయటపడిన వైనం గన్నవరం: నాలుగేళ్ల చిన్నారి మృత్యుంజయుడని నిరూపించుకున్నాడు. పాఠశాలలో ఆడుకుంటూ సుమారు 50 అడుగుల ఎత్తులో ఉన్న మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందకు పడ్డాడు. అయితే స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, గన్నవరంలోని శ్రీచైతన్య స్కూల్లో బుధవారం జరిగింది. కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన నాలుగేళ్ల నిఖిల్‌చంద్ శ్రీచైతన్య స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. ఉదయం 10.30 గంటల సమయంలో మూడో అంతస్తులోని నర్సరీ క్లాస్రూమ్ పక్కనే ఉన్న ఖాళీ గది కిటికీలో నుంచి కిందకు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి నిఖిల్‌చంద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. -
శ్రీ చైతన్య స్కూల్లో అగ్నిప్రమాదం
అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అక్కడి నుంచి బయటకు పంపింది. శుక్రవారం పాఠశాల నడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో విద్యార్థులు పరుగులు తీశారు. స్వల్ప అగ్నిప్రమాదం కావడంతో ఉపాధ్యాయులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
మంత్రి చొరవతో శ్రీచైతన్య ఫలితాలు విడుదల
సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని శ్రీచైతన్య స్కూల్లో పదో తరగతి చదివిన 54 మంది విద్యార్థుల ఫలితాలు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రిని కలసి ఈ విషయాన్ని వివరించారు. వెంటనే ఆయన ఎస్సెస్సీ బోర్డు డెరైక్టర్ సురేందర్‌రెడ్డితో మాట్లాడారు. నిబంధనలు పాటించకుంటే పాఠశాలపై చర్యలు తీసుకోవాలి కానీ.. ఫలితాలు నిలిపివేయడం సరికాదన్నారు. దీంతో విద్యార్థుల ఫలితాలను విడుదల చేశారు. దీంతో మంత్రికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అంతకుముందు సూర్యాపేటలోని శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థులు దాడి చేశారు. వారం గడచినా ఇంతవరకు ఇక్కడ అభ్యసించిన 54 మంది విద్యార్థుల పదో తరగతి ఫలితాలు వెలువడలేదని ఫ్లెక్సీలను దహనం చేసి, ఫర్నిఛర్‌ను ధ్వంసం చేశారు. వెంటనే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం తమ జీవితాలతో చెలగాటమాడుతోందని విద్యార్థులు మండిపడ్డారు. -
గోదావరిలో విద్యార్థుల మృతదేహాలు లభ్యం
పశ్చిమగోదావరి జిల్లా గోష్పాద క్షేత్రం వద్ద గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. గోదావరి నదిలో ఆదివారం సాయంత్రం స్నానానికి దిగిన నందిగం జయదేవ్(15), గాలింకి సూర్య సుమంత్(15) గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి పోద్దుపోయే వరకు అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు నదిలో ముమ్మరంగా గాలించినప్పటికీ విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకుని ప్రత్యేక ఈతగాడు సోమవారం నదిలో గాలించగా, మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులిద్దరూ కొవ్వూరులోని వేగివారి చావడి ప్రాంతానికి చెందిన వారు. స్ధానిక శ్రీచైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చిన్నారి ‘శ్రీమంతుడు’
-
చిన్నారి ‘శ్రీమంతుడు’
⇒ మృత్యు ముఖంలోనూ ఊరి బాగు కోసం ⇒తపన.. ‘శ్రీమంతుడే’ స్ఫూర్తి ⇒పోలీసుల సహకారంతో బైక్‌పై షికారు చేయాలనే ⇒తన కోరికను నెరవేర్చుకున్న బాలుడు ⇒బ్యాటరీ బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై షికారు హైదరాబాద్: శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబులాగా తన ఊరి బాగు కోసం కృషి చేస్తానంటున్నాడు మృత్యువుకు చేరువలో ఉన్న ఓ చిన్నారి. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఈ బాలుడు.. బైక్‌పై షికారు చేయాలనేది తన కోరికగా చెప్పాడు. ఈ విషయం మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆ మేరకు సోమవారం ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ఎర్రగుంట్లకు చెందిన చాకిబండ పవన్‌కుమార్ (7) అక్కడే శ్రీ చైతన్య స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్లో తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు రామాంజనేయులు, అంజలితో కలసి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షల అనంతరం పవన్‌కు బ్లడ్ కేన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడిని ఎంఎన్జీ కేన్సర్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మూడు నెలల కిందట అక్కడి వచ్చిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులకు తనకు బైక్ నడపాలని ఉందని పవన్ చెప్పాడు. ఈ విషయాన్ని వారు ట్రాఫిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు నుంచి బ్యాటరీ బైక్‌పై పవన్ చక్కర్లు కొట్టాడు. ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్. చౌహాన్, అదనపు కమిషనర్ పాపయ్య, పంజగుట్ట ఏసీపీ మాసుం బాషా, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఉమా మహేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ట్రాఫిక్‌ను నియంత్రించి బాలుడి కోరిక తీర్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తనకు సీబీఐ ఆఫీసర్ కావాలని ఉందని, సినీ నటుడు మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు హర్షగా.. ఊరి బాగు కోసం కృషి చేసినట్లు తాను కూడా తన గ్రామం అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపాడు.