Jobs Regulation
-
నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్ పోస్టులు
వరంగల్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. (టీఎస్ఏసీఎస్లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 129 ► పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–06, అసిస్టెంట్ ఇంజనీర్–02, సూపరింటెండెంట్–08, టెక్నికల్ అసిస్టెంట్–27, జూనియర్ ఇంజనీర్–08, ఎస్ఏఎస్ అసిస్టెంట్–03, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–02, సీనియర్ టెక్నీషియన్–19, టెక్నీషియన్–34, జూనియర్ అసిస్టెంట్–19. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021 ► వెబ్సైట్: www.nitw.ac.in -
రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.1,210 కోట్లకు పైగా అంచనాలతో ఏర్పాటు చేస్తున్న 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీల నమూనాలను పరిశీ లించారు. అనంతరం సీఎం ఇచ్చిన సూచనలు, జారీ చేసిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. ► సంబంధిత రంగంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగు పరచాలి. ► కాలేజీల నిర్మాణం పూర్తయ్యాక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఈలోగా పరిశ్రమల అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి. ► సింగపూర్, జర్మనీ, అమెరికా, యూకే దేశాల్లోని పలు యూనివర్సిటీలు, సంస్థలు మనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల వాటిని ఇందులో భాగస్వాములను చేయాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారికి మేలు జరిగేలా ఎన్ఏసీ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)ని కూడా భాగస్వామిని చేయాలి. 20 రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ► మొత్తం 30 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల నిర్మాణ నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. ఈ 30 కాలేజీల్లో 20 రంగాలలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణ ఇస్తారు. ► దాదాపు 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభి వృద్ధిలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొం దిస్తున్నారు. స్థానిక పరిశ్రమలు, భారీ పరి శ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసర మైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. ► కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, హ్యుందాయ్, వోల్వో, బాష్ వంటి కంపెనీల భాగస్వామ్యం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏపీఎస్సీహెచ్ఈ, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్డ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తారు. ► సమీక్షా సమావేశంలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధు సూదన్ రెడ్డి, ఉన్నతాధికా రులు పాల్గొన్నారు. -
సొంత మండలంలోనే పోస్టింగ్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలం లో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా సెలక్షన్ కమిటీల(డీఎస్సీ) ఆధ్వర్యంలో పోస్టింగ్ ఇస్తారు. ఈ మేరకు విధివిధా నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు పోస్టింగ్ కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను డీఎస్సీల ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. వీలైతే ఈ సమాచారాన్ని ఉద్యోగులు అన్లైన్లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ ఇస్తారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు. ఉద్యోగులకు నేడు నియామక పత్రాలు గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్ష ఫలితాల అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 30వ తేదీన(సోమవారం) జిల్లా కేంద్రాల్లో అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు. విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. జిల్లాల్లో సంబంధిత జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు. అపాయింట్మెంట్ లెటర్ అంటే అభ్యర్థి ఫలానా ఉద్యోగానికి ఎంపికైనట్టు నిర్ధారిస్తూ ఇచ్చే పత్రమని, సదరు ఉద్యోగిని ఎక్కడ విధుల్లో నియమించారనే సమాచారాన్ని వేరుగా అందజేసే పోస్టింగ్ ఆర్డర్లో తెలియజేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. సీఎం కార్యక్రమ షెడ్యూల్ విజయవాడలోని ‘ఎ’ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం ఉదయం 8 గంటలకు కృష్ణా జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికై, కార్యక్రమానికి ఆహ్వానం ఆందినవారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగులకు లాంఛనప్రాయంగా నియామక పత్రాలు అందజేసిన తరువాత వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇలా ఉండగా అన్ని జిల్లా కేంద్రాల్లో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి సందేశాన్ని వినేందుకు వీలుగా అధికారులు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. -
'సచివాలయ ఉద్యోగాలు'.. 30న నియామక పత్రాలు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైనవారందరికీ ఈ నెల 30న ఒకేసారి నియామక పత్రాలు అందించనున్నారు. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అందిస్తారు. జిల్లాల్లో జిల్లాల ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు చెప్పారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని.. అక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో 13 జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులై సెప్టెంబర్ 30 నాటికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాని వారికి వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కాగా, శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగింది. కృష్ణా జిల్లాతో సహా నాలుగైదు జిల్లాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలతో షార్ట్ లిస్టుల జాబితా వెల్లడి పూర్తి కాగా, మిగిలిన జిల్లాల్లో శనివారం నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కేటగిరీ –1 ఉద్యోగాల్లో నాలుగు రకాలకు ఒకే రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తులో ఆ నాలుగింటిలో మొదటి ప్రాధాన్యత కింద కోరుకున్న దాని ప్రకారం ఉద్యోగాల కేటాయింపు చేయాల్సి ఉండడం సంక్లిష్టతతో కూడుకోవడంతో జాబితాల వెల్లడి ఆలస్యమవుతోందని అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడతారని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 2న కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారని వివరించాయి. -
సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు
సాక్షి, అమరావతి : కనీవినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి 1,26,728 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 8 మధ్య నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేర్వేరు ఉద్యోగాలకు విడివిడిగా రాతపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ విజయకుమార్‌లు మంగళవారం ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి రాతపరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,26,728 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా.. 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి మొత్తం 14 రకాల రాత పరీక్షలు నిర్వహిస్తుండగా.. 10 రాత పరీక్షలకు తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈనెల 22 నుంచి హాల్ టికెట్లను అన్లైన్లో ఉంచుతున్నామని, అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. -
నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష
సాక్షి, అమరావతి: ఒకే రాత పరీక్షతో దాదాపు నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించే 19 రకాల ప్రభుత్వ ఉద్యోగాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో పేర్కొన్న ఉద్యోగాలన్నింటినీ ఒకే రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2 ఉద్యోగాలకు సెప్టెంబర్ 1న ఉదయం వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–3లోని ఉద్యోగాల భర్తీకి అదేరోజు సాయంత్రం రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ కేటగిరీల వారీగా ఒకే రకమైన రాత పరీక్ష ఉంటుంది. కేటగిరీ–3లో మాత్రం ఒక్కొక్క రకమైన ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన రాత పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క ఉద్యోగానికి పేపరు–1, పేపరు–2 విధానంలో రాతపరీక్ష నిర్వహించినప్పటికీ రెండింటినీ ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒకేపూట నిర్వహిస్తారు. అంటే కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి అర్హత ఉంటే కేటగిరీ–3లోని పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకుని, రాత పరీక్షకు హాజరు కావొచ్చు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలు అన్నింటికీ ఒకే అభ్యర్థి ఏకకాలంలో పోటీపడే అవకాశం ఉండదు. అదే సమయంలో కేటగిరీ–3లోని 11 రకాల ఉద్యోగాలకు ఒకే అభ్యర్థి రెండు మూడింటికి ఒకే సమయంలో పోటీపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ అభ్యర్థి ఒకే రాత పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యతను దరఖాస్తు ఫారంలో స్పష్టంగా పేర్కొనాలని సూచిస్తున్నారు. సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఒకే విడత 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడంతో దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు, రాతపరీక్ష వంటి అంశాలపై తలెత్తే సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కేటగిరీ–1 ఉద్యోగాలు 1.పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్–5) 2.మహిళా పోలీసు మరియు మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్ (లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3.వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4.వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ కేటగిరీ–2 ఉద్యోగాలు గ్రూప్–ఎ 1.ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2.వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్–2) గ్రూపు–బి 1.విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్–2) 2.విలేజ్ సర్వేయర్ (గ్రేడ్–3) కేటగిరీ–3 కొలువులు 1.విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(గ్రేడ్–2) 2.విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3.విలేజీ ఫిషరీస్ అసిస్టెంట్ 4.డిజిటల్ అసిస్టెంట్(పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5.వార్డు శానిటేషన్ సెక్రటరీ(గ్రేడ్–2) 6.వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ(గ్రేడ్–2) 7.పశు సంవర్థక శాఖ సహాయకుడు 8.ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ(గ్రేడ్–3) 9.వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 10.వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 11.విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ (మహిళా పోలీసు, ఏఎన్ఎం ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు) -
కొలువుల్లోనూ వెనుకబాటే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో ఓబీసీలు వెనుకబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గణాంకాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులుండేవి 69 శాఖలు. వాటిలో దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులుండగా... అందులో 27 శాతం ఉద్యోగులు ఓబీసీ వర్గాలకు చెందినవారుండాలి. కానీ ఈ సంఖ్య 17 శాతానికి మించడం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీలకు అమలు చేస్తున్నారు. 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. కానీ ఈ వర్గానికి చెందిన ఉద్యోగుల సంఖ్య ఎస్సీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు నాలుగు కేటగిరీల్లో ఉన్నారు. ఉన్నతస్థాయి పోస్టులు మినహాయిస్తే మిగతా స్థాయిల్లో వీరిని.. గ్రూప్ ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించారు. గ్రూప్–ఏ కేటగిరీలో ఎస్సీలు 11.5 శాతం ఉండగా.. ఓబీసీలు 6.9 శాతం ఉన్నారు. గ్రూప్–బీలో ఎస్సీలు 14.9 శాతం ఉండగా... ఓబీసీలు 7.3 శాతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగులు, వారి సామాజిక వర్గాల కోణంలో అధికారికంగా తీసుకున్న సమాచారం ఆధారంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఇ.ఆంజనేయగౌడ్ ‘సామాజిక న్యాయం, భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఓబీసీలు’పేరుతో పుస్తకం ప్రచురించారు. అందులో ఈ గణాంకాలను పేర్కొన్నారు. నియామకాల్లో నిబంధనలకు నీళ్లు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా ఉంది. మండల్ కమిషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల భర్తీ తరహాల్లో ఓబీసీ ఉద్యోగాల భర్తీలో మిగులు పోస్టులను క్యారీఫార్వర్డ్ చేయాలి. అలా చేస్తే ఆ పోస్టులు తిరిగి ఆయా వర్గాలకే వస్తా యి. కానీ ఓబీసీల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. యూపీఎస్సీ ద్వారా జరుగుతున్న నియామకాల్లో ఓపెన్ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థి ఉద్యోగం పొందినా.. ఆ పోస్టును రిజర్వేషన్ కోటాలో చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థి తీవ్రంగా నష్టపోతున్నాడు. క్రీమీలేయర్ విధానంతోనూ ఓబీసీలకు నష్టం జరుగుతోంది. దాదాపు పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పూర్తిస్థాయి పోస్టులు భర్తీ చేయకుండా సగానికిపైగా ఖాళీగా ఉంచుతున్నారు. ఎక్కువగా ప్రైవేటు, ఔట్సోర్సింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమ లు చేస్తే ఓబీసీలకు సగం వాటా దక్కుతుంది. అలా చేయకపోవడంతో వెనుకబాటుకు గురవుతున్నారు. – ఇ.ఆంజనేయగౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు -
జాబెప్పుడు బాబూ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ,ముత్తుకూరు : ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీ జెన్కో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించలేదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని వారంతా ఆశించగా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 3వ యూనిట్లో 800 మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఉద్యోగుల నియామకం మాత్రం చేపట్టలేదు. ఈ ప్రాజెక్ట్‌లో 1, 2వ యూనిట్లలో 760 మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు నాలుగేళ్ల క్రితమే జెన్కో యాజమాన్యం 300 పోస్టులను మంజూరు చేసింది. వీరికి జూనియర్ ప్లాంట్ అటెండర్లు (జేపీఏ)గా గుర్తింపునివ్వాలని నిర్ణయించింది. 50 శాతం ఉద్యోగాలు భూములు కోల్పోయిన కుటుంబాలకు కేటాయించాలని సంకల్పించింది. ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో 100 ఏఈ పోస్టులు, సబ్ ఇంజినీర్ల స్థాయిలో 100 పోస్టులు, ఎల్డీసీ, ఫోర్‌మెన్ విభాగాల్లో మరో 100 పోస్టులు భర్తీ చేయాల్సివుంది. నేటికీ జెన్కో యాజ మాన్యం ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకపోగా, కనీసం ఈ అంశాన్ని ప్రస్తావించే పరిస్థితి కూడా లేకుండాపోయింది. 2016 ఫిబ్రవరి 27న జెన్కో 3వ యూనిట్‌కు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అక్కడి వారంతా అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రాలు సమ ర్పించారు. నేటివరకు ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. వాగ్దానం మరిచిన సోమిరెడ్డి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులపాటు కాంట్రాక్ట్ కార్మికులు పనులు నిలిపివేసి ధర్నా చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పాల్గొని కార్మికులకు మద్దతు ప్రకటించారు. చివరి రోజున ఎమ్మెల్సీ హోదాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ప్రాజెక్ట్ సీఈ, ఎస్ఈ సమక్షంలో కార్మికులతో చర్చలు జరిపారు. సీఎం చంద్రబాబు, జెన్కో ఎండీ విజయానంద్‌తో మాట్లాడి 300 పోస్టుల భర్తీకి 10 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయిస్తామని వాగ్దానం చేశారు. ఆ తరువాత సోమిరెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి చేపట్టారు. 7 నెలలు గడిచినా కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. అక్కడ వేల పోస్టులు..ఇక్కడ వందల పోస్టులు రాష్ట్రంలోని విజయవాడ థర్మల్, రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 3 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, నేలటూరు జెన్కో ప్రాజెక్ట్‌లో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య కేవలం 300 లోపు మాత్రమే. సుమారు రూ.5 వేల కోట్లతో 3వ యూనిట్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగుల సంఖ్య పెంచలేదు సరికదా.. ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై ఒత్తిడి పెంచుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పవన విద్యుత్, సౌర విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. థర్మల్ విద్యుత్‌కు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లో పోస్టులను భర్తీ చేయడమెందుకని ప్రభుత్వం భావిస్తుం దేమోనని ఉద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశంతో 300 పోస్టుల భర్తీకి సర్కారు వెనుకంజ వేస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ పీడీసీఎల్) భర్తీ చేస్తుందా లేక ఏపీ జెన్కో నోటిఫికేషన్ ఇస్తుందా అనేది స్పష్టం కాలేదు. -
త్వరలో ‘కాంట్రాక్ట్’ ఉద్యోగాల క్రమబద్ధీకరణ
మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్ర శేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను త్వరలోనే క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేం దర్, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలసి బుధవారం ఇక్కడ మింట్ కాంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ కాంట్రా క్ట్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల కృషితోనే 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందించడం సాధ్యమైందన్నారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల దోపిడీని అరికడతామని, మధ్య దళారి వ్యవస్థను రూపుమాపతా మని ఈటల అన్నారు. తెలంగాణ ఉద్యమ రోజుల్లోనే విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడామని, కార్మికుల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉంద న్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం వడ్డించాలన్న ప్రతిపాదనల ఫైల్ కూడా 4సార్లు వెనక్కి వచ్చిందని తెలి పారు. పేదల ఆకలి తెలిసిన పార్టీగా తాము అన్ని అడ్డం కుల్ని అధిగమిస్తూ ముందుకు సాగుతామన్నారు. కాంట్రా క్ట్ ఉద్యోగ వ్యవస్థ అత్యంత దుర్మార్గమని, దీనిని రద్దు చేయాలని హరగోపాల్ కోరారు. కరెంట్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తే వారి వేత నాలను కాంట్రాక్టర్లు దోచుకోవడం దారుణమన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరిగే వరకు కార్మికుల పక్షాన పోరాడుతామన్నారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలోని 23 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మిక కుటుంబాల తరఫున యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. శ్రీధర్ గౌడ్, ఎస్.సాయిలు కృతజ్ఞతలు తెలిపారు.