Swarupa Rani
-
ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో.. వెళ్లి చూడగా.. షాక్!
సాక్షి, నల్గొండ/సూర్యాపేట: బాత్రూంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం కాలనీలో నివాసముంటున్న అనుములపురి స్వరూపరాణి(53) సూర్యాపేట మండలంలోని కాసరబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. ఒక కుమార్తె ఉండగా ఆమెకు వివాహం చేసింది. స్వరూపరాణి ఒంటరిగానే ఉంటుంది. ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో కాలనీవాసులు వెళ్లి చూడగా బాత్రూంలో స్వరూపరాణి ముఖం కాలిపోయి అప్పటికే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వరూపరాణి బాత్రూంలో కరెంట్ షాక్‌తో కిందపడి చనిపోయిందా.. లేదా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇవి కూడా చదవండి: తల్లి మందలించిందని.. ఇంట్లో నుంచి వెళ్లి.. చివరికి.. -
అధికార ‘స్వరూపం
– బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ స్థలంలో ట్యాంకు నిర్మాణం – కోర్టు నిబంధనలనూ పట్టించుకోని ప్రథమ పౌరురాలు – తహశీల్దార్ వారించినా వినని మేయర్ – అధికారుల తీరును తప్పుబట్టిన బీఎన్ఆర్ సోదరులు అనంతపురం న్యూసిటీ : మేయర్ తన అధికార స్వరూపాన్ని మరోసారి నిరూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన దూకుడును ప్రదర్శించారు. న్యాయస్థానాలపై గౌరవం లేకుండా మేయర్ వ్యవహరించిన తీరు పై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్లో నీటి ట్యాంకు ఏర్పాటు చేయడంపై మేయర్‌పై క్రిమినల్ కేసు పెట్టేందుకు సైతం అధికారులు సిద్ధమయ్యారు. వివరాల్లోకెళితే అనంతపురంలోని మిస్సమ్మ స్థలంలో ఆదివారం ఓ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థల యజమానులు బీఎన్ఆర్ సోదరులు ఎర్రిస్వామి రెడ్డి, రెడ్డప్పరెడ్డి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ వెళ్లే సమయానికి మేయర్ దగ్గరుండి ట్యాంకు పనులు చేయిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమని, తక్షణం నిర్మాణ పనులు ఆపాలని తహశీల్దార్ శ్రీనివాసులు మేయర్‌కు సూచించారు. ఇక్కడ నిర్మాణాలు చేపడితే కోర్టు ధిక్కారమే అవుతుందని తేల్చి చెప్పారు. చట్టాలు తమకూ తెలుసునని మేయర్ బుకాయించారు. దీంతో మేయర్, తహశీల్దార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మేడమ్.. మీరు ప్రథమ పౌరురాలు మీరే ఇలా చేస్తే ఎలా? అని తహశీల్దార్ మేయర్‌ను నిలదీశారు. ఇప్పుడే ప్రభుత్వ న్యాయవాదితో మాట్లాడానని , నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పారన్నారు. దీనికి మేయర్ స్పందిస్తూ .. తమకు ఏది న్యాయమో తెలుసన్నారు. మేయర్ అనుచరులు సైతం తహశీల్దార్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి తహశీల్దార్‌ను తోసేందుకు యత్నించారు. చివరకు మేయర్... ఎమ్మెల్యేతో మాట్లాడాలని తహశీల్దార్‌కు ఫోన్ ఇచ్చారు. తహశీల్దార్... ఎమ్మెల్యేకు పరిస్థితిని వివరించారు. చివరకు తహశీల్దార్ అందరినీ వీడియో తీయాలని కేసు పెడతామని హెచ్చరించారు. ఈ స్థలం బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్దే – తహశీల్దార్‌తో బీఎన్ఆర్ సోదరులు హై కోర్టు ఈ స్థలం బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు చెందిందని కోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ ఏం నిర్మాణం చేపట్టాలన్నా బీఎన్ఆర్ వారితో అనుమతి తీసుకోవాలని చెప్పారు. దోమలు అధికమయ్యాయని శుభ్రం చేసుకుంటామని కోరితే పట్టించుకోలేదు. ఇవాళ ట్యాంకు కడుతున్నారని అడ్డు చెబితే పక్షులకంటే వేగంగా వచ్చారు. మీరు మెజిస్ట్రేట్‌గా వచ్చారా.? లేక రాజకీయ నాయకుల తొత్తులుగా వచ్చారా.? జిల్లా కలెక్టర్, ఆర్డీఓ సైతం ఈ స్థలం ప్రభుత్వానికి కాదని చెప్పారు. రైట్ రాయల్‌గా ఈ స్థలాన్ని కొనుగోలు చేశాం. నా మాట విననప్పుడు ఏం చేయాలి – తహశీల్దార్ కోర్టును ధిక్కరించి నిర్మాణాలు చేపడుతున్నాని చెప్పా. కానీ మేయర్ వినలేదు. నేనేమి చేయాలి. సమస్యను జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్తా. -
ఏఎన్‌యూలో ర్యాగింగ్ ఉంది
-
'నాగార్జున'లో ర్యాగింగ్ నిజమే
ఆర్కిటెక్చర్ కళాశాల హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి స్పష్టీకరణ సాక్షి, గుంటూరు, ఏఎన్‌యూ: నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతూనే ఉందని వర్సిటీ మహిళా వసతిగృహాల చీఫ్ వార్డెన్ సీహెచ్ స్వరూపరాణి స్పష్టం చేశారు. వర్సిటీలో ర్యాగింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీ నరసింహారెడ్డి వర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు, వార్డెన్ స్వరూపరాణిలను ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. శనివారం వారిద్దరూ న్యాయ సేవాధికారసంస్థ ముందు హాజరయ్యారు. రిషితేశ్వరి మృతి, మహిళా వసతిగృహాలకు సంబంధించిన పలు అంశాలపై వివరణిచ్చారు. వీరు 7న మరోమారు విచారణకు హాజరుకానున్నారు. అనంతరం వార్డెన్ విలేకరులతో మాట్లాడుతూ..‘‘వర్సిటీలో ర్యాగింగ్ ఉంది. గతంలోనూ ర్యాగింగ్ ఘటనలు జరిగాయి. భాగ్యలక్ష్మి అనే విద్యార్థినిపై ర్యాగింగ్ జరిగిన ఘటనకు సంబంధించి గతంలో వర్సిటీ నియమించిన సి.రాంబాబు కమిటీ కూడా ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారించింది. దీంతో ఐదుగురు విద్యార్థినుల్ని హాస్టల్నుంచి పంపించేశాం. అయితే వారిపై విద్యాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు’’ అని తెలిపారు. ప్రిన్సిపల్ బాబూరావు ఆదేశాలతోనే విద్యార్థులు రిషితేశ్వరి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారన్నారు. దీనిపై బాబూరావు మాట్లాడుతూ.. మృతదేహాన్ని తరలించాలని తానెవర్నీ ఆదేశించలేదన్నారు. విద్యార్థుల కోరిక మేరకే పార్టీలో డ్యాన్స్ చేశా నన్నారు. హాస్టల్ వార్డెన్ రాజీనామా.. వర్సిటీలో బాలికల వసతిగృహాల వార్డెన్ బాధ్యతలకు స్వరూపరాణి జూలై 30నే రాజీనామా చేసినట్టు వెల్లడైంది. రిషితేశ్వరి ఘటన అనంతరం తనపై విమర్శలు రావడంతో కలత చెంది రాజీనామా చేసినట్లు ఆమె తెలిపింది. తాను వార్డెన్‌గా నియామకమై జూలై 6కు మూడేళ్లు దాటిందని, పలుమార్లు రిలీవ్ చేయాలని కోరినా కొనసాగించారన్నారు. కాగా రిషితేశ్వరి ఘటనలో విచారణకు సహకరించేందుకు 30వరకు వార్డెన్‌గా కొనసాగానన్నారు. విచారణ కమిటీ గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై నియమించిన విచారణ కమిటీ గడువును ఏపీ ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగించింది. కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం రాసిన లేఖ మేరకు గడువు పెంచినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
'హాస్టల్ లో ర్యాగింగ్ వాస్తవమే'
గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నాగార్జున యూనివర్సిటీ బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ స్వరూప రాణి స్పందించారు. ఆమె కేసు విషయమై శనివారమిక్కడ జిల్లా లోక్ అదాలత్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్ లో ర్యాగింగ్ ఉన్నమాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే రిషితేశ్వరి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని వార్డెన్ చెప్పారు. 'రిషితేశ్వరి మృతి చెందిన రోజు నేను హాస్టల్ కు వచ్చేసరికి డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అప్పటికే రిషితేశ్వరి చనిపోయిందని వర్సిటీ వైద్యాధికారి ధృవీకరించారు. తర్వాత ఆమె మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు' అని స్వరూపరాణి తెలిపారు. -
అంచెలంచెలుగా విజయ అంచులకు...
సఖినేటిపల్లి, న్యూస్‌లైన్ :లక్ష్య సాధనలో అనుకున్నది సాధించకపోతే కొందరు కుంగిపోతారు. మరికొందరు సవాల్‌గా తీసుకుని అనుకున్నది సాధిస్తారు. ఆ కోవకు చెందినవారే స్వరూపారాణి. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకూ నిద్రపోని ధీరురాలు. అందుకే ఆమె కలలుకన్న లక్ష్యం దాసోహమన్నది. ఆమె పట్టుదలకు విజయం మురిసిపోయింది. సివిల్స్‌లో డీఎస్పీగా ఎంపికై సఖినేటిపల్లికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారామె... ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి ఆమె చదువులో నంబరు ఒన్. స్థానికంగా ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమె, మలికిపురం కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ మెరైన్ బయోలజీని ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తిచేశారు. అనంతరం రాజమండ్రిలో బీఈడీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో పోటీ పరీక్షలపై ఆసక్తిని పెంచుకున్నారు. అంచెలంచెలుగా... అంతిమ లక్ష్య సాధనలో ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో సెకండరీ గ్రేడ్ టీచరుగా తొలి ప్రయత్నంలోనే ఎంపికయ్యారు. ఈ వృత్తిలో ఆమె ఏడేళ్లు పని చేశారు. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే గ్రూప్ పరీక్షల్లో విజయం సాధించాలన్న పట్టుదల పెంచుకున్నారు. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల నడుమ కోచింగ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో, ఇంటి వద్దనే ఖాళీ సమయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు చదివేవారు. 2002లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 2007 వరకూ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విధులు నిర్వహించారు. 2007లో జరిగిన గ్రూప్-1 పోటీల్లో విజయం సాధించి ఎంపీడీఓగా ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పలు మండలాల్లో ఎంపీడీఓగా ఆమె విధులను నిర్వర్తించారు. 2008లో తిరిగి గ్రూప్-1 పరీక్ష రాశారు. ఫలితాలను 2012లో ప్రకటించారు. దీనిలో ఆమె డీఎస్పీ కేడర్‌గా ఎంపికయ్యారు. కష్టపడితేనే ఫలితం కష్టపడి చదివితే విజయం వరిస్తుందని స్వరూపారాణి అన్నారు. గ్రూప్-1లో డీఎస్పీ కేడర్‌గా ఎంపికై, ఏపీ పోలీస్ అకాడమీలో శిక్షణ పొంది, ట్రెయినీ డీఎస్పీగా విజయనగరం జిల్లాకు వెళుతున్న సందర్భంగా విజయానికి తోడ్పడిన అంశాలను స్వరూపారాణి ‘న్యూస్‌లైన్’కుఫోన్లో వివరించారు. న్యూస్‌లైన్: మీ కుటుంబం నేపథ్యం స్వరూపారాణి: మాది తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి. తల్లి మేరీగోల్డ్, తండ్రి విజయరత్నం. చిన్నప్పటి నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే పట్టుదలతో చదివాను. అక్కలు, అన్నయ్యలు ప్రోత్సహించారు. న్యూ: గ్రూప్-1లో విజయానికి ఎవరు ప్రోత్సహించారు ? స్వరూపా: నేను గ్రూప్-1 చదవడానికి భర్త కెన్నిబాబు అన్ని రకాలుగా ప్రోత్సహించారు. అత్త,మామలు, కూతుళ్లు ఐశ్వర్య, ఆశ్లేష సహకరించారు. ఇంట్లో ప్రత్యేకంగా చదువుకోడానికి భర్త ఓగదిని ఏర్పాటు చేశారు. అందులోకి ఎవరినీ రానిచ్చేవారు కాదు. ఇంటర్నెట్లో గ్రూప్-1 సమాచారాన్ని సేకరించి, ప్రింట్ తీసి ఇచ్చేవారు. న్యూ: విద్యాభ్యాసం, ఉద్యోగాలు స్వరూపా: పదో తరగతి వరకూ సఖినేటిపల్లి లూథరన్ ఉన్నత పాఠశాల్లో చదివాను. డిగ్రీ మలికిపురంలో పూర్తి చేశాను. బీఈడీ రాజమండ్రిలో చదివి, 1995లో ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యాను. 2002లో ఫిషరీస్ డెవ లెప్మెంట్ అధికారిగా, 2007లో ఎంపీడీఓగా ఎంపికై, 2009లో బిజినేపల్లికి బదిలీపై వెళ్లాను. న్యూ: గ్రూప్-1కు ఎలా సిద్ధపడ్డారు? స్వరూపా: ఇంటి వద్దనే ఉంటూ పుస్తకాలు చదివాను. పత్రికల్లో ప్రచురించే సంపాదకీయాలు చదవడం బాగా ఉపయోగపడ్డాయి. మెయిన్స్ చదవడానికి ఉద్యోగానికి నాలుగు నెలలు శెలవు పెట్టాను. న్యూ: ప్రజాసమస్యలపై మీ స్పందన ? స్వరూపా: పోలీసుగా మహిళల అభ్యున్నతికి కృషిచేస్తాను. మహిళలపై జరుగుతున్న అరాచ కాలపై ప్రత్యేక దృష్టి పెడతాను. దాదాపుగా 22 ఏళ్లుగా వివిధ ఉద్యోగాలు చేసిన అనుభవం ఉంది. ఎంపీడీఓగా ప్రజలతో మమేకమయ్యాను. గ్రామాల్లో సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై కొంత అవగాహన ఉంది. ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను.