త్వరగానే క్రమబద్ధీకరణ!
- విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టీకరణ
- సమ్మె పిలుపును ఉద్యోగులు ఉపసంహరించుకున్నారు...
సాక్షి, హైదరాబాద్: ఇంధన శాఖ పరిధిలోని తెలంగాణ ట్రాన్‌సకో, జెన్‌కో, డిస్కంలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సాధ్య మైనంత త్వరగా క్రమబద్ధీకరిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం మేరకు క్రమబద్ధీకరణ జరుగుతుందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన తెలం గాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల సమాఖ్య (టఫ్) ప్రతినిధులతో శనివారం సచివాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమ్మె పిలుపు ఉపసంహరణకు ఉద్యోగ సంఘాలు అంగీ కరించాయని, చర్చలు సఫలమయ్యా యని ప్రకటించారు.
ప్రభుత్వం ఇప్పటికే 8,800 సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులను మంజూరు చేసిందని చెప్పారు. జూనియర్ లైన్‌మెన్ తదితర కేటగిరీలకు సంబంధించి మరో 6 వేల పోస్టులను త్వరలో మంజూరు చేయనుం దన్నారు. అనవసర సమ్మెలకు దిగి ప్రజలు, విద్యుత్ సంస్థలకు నష్టం కలిగిం చొద్దని ఉద్యోగులకు మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపట్ల టఫ్ చైర్మన్, కన్వీనర్‌లు పద్మా రెడ్డి, శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటన నేపథ్యంలో సమ్మె పిలుపును ఉపసం హరించుకుంటున్నామని తెలిపారు. భేటీలో ట్రాన్‌సకో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపా ల్‌రావు, ట్రాన్‌సకో జేఎండీ శ్రీనివాసరావు, జెన్‌కో డెరైక్టర్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
3 సంఘాలే ఉపసంహరించుకున్నారుు: టఫ్ చీలిక వర్గం
టఫ్‌లోని 13 ఉద్యోగ సంఘాల్లో 3 మాత్రమే సమ్మె పిలుపును ఉపసంహరించుకున్నాయని, మరో 8 యూనియన్లు ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటాయని టఫ్ కార్యనిర్వాహక కార్యద ర్శి సారుులు, కో చైర్మన్ వజీర్, వైస్ చైర్మన్ కిరణ్‌లు శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.