'హాస్టల్ లో ర్యాగింగ్ వాస్తవమే'
గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నాగార్జున యూనివర్సిటీ బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ స్వరూప రాణి స్పందించారు. ఆమె కేసు విషయమై శనివారమిక్కడ జిల్లా లోక్ అదాలత్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్ లో ర్యాగింగ్ ఉన్నమాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు.
అయితే రిషితేశ్వరి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని వార్డెన్ చెప్పారు. 'రిషితేశ్వరి మృతి చెందిన రోజు నేను హాస్టల్ కు వచ్చేసరికి డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అప్పటికే రిషితేశ్వరి చనిపోయిందని వర్సిటీ వైద్యాధికారి ధృవీకరించారు. తర్వాత ఆమె మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు' అని స్వరూపరాణి తెలిపారు.