సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని శ్రీచైతన్య స్కూల్‌లో పదో తరగతి చదివిన 54 మంది విద్యార్థుల ఫలితాలు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రిని కలసి ఈ విషయాన్ని వివరించారు. వెంటనే ఆయన ఎస్సెస్సీ బోర్డు డెరైక్టర్ సురేందర్‌రెడ్డితో మాట్లాడారు. నిబంధనలు పాటించకుంటే పాఠశాలపై చర్యలు తీసుకోవాలి కానీ.. ఫలితాలు నిలిపివేయడం సరికాదన్నారు. దీంతో విద్యార్థుల ఫలితాలను విడుదల చేశారు. దీంతో మంత్రికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అంతకుముందు సూర్యాపేటలోని శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థులు దాడి చేశారు.
వారం గడచినా ఇంతవరకు ఇక్కడ అభ్యసించిన 54 మంది విద్యార్థుల పదో తరగతి ఫలితాలు వెలువడలేదని ఫ్లెక్సీలను దహనం చేసి, ఫర్నిఛర్‌ను ధ్వంసం చేశారు. వెంటనే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం తమ జీవితాలతో చెలగాటమాడుతోందని విద్యార్థులు మండిపడ్డారు.
మంత్రి చొరవతో శ్రీచైతన్య ఫలితాలు విడుదల
Published Wed, May 18 2016 8:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement
Advertisement