మృత్యుంజయుడు
-
50 అడుగుల ఎత్తు నుంచి పడిన బాలుడు
- స్వల్ప గాయాలతో బయటపడిన వైనం
గన్నవరం: నాలుగేళ్ల చిన్నారి మృత్యుంజయుడని నిరూపించుకున్నాడు. పాఠశాలలో ఆడుకుంటూ సుమారు 50 అడుగుల ఎత్తులో ఉన్న మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందకు పడ్డాడు. అయితే స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, గన్నవరంలోని శ్రీచైతన్య స్కూల్‌లో బుధవారం జరిగింది.
కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన నాలుగేళ్ల నిఖిల్‌చంద్ శ్రీచైతన్య స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు. ఉదయం 10.30 గంటల సమయంలో మూడో అంతస్తులోని నర్సరీ క్లాస్‌రూమ్ పక్కనే ఉన్న ఖాళీ గది కిటికీలో నుంచి కిందకు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి నిఖిల్‌చంద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.