విమర్శకులే చీకట్లో ఉన్నారు
రెండున్నరేళ్లలో అన్ని హామీలు నెరవేర్చాం: మంత్రి జగదీశ్‌రెడ్డి
ములుగు: ‘తెలంగాణ ఏర్పడితే చీకట్లోకి వెళతామని నాడు విమర్శించిన నాయకులే నేడు చీకట్లోకి వెళ్లారు.. ప్రజల జీవితాల్లో మాత్రం వెలుగులు నిండాయని’రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రెండున్నరేళ్ల కాలంలోనే పూర్తి చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం పందికుంటలో 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ గిరిజనశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలసి ఆయన బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 సబ్‌స్టేషన్లు, సరఫరా లైన్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు.
26 వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం
పాల్వంచ: రాష్ట్రంలో 26 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను బుధవారం పరిశీలిం చారు. అనంతరం మంత్రి తుమ్మలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.