త్వరలో ‘కాంట్రాక్ట్’ ఉద్యోగాల క్రమబద్ధీకరణ
మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్ర శేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేం దర్, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలసి బుధవారం ఇక్కడ మింట్ కాంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ కాంట్రా క్ట్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల కృషితోనే 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందించడం సాధ్యమైందన్నారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల దోపిడీని అరికడతామని, మధ్య దళారి వ్యవస్థను రూపుమాపతా మని ఈటల అన్నారు.
తెలంగాణ ఉద్యమ రోజుల్లోనే విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడామని, కార్మికుల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంద న్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం వడ్డించాలన్న ప్రతిపాదనల ఫైల్ కూడా 4సార్లు వెనక్కి వచ్చిందని తెలి పారు. పేదల ఆకలి తెలిసిన పార్టీగా తాము అన్ని అడ్డం కుల్ని అధిగమిస్తూ ముందుకు సాగుతామన్నారు. కాంట్రా క్ట్ ఉద్యోగ వ్యవస్థ అత్యంత దుర్మార్గమని, దీనిని రద్దు చేయాలని హరగోపాల్ కోరారు. కరెంట్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తే వారి వేత నాలను కాంట్రాక్టర్లు దోచుకోవడం దారుణమన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరిగే వరకు కార్మికుల పక్షాన పోరాడుతామన్నారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలోని 23 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మిక కుటుంబాల తరఫున యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. శ్రీధర్ గౌడ్, ఎస్.సాయిలు కృతజ్ఞతలు తెలిపారు.